Kasthuri Shankar: సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా?- విశాల్ వీడియోపై నటి కస్తూరి తీవ్ర విమర్శలు
తమిళ నటుడు విశాల్ రంజాన్ సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోను సీనియర్ నటి కస్తూరి శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా? అంటూ విమర్శించారు.
Kasthuri Shankar On Vishal Ramzan Special Video: సీనియర్ నటి కస్తూరి శంకర్ తమిళ స్టార్ హీరో విశాల్ ను టార్గెట్ గా సీరియస్ కామెంట్స్ చేశారు. రంజాన్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విశాల్ విడుదల చేసిన స్పెషల్ వీడియోపై మండిపడ్డారు. ఓట్ల కోసం చేసే స్టంట్ లా ఉందన్నారు.
రంజాన్ సందర్భంగా వీడియో రిలీజ్ చేసిన విశాల్
రంజాన్ సందర్భంగా విశాల్ ఓ వీడియో షేర్ చేశారు. మసీదులో కూర్చుని ప్రార్థన చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. “అందరికీ ఈద్ ముబారక్. రంజాన్ శుభాకాంక్షలు. అల్లాహ్ అందరికీ శాంతి సంతోషాన్ని, సానుకూలతను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరూ తమ కుటుంబ సభ్యులతో రంజాన్ పండుగను సంతోషంగా గడపండి. ఆర్య.. నా వన్ డే కోటా బిర్యానీ వేచి ఉంది మాచీ. నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్షా అల్లాహ్. గాడ్ బ్లెస్” అని రాసుకొచ్చారు.
View this post on Instagram
విశాల్ వీడియోపై కస్తూరి విమర్శలు
ఈ వీడియోపై సీనియర్ నటి కస్తూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదో పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు. “విశాల్ 'రంజాన్ స్పెషల్' వీడియో ట్రెండింగ్‌లో ఉంది, కానీ, ఇలా చేయడం అవససరం లేదనుకుంటాను. ఇది సెక్యుర్ భావాన్ని పెంపొందించడమా? లేదంటే స్టంటా?” అంటూ కామెంట్ చేశారు.
View this post on Instagram
నెటిజన్లు ఏమంటున్నారంటే?
అయితే, విశాల్ వీడియోతో పాటు కస్తూరి వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. “ఎవరిదైనా పండుగ పండుగే, హిందువుల పండుగలకు అందరూ దేవాలయాలకు వెళ్లి వేడుకలు జరుపుకుంటారు. ఇతర మతాల వాళ్లు తమ తమ విశ్వాస స్థలాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. విశాల్ మంచి పని చేశారు. సంకుచిత మనస్తత్వంతో ఆలోచించకూడుదు” అంటూ కొందరు నెటిజన్లు విమర్శించారు. “అల్లా ఒక్కడే నిజమైన దేవుడు అని నమ్మే ముస్లీంలు మాత్రమే పవిత్ర స్థలం మసీదులోకి వెళ్తారు. విశాల్ అందులోకి ప్రవేశించి వీడియోలు చేయడం మంచిది కాదు. హిందూ ఆలయాలకు ఎవరైనా వెళ్తారు. కానీ, మసీదు అలా కాదు. ఇకనైనా విశాల్ ఇలాంటి వీడియోలు పెట్టకూడదు. ముస్లీంల మనోభావాలను గౌరవించండి” అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా విశాల్ రంజాన్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కస్తూరి
ఇక సీనియర్ నటి కస్తూరి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. అన్ని భాషల్లోనూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నిజానికి నటి కస్తూరి ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్తారు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు. తన మనసులో మాటను చెప్పేందుకు ఎలాంటి మొహమాటం ఉండదు. తన అభిప్రాయాన్ని విని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పకుండా ఊరుకోరు. ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి పాత్రలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటారు.
Read Also: కోలీవుడ్ హీరో విజయ్ దళపతి మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ‘ది గోట్’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన మేకర్స్!