అన్వేషించండి

Brahmamudi September 27th: కావ్యకి పడిపోయిన రాజ్, రుద్రాణిలో మొదలైన టెన్షన్ - స్వప్న బయటపడుతుందా!

స్వప్నని అడ్డు తప్పించుకోవడం కోసం తనని చంపేయమని రాహుల్ స్కెచ్ వేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Brahmamudi September 27th: స్వప్న తలకి గన్ గురి పెట్టి మైఖేల్ తనని కిడ్నాప్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం రాహుల్ ని కొట్టి తనని తీసుకెళ్లిపోతారు. దెబ్బలకి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయినట్టు నటిస్తాడు. స్వప్న మైఖేల్ ని చూసి ఇంకా బుద్ది రాలేదా అని తిడుతుంది. చావనైన చస్తాను కానీ రావడానికి ఒప్పుకోనని స్వప్న రాహుల్ ని లేపడానికి చూస్తుంది కానీ మెలుకువ లేనట్టు నటిస్తాడు. దీంతో మైఖేల్ వాళ్ళు స్వప్నని బలవంతంగా తీసుకుని వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రాహుల్ లేచి కూర్చుంటాడు. ఇప్పుడు మొదలైంది అసలైన కథ అంటాడు. కావ్య రాజ్ షర్ట్ ఐరన్ చేస్తూ ఉంటే బటన్ ఊడిపోతుంది. అది కుడదామని వచ్చేలోపు రాజ్ వచ్చి షర్ట్ వేసేసుకుంటాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. ఇక రాజ్ ఒంటి మీదనే షర్ట్ కి బటన్ కుట్టేస్తుంది. కాసేపు ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. అదంతా అటుగా వెళ్తున్న ఇంద్రాదేవి చూసి సంతోషపడుతుంది.  కొంచెం కూడా రొమాన్స్ తెలియని మొగుడు దొరికాడు మొరటోడని తిట్టుకుంటుంది. ఆనందంగా ఇంద్రాదేవి సీతారామయ్య దగ్గరకి వెళ్ళి నవ్వుతూ చెప్తుంది.

ఇంద్రాదేవి: రాజ్ లో చాలా మార్పు వచ్చింది. కావ్యతో నడుచుకునే పద్ధతి మారింది. అది చూస్తే చాలా సంతోషంగా ఉంది

సీతారామయ్య: రాజ్ నాకు మాట ఇచ్చిన తర్వాత ఎలా తప్పుతాడు. మాట మీద నిలబడే వంశం మీద పుట్టాడు కదా

Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం

ఇంద్రాదేవి: అనుమానంగా నీకు మాట ఇవ్వడం ఏంటి?

సీతారామయ్య: వ్రతం రోజు కావ్యని బాధపెట్టొద్దని మాట ఇవ్వమని అడిగాను ఇచ్చాడు

రాజ్ కిందకి రాగానే టిఫిన్ తినడానికి తాతయ్యని పిలుస్తాడు. ధాన్యలక్ష్మి గుండీ గురించి మాట్లాడుతూ రాజ్ ని ఆట పట్టిస్తుంది. గుండీ మీరే ఊడగొట్టుకున్నారా అని కావ్య డౌట్ గా అడుగుతుంది. శుభాష్ కి ఫోన్ వస్తుంది. రాహుల్ తలకి దెబ్బ తగిలిందని హాస్పిటల్ లో ఉన్నాడని చెప్తారు. తన కొడుకు నాటకం మొదలు పెట్టాడని రుద్రాణి డ్రామా స్టార్ట్ చేస్తుంది.

శుభాష్: రాహుల్ తలకి గాయమై హాస్పిటల్ లో ఉన్నాడు

రుద్రాణి: ఊటీలో ఉండాల్సిన వాడు దెబ్బ తగిలి హాస్పిటల్ లో ఉండటం ఏంటి?

కావ్య: మరి మా అక్క ఏమైంది  

శుభాష్: ఆ విషయం తెలియదు ముందు హాస్పిటల్ కి వెళ్దామని అందరూ వెళతారు. స్వప్నని మైఖేల్ కట్టిపడేసి ఉంచుతాడు. పోయిన సారి మిస్ అయ్యావ్ కానీ ఈసారి మిస్ చేసుకోనని అంటాడు. తనకి పెళ్లి అయ్యిందని, కడుపుతో ఉన్నానని చెప్తుంది. కానీ మైఖేల్ మాత్రం పర్లేదు చేసుకుంటానని అంటాడు.

స్వప్న: నా రాహుల్ నేను ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తాడు. మిమ్మల్ని కొడతాడు

రౌడీ: అసలు నిన్ను కిడ్నాప్ చేయమన్నదే రాహుల్ అని నోరు జారతాడు

మైఖేల్: వాడిని కొట్టేసి తీసుకొచ్చాము. అయినా ఒక్క దెబ్బకి పడిపోయిన వాడు ఎలా వస్తాడు

రాహుల్ బెడ్ మీద కూర్చుని నర్స్ ని పడేసే పనిలో ఉంటాడు.  రాజ్ వాళ్ళు వచ్చారని తెలిసి స్పృహ లేనట్టుగా పడుకుంటాడు. కొడుకు పరిస్థితి చూడలేక తల్లడిల్లిపోతున్నట్టు రుద్రాణి తెగ నటించేస్తుంది. కావ్య మాత్రం స్వప్న గురించి ఆలోచిస్తుంది. తలకి బాగా బలమైన గాయం అయ్యింది, చాలా బ్లెడ్ పోయింది రక్తం ఎక్కిస్తున్నాం. ఇప్పుడే చెప్పలేమని డాక్టర్ చెప్తాడు. యాక్సిడెంట్ అయ్యిందా అని రాజ్ అంటాడు. కాదు తల మీద ఎవరో రాడ్ తో గట్టిగా కొట్టారని చెప్తాడు. తనతో పాటు మా అక్క కూడా ఉంటుందని కావ్య ఆందోళనగా అడుగుతుంది.

డాక్టర్: ఆమె ఉంటే తానే హాస్పిటల్ కి తీసుకొచ్చేది కదా

కావ్య: తలమీద కొట్టడం ఏంటి? అక్క లేకపోవడం ఏంటి? ఏదో పెద్ద తప్పు జరిగినది. వెంటనే పోలీసులని పిలుద్దాం

రాజ్: ఏం జరిగిందో తెలియాలంటే రాహుల్ స్పృహలోకి రావాలి కదా అంటుండగా నర్స్ వచ్చి రాహుల్ కి మెలుకువ వచ్చిందని చెప్తుంది. అందరూ తనని చూడటానికి వెళతారు

Also Read: ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ- కొడుకు మీద చెయ్యెత్తిన రేవతి!

రాహుల్: కళ్ళు తెరిచి స్వప్న ఎక్కడ? నా స్వప్నని ఎత్తుకుని వెళ్లిపోయారు నేను వెళ్ళి కాపాడాలి మమ్మీ

డాక్టర్: మీరు ఇలా చేస్తే ప్రాణాలకి ప్రమాదం

కావ్య: ఏంటి అక్కని ఎత్తుకెళ్ళిపోయారా?

రాహుల్: అవును.. తనని చంపేస్తారని భయంగా ఉంది

రాజ్: జరిగినది ఏంటో చెప్పు? నేను వెళ్ళి తనని తీసుకొస్తాను

రాహుల్: ఇదంతా నా వల్ల జరిగింది. స్వప్న ఇంటికి వెళ్దామని అంటే వినకుండా బయటకి తీసుకుని వెళ్ళాను. తనకి రింగ్ ఇస్తుంటే వెనుక నుంచి తల మీద కొట్టి స్వప్నని తీసుకుని వెళ్లారు. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ లో ఉన్నాం

కావ్య: అదేంటి మీరు ఊటీ నుంచి కదా వచ్చింది

తరువాయి భాగంలో..

పోలీసులు హాస్పిటల్ కి వస్తారు. మొన్న విగ్రహాల దొంగతనం.. ఇప్పుడు కిడ్నాప్ ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. విగ్రహాలు కూడా డబ్బు కోసం ఎత్తుకెళ్ళినట్టు లేదు ఎవరో మీ మీద పగతో చేసినట్టుగా ఉందని ఇన్ స్పెక్టర్ అనేసరికి రుద్రాణి టెన్షన్ పడుతుంది. రోడ్డు మీద మైఖేల్ కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని కనకానికి చెప్తాడు. ఫోన్లో స్వప్న ఫోటో చూపించి తననే చేసుకుంటున్నానని అనేసరికి కనకం షాక్ అవుతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget