చాణక్య నీతి: వీళ్ల రుణం మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు!
దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా..ఆ రూపంలో 8 మందిని మీ చుట్టూ ఉంచాడు. వాళ్లని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదన్నాడు చాణక్యుడు.
అమ్మ మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లిరుణం మీరు ఏం ఇచ్చినా తీర్చుకోలేరు..అందుకే రుణం తీర్చుకోపోయినా పర్వాలేదు కానీ అస్సలు అవమానించరాదు..
నాన్న తండ్రి లేనిదే మీ పుట్టుక లేదు.. అలాంటి వ్యక్తిని దూషించడం, పట్టించుకోకుండా వదిలేయం చేస్తేవారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని, ఇంత కన్నా పాపం మరొకటి లేదని చెప్పాడు చాణక్యుడు.
గురువు తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం. మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొరపాటునైనా దూషిస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు.
మీ శ్రేయోభిలాషి తల్లిదండ్రులే కాదు..మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు. వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావొచ్చు, చుట్టుపక్కల కావొచ్చు, బయటివారు కావొచ్చు.
మీకు భోజనం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోందన్నది నిజమే కానీ ఆ డబ్బు అన్ని వేళలా ఆకలి తీర్చలేదు కదా. ఈ సత్యాన్ని ముందు గ్రహించాలన్న చాణక్యుడు..మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదు
స్నేహితుడు స్నేహితుల్లో..ఉత్తములు ఉంటారు, అధములు ఉంటారు. ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి. కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రిలాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని దూషించకండి
భార్య తల్లిదండ్రులు చాలామంది మగవారు..తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు కానీ.. భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వారు ఎవ్వరి తల్లిదండ్రులనూ దూషించలేరు
సంరక్షకులు తల్లి, తండ్రి స్థానంలో సంరక్షకులుగా ఉంటారు కొందరు. వాళ్లు కూడా అహర్నిశలు మీ బాగుకోసం పాటుపడుతూ ఉంటారు. వారిపై విధేయత చూపాలి. లేదంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు..