భగవద్గీత: తపస్సు చేయాల్సిన పనిలేదు - ఇలా ఉన్నా 'యోగి' అంటారు



శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్‌శరీర విమోక్షణాత్‌
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః॥



దేహత్యాగానికి ముందు ఎవరైతే కామక్రోధానలు జయిస్తారో వాళ్లనే యోగి అంటారని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు బోధించాడు



ఇంద్రియాలు ఎప్పుడూ బాహ్యవిషయాలపైనే ఆసక్తిని కలిగిస్తాయి



కోరికలకు కామాలే కానీ ఫుల్ స్టాప్ ఉండవు...ఒకటి తీరితే మరొకటి పుట్టుకొస్తాయి



అందుకే కోర్కెలను పూర్తిగా తీర్చుకోవడం అసాధ్యం



తీరక పోతే క్రోధం ఏర్పడుతుంది..



అగ్నిని పొగ కప్పేసినట్టు...జ్ఞానాన్ని క్రోధం కప్పేస్తుంది



జ్ఞానం, వివేకం లేనివారు మనిషులం అనే విచక్షణ కోల్పోయి పాపకార్యాలకు పాల్పడతారు



‘ఈ శరీరాన్ని విడువక ముందే (జీవించి ఉండగానే) కామ క్రోధాదులను అదుపులో ఉంచుకోగలవారే యుక్తుడు, యోగి అవుతారు



Images Credit: Pinterest