ABP Desam


భగవద్గీత: ఈ ఒక్క లక్షణం మీ జ్ఞానాన్ని కప్పేస్తుంది


ABP Desam


శ్లోకం
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్||


ABP Desam


అగ్ని కనిపించకుండా పొగ కప్పేస్తుంది, అద్దం కనిపించకుండా మురికి మూసేస్తుంది, గర్భంలో శిశువు మావితో కప్పి ఉంటాడు అలాగే ఎంత జ్ఞానిని అయినా కామం కప్పేస్తుందని బోధంచాడు శ్రీ కృష్ణుడు


ABP Desam


కామం ఎవ్వరికైనా నిత్యవైరి. శత్రువులు అయితే కొంత కాలానికి మిత్రులు అవుతారు కాని ఈ కామం సాధకునికి జన్మశత్రువు


ABP Desam


అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాలవైపు లాగి అథ:పతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది


ABP Desam


సాధకులనే కాదు..ఈ కామం పండితులను, రాజులను, చక్రవర్తులను, ఋషులను, బలవంతులను, ఇంద్రుడిని ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది.


ABP Desam


ఆధ్యాత్మిక సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలెన్నో


ABP Desam


వివేకం, ఆత్మ విచారంతోనే ఈ కామాన్ని జయించాలని సూచించాడు శ్రీ కృష్ణుడు


ABP Desam


Images Credit: Pinterest