ఇంట్లో ఏ రోజు ధూపం వేస్తే ఎలాంటి ఫలితం! పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల్లో ధూపం ఒకటి. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు ఇల్లంతా ధూపం వేయడం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా..ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. ఆదివారం గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేస్తే.. సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటికి సంబంధించిన సమస్యలుండవు, అప్పుల బాధ తొలగిపోతుంది. బుధవారం ధూపం వేస్తే.. నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటూ పెద్దల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి, అన్నింటా విజయం అందుకుంటారు శనివారం సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. Images Credit: Freepik