శుక్లాంబరధరం శ్లోకం వెనుక ఇంత అర్థం ఉందా!



ఏ పూజ చేసినా ప్రధమంగా వినాయకుడిని పూజిస్తారు..ముందుగా చదివేది ఈ శ్లోకమే



శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే



తలపెట్టిన కార్యంలో ఎలాంటి విఘ్నాలు ఎదురవకుండా ఆశీర్వదించాలని కోరుకుంటారు. మరి ఇంత చిన్న శ్లోకంలో ఉన్న భావం ఏంటో తెలుసా..



శుక్లాంబరధరం- తెల్లటి వస్త్రాలను ధరించినవాడని అర్థం. తెలుపు పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిత్వంగా కలిగినవాడని అర్థం



అంబరం - ‘వస్త్రం’ అనీ ‘ఆకాశం’ అనీ రెండు అర్థాలు ఉన్నాయి. అంటే ఆకాశాన్నే వస్త్రంగా ధరించినవాడు అన్న అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాప్తి అయిన ఈశ్వరుని తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం



విష్ణుం - విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం, శశివర్ణం - చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు అని భావం



చతుర్భుజం- నాలుగు చేతులు కలవాడు. ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు కావచ్చు



తాను స్వయంగా అర్థం చేసుకుని వేదవ్యాసునికి రాసిపెట్టిన నాలుగు వేదాలు కావచ్చు; మనుషులను తరింపచేసే ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలు కావచ్చు.



ప్రసన్నవదనం ధ్యాయేత్‌- ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నానని అర్థం
(Images credit/Pixabay)


Thanks for Reading. UP NEXT

2023 : వినాయక పూజ ఏ టైమ్ లో చేయాలి!

View next story