2023 : వినాయక పూజ ఏ టైమ్ లో చేయాలి! చవితి తిథి 18, 19 తేదీల్లో రెండు రోజుల్లోనూ ఉండటంతో పండుగ నిర్వహణపై వివిధ వర్గాల్లో ఏ రోజు పండుగ చేసుకోవాలనే అనుమానాలు తలెత్తాయి. సెప్టెంబరు 18 సోమవారమే చవితి పండుగ జరుపుకోవాలని పండితులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18వ తేదీ సోమవారం ఉదయం 10:15 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషాలు వరకూ ఉంది సూర్యోదయానికి తిథి ఉండడం ముఖ్యమే కానీ... చవితి పండుగ రోజు వాడవాడలా వినాయకుడు కొలువుతీరి పూజలందుకునేసరికి మధ్యాహ్నం అవుతుంది సెప్టెంబరు 18 సోమవారం అయితే ఉదయం పదింపావు నుంచి రోజు మొత్తం ఉంది. సెప్టెంబరు 19 మంగళవారం రోజు చవితి తిథి 11 గంట్లలోపే వెళ్లిపోతోంది. సెప్టెంబరు 18 సోమవారం దుర్ముహూర్తం టైమింగ్స్ - మధ్యాహ్నం 12 .25 నుంచి 1.09 వరకూ.. తిరిగి మధ్యాహ్నం 2.46 నుంచి 3.35... సెప్టెంబరు 18 సోమవారం వర్జ్యం సాయంత్రం 4.56 నుంచి 6.36 వరకూ వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్న సమయాల్లో పూజ ప్రారంభించకూడదు... సెప్టెంబరు 18 ఉదయం 10.15 నుంచి 12.20 మధ్యలో కానీ తిరిగి మధ్యాహ్నం 1.10 నుంచి 2.45 మధ్యలో కానీ పూజ ప్రారంభించుకోవచ్చు... (Representational Images/Pixabay)