కష్టాలు తీర్చే అష్టవినాయక ఆలయాలివే- మీరెన్ని దర్శించుకున్నారు!
వినాయకుడికి ప్రత్యేక క్షేత్రాలు అనగానే కాణిపాకం అని ఠక్కున చెబుతారు. ఇంకా చాలా ఉన్నాయి...అయితే అన్నిటిలో మరింత ప్రత్యేకం అష్టవినాయక ఆలయాలు. అన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి
మహాగణపతి (Ranjangaon) త్రిపురాశుర సంహారం చేసిన శివుడు తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడంటారు
సిద్ధి వినాయకుడు (Siddhatek) శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగంలో ప్రత్యక్షమైన వినాయకుడు మధుకైటభులనే రాక్షసులను మట్టుబెట్టాడు. శ్రీ మహావిష్ణువే స్వయంగాగణపతిని ప్రతిష్ఠించాడట.
గిరిజాత్మజ వినాయకుడు (Lenyadri) ఎత్తైన కొండమీద ఒక గుహలో కొలువై ఉంటాడీ వినాయకుడు. స్వామి దర్శనం కోసం 238 మెట్లు ఎక్కాలి. నలుగు పిండితో విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిక్కడి విగ్రహం.
బల్లాలేశ్వరుడు (Pali) బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. బల్లాల్ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి ఆ పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం.
వరద వినాయకుడు (Mahad) ఓ పిల్లవాడి భక్తికి మెచ్చిన గణనాథుడు కోరిన వరం ప్రసాదించి అక్కడే స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ గర్భగుడిలోని దీపం వందేళ్లుగా అఖండంగా వెలుగుతోందని చెబుతారు
చింతామణి గణపతి (Chintamani Ganapathi) షోలాపూర్ పుణె మార్గంలో ఉండే థేవూర్ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు.
మయూరేశ్వరుడు( Morgaon) పుణె జిల్లా బారామతి సమీపం మోర్‌గావ్ గ్రామంలో వెలసిన వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరంపై దర్శనమిస్తాడు.
విఘ్న వినాయకుడు (Ozar) విఘ్నాసురుడనే రాక్షసుడు జపతపాదులకు భంగం కలిగించేవాడు. మునుల ప్రార్థన మేరకు యుద్ధానికి దిగాడు వినాయకుడి శక్తి తెలుసుకుని కొద్దిసేపటికే మోకరిల్సిన ఆ రాక్షసుడు తన పేరుమీద అక్కడే కొలువుతీరాలని వేడుకున్నాడు.