Krishna Mukunda Murari September 26th: ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ- కొడుకు మీద చెయ్యెత్తిన రేవతి!
మురారీ ప్రేమ తనకే సొంతమని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna Mukunda Murari September 26th: ముకుంద ఆదర్శ్ ఫోటో కాకుండా మురారీని జల్లెడలో నుంచి చూస్తుండటాన్ని కృష్ణ గమనిస్తుంది. ముకుంద చేసిన పనికి కృష్ణ చాలా బాధపడుతుంది. అలేఖ్య ముకుంద చెప్పిందని మురారీని కావాలని తన దగ్గరకి వెళ్ళేలా చేస్తుంది. కృష్ణ కోసం వెళ్ళిన మురారీని వెనుక నుంచి కళ్ళు మూసి కౌగలించుకుంటుంది. దీంతో మురారీ కోపంగా తనని వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు.
ముకుంద: నేను పిలిస్తే రావని అలేఖ్యతో అబద్ధం చెప్పించాను. ఇందులో తన తప్పేమీ లేదు
మురారీ: ప్లీజ్ ఎందుకు ఇలా రోజురోజుకీ శాడిస్ట్ లాగా మారిపోతున్నావ్
ముకుంద: నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు చంపేస్తే చస్తాను కానీ నిన్ను వదలను
మురారీ: ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావ్. ఎవరైన చూస్తే య్ ఏమనుకుంటారు
ముకుంద: నాకు నువ్వు నీ ప్రేమ మాత్రమే కావాలి
ALso Read: రాజ్ ని ఓడించిన కళావతి - కళ్యాణ్ ని చితక్కొట్టిన అప్పు- స్వప్న కిడ్నాప్!
అలేఖ్య కింద కంగారుగా ఉండటం చూసి అటుగా వెళ్తున్న రేవతి గమనిస్తుంది. కోపంగా వెళ్ళి ఏం చేస్తున్నావని అడుగుతుంది. కవర్ చేసేందుకు అలేఖ్య ట్రై చేస్తుంది కానీ రేవతి తన చెంప పగలగొడుతుంది. నిజం చెప్తావా ఇంకొక చెంప పగలగొట్టించుకుంటావా?
అలేఖ్య: కృష్ణ ఉందని అబద్ధం చెప్పించి ముకుంద మురారీని పైకి పంపించమని చెప్పింది. ఎవరూ రాకుండా తనని ఇక్కడ కాపలాగా ఉండమని చెప్పింది
రేవతి: ఇప్పుడు వాళ్ళిద్దరూ పైనే ఉన్నారా?
అలేఖ్య: అవును
ముకుంద: ఇప్పుడే మనం వెళ్ళి భవానీ అత్తయ్యకి నిజం చెప్పి మన పెళ్లి చేయమని అడుగుదాం. ఆదర్శ్ కి మన సంతోషం తప్ప ఇంకేం అవసరం లేదు. పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. మన పెళ్లి గురించి మాట్లాడదాం
మురారీ తనని విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడే రేవతి వచ్చి వాళ్ళని చూస్తుంది. మురారీ తనని గట్టిగా విదిలించుకుంటాడు. రేవతి కోపంగా వాళ్ళ దగ్గరకి వెళ్తుంది.
రేవతి: ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి మురారీ మీదకి చేయి లేపుతుంది
ముకుంద: ఇందులో మురారీ తప్పేమీ లేదు నేనే తనని
రేవతి: నువ్వు మాట్లాడకు.. అనేసి మురారీని అక్కడ నుంచి పంపించేస్తుంది. రేవతి వెళ్లబోతుంటే ముకుంద ఆపుతుంది.
ముకుంద: మురారీ లేకుండా నేను బతకలేను. నా జీవితాన్ని అన్యాయం చేయవద్దు ప్లీజ్ అంటుంది కానీ రేవతి వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఎవరు ఎన్ని చేసిన మురారీని వదులుకోనని అనుకుంటుంది. కృష్ణ ముకుంద తండ్రి శ్రీనివాసరావుని కలిసేందుకు వెళ్తుంది.
శ్రీనివాసరావు: ఎప్పుడు రాని దానివి ఈ టైమ్ లో వచ్చావ్ ఏంటి?
కృష్ణ: మంచి విషయం చెప్పడానికి వచ్చాను. ఆదర్శ్ తప్పకుండా తిరిగి వస్తాడు నన్ను నమ్మండి. ముకుంద జీవితం బాగుంటుంది
శ్రీనివాసరావు: ఈ విషయం నిన్ను చెప్పమని ఎవరైనా పంపించారా? నువ్వే వచ్చావా?
Also Read: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!
కృష్ణ: ఎందుకు అలా అంటున్నారు
శ్రీనివాస్: కొన్ని జీవితాలు మారవు. నా కూతురు జీవితం కూడా అంతే
కృష్ణ: నేను అంత త్వరగా ఎవరికీ మాట ఇవ్వను. ఒకవేళ ఇస్తే ప్రాణం మీదకి వచ్చినా తప్పలేదు. చిన్నప్పుడు అమ్మకి ఇచ్చిన మాట కోసం కష్టపడి చదివి డాక్టర్ అయ్యాను. మీరు నా తండ్రిలాంటి వాళ్ళు. నేను మీ చిన్న కూతురు అనుకోండి. ఆదర్శ్ ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను తీసుకొస్తాను. మీకు మా పెద్దత్తయ్య ఇచ్చిన మాట నేను నిలబెడతాను. ముకుంద జీవితం బాగుంటుంది మీరేం దిగులు పడొద్దు అని ధైర్యం చెప్పేసి వెళ్ళిపోతుంది.
ఇంటికి వచ్చి మురారీ కోసం వెతుకుతుంది. ముకుంద తనని పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నావని అంటుంది. గుడికి వెళ్ళి వస్తున్నావా? మీ కాపురం బాగుండాలని దేవుడికి మొక్కుకుని వస్తున్నావా?
కృష్ణ: గుడికి కాదు నేను మీ నాన్న దగ్గరకి వెళ్ళి మాట ఇచ్చి వస్తున్నా. అర్థం కాలేదా? నేను మీ ఇంటికి వెళ్ళి నీ గురించి మాట్లాడేసి వరం ఇచ్చి వస్తున్నా
ముకుంద: నా పర్మిషన్ లేకుండా ఎందుకు వెళ్ళావ్
కృష్ణ: నీకు ఎందుకు అంత టెన్షన్
ముకుంద: ఎందుకు వెళ్ళావ్? వరం ఏంటి?
కృష్ణ: మీ నాన్నకి హామీ ఇచ్చి వస్తున్నా. ఇంట్లో అందరికీ భర్తలు కళ్ళ ముందే ఉంటున్నారు. కానీ ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా అందుకే.. సమస్య పరిష్కరిద్దామని వెళ్ళాను. నీ జీవితాన్ని ఒక ఒడ్డుకి చేరుస్తానని మాట ఇచ్చాను
ముకుంద: ఇది నా పర్సనల్ విషయం
కృష్ణ: ఇది నీ పర్సనల్ విషయం కాదు ఫ్యామిలీ విషయం. ఎవరు ఎటు పోతే నాకేంటి అని స్వార్థంతో ఆలోచించకు