Brahmamudi November 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఆస్తి కోసం తెగించిన రుద్రాణి – కళ్యాణ్ పై అనామిక అనుమానం నిజమైందా?
ఆస్తి కోసం రుద్రాణి ఇంట్లో వాళ్లతో గొడవ పడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగింది. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
‘‘నలుగురిలో నన్ను జోకర్ ను చేయడంలో నువ్వు సక్సెస్ అయ్యావు. మంచిదానిలా నటిస్తూ నన్ను నవ్వుల పాలు చేశావు’’ అంటూ రాజ్ కావ్యను తిడుతుంటాడు. ‘‘పొరపాటైతే మార్చొచ్చు అలవాటైన దాన్ని ఏంచేసినా మార్చలేము’’ అని వెళ్లిపోతాడు. ‘‘రాజ్ కోపంలో అర్థం ఉంది. అక్క చేసిన తప్పుకు నేను హెల్ప్ చేశాననుకుంటుంన్నాడు. ఇప్పుడెలా ఈయన్ని మార్చాలి’’ అని మనసులో అనుకుంటూ బాధపడుతుంది కావ్య. హాల్లో అందరూ దిగాలుగా ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు. ఇంతలో బామ్మ ఆస్తి పేపర్లు తీసుకొచ్చి టీపాయ్ మీద పెడుతూ....
బామ్మ: అరేయ్ నేను సుమంగళిగానే పోవాలనుకుంటున్నాను. పుణ్య స్త్రీగా ప్రాణాలు విడవాలంటే నా ఐదోతనం కాపాడుకోవాలి. దుఃఖం వల్ల మనసు బలహీనమవుతుంది. ఆలోచించే పరిస్థితిని దుఃఖం మింగేస్తుంది. ఇప్పుడు కావాల్సింది నా దురదృష్టాన్ని తలుచుకుని కుమిలిపోవడం కాదు. పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. నాకు బయటి ప్రపంచం తెలియదు. మీరంతా ఎరిగినవాళ్లు నా భర్త ప్రాణాలు నాకు బిక్ష వేయండి.
అంటూ బామ్మ ఏడుస్తూ కొంగుచాపి అడుగుతుంది. దీంతో అందరూ బాధపడతారు.
కావ్య: అమ్మమ్మగారు మీరు బాధపడకండి. ఏం కాదు.
ధాన్యలక్ష్మీ: అవును అత్తయ్య మీరు బాధపడకండి
బామ్మ: నాకు ఇప్పుడు కావాల్సింది ఓదార్పు కాదు. పరిష్కారం. ఇదిగో ఇందులో చాలా డబ్బు ఉంది. నగలు ఉన్నాయి తీసుకోండి ఈ నగలు ఆస్తులు అమ్మేయండి. ఏ దేశంలో నా భర్త ప్రాణాలు నిలబెట్టగలిగిన డాక్టర్లు ఉంటారో అక్కడికి తీసుకుని వెళ్లండి. ఏంత ఖర్చు అయినా భరించి ఆయన్ను కాపాడుకుందాం.
రుద్రాణి: అమ్మా ఎంత ఖర్చు పెట్టినా ఆస్తి కరిగిపోవడం తప్పా ప్రయోజనం ఏం ఉంటుంది. ఒకవేళ ఆ అవకాశమే ఉంటే రాజ్, కానీ పెద్దన్నయ్య కానీ ఆ పని ఎప్పుడో చేసుండేవారు కదా!
బామ్మ కోపంగా రుద్రాణి చెంప పగులగొట్టి..
బామ్మ: రుద్రాణి ఏమంటున్నావ్.. ఆస్తి కరిగిపోతుందా? తరిగిపోతుందా? లేకుండా పోతుందా? రోడ్డు మీద పడతావా? ఇవన్నీ ఆలోచించి చేయడానికి నేను చేయమన్నది వ్యాపారం కాదు ఆయుష్షు పోసే యాగం చేయమంటున్నాను. అందులో సమిధలుగా ఆస్థులే అయితే పెట్టి తీరాల్సిందే! ఇన్నాళ్లు మనందరిని కాపాడుకుంటూ వచ్చిన ఒక పెద్ద దిక్కుకు ఆపద వస్తే.. చేతులు ముడుచుకుని కూర్చుంటావా?
అపర్ణ: అయినా ఆస్థుల గురించి ఎవ్వరికీ రాని ఆలోచన నీకెలా వచ్చింది రుద్రాణి. కడుపుకు ఇంట్లో అన్నమే కదా పెడుతున్నారు. నీ బోడి సలహాలు ఎవ్వరూ అడగలేదు ఇక్కడ.
రుద్రాణి: నేను మన మంచి కోసమే అన్నాను.
సుభాష్: మన మంచి కోసం అనలేదు. నీ మంచి కోసం అన్నావు.
ధాన్యలక్ష్మీ: అత్తయ్యగారు. ఎంత బాధలో ఉన్నారో తెలిసి కూడా నీ బుద్ది చూపించుకోకు రుద్రాణి.
బామ్మ: ఈ అనవసరమైన మనుషుల కోసం కాలయాపన చేయోద్దు. నాకు కావాల్సింది పరిష్కారం. నాకు కావాల్సింది నా భర్త ప్రాణం. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా మళ్లీ ఈ ఇంట్లో తిరగాలి. ఆయన ప్రాణాలతో లేని రోజు ఈ చిట్టి కూడా ప్రాణాలతో ఉండదని గుర్తుంచుకోండి.
రాజ్: నాన్నమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కష్టం ఈ ఇంటికి వస్తే ఇక్కడున్న అందరూ చేష్టలుడిగి కూర్చున్నారు. కానీ నువ్వు మాత్రమే కర్తవ్యం కోసం దుఃఖాన్ని దిగమింగుకున్నావు. జరిగిపోయిన దాన్ని తలుచుకుని బాధపడకుండా జరగాల్సిన దానిపై దృష్టి పెట్టమంటున్నావు. ఈ కాలంలో ఎంతమంది ఇంత ఆత్మనిబ్బరంతో ఉంటారో నాకు తెలియదు.
ఈ కలుపు మొక్కల గురించి నీవు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రాజ్ బామ్మను ఓదారుస్తాడు. తాతయ్యను పూర్తి ఆరోగ్యంతో నీకు అప్పజెప్తానని హామీ ఇస్తాడు. ఆమెరికాలో ఉండే స్పెషలిస్టు డాక్టర్‌తో మాట్లాడినట్లు త్వరలోనే ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేస్తాడు. ఈ ఆస్తులే కాదు మా సర్వస్వం ధారపోసి తాతయ్యను బతికించుకుందామని రాజ్ భరోసా ఇస్తాడు.
అనామిక అప్పు వాళ్ల ఇంటికి వస్తుంది. కళ్యాణ్ తన ఫోన్ లిప్ట్ చేయడం లేదని అప్పు ఫోన్ నుంచి కళ్యాణ్‌కు కాల్ చేయమని చెప్తుంది అనామిక. అప్పు వద్దంటుంది. అనామిక ఫోన్ లాక్కుని కళ్యాణ్‌కు కాల్ చేస్తుంది. కళ్యాణ్ కాల్ లిప్ట్ చేయగానే కోసంగా
అనామిక: నేను కాల్ చేస్తే లిప్ట్ చేయలేదు అప్పు ఫోన్ నుంచి చేస్తే వెంటనే లిప్ట్ చేశావు.
కళ్యాణ్: అంటే ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు.
అనామిక: అంటే ఇప్పడు బాగుపడ్డాయా?
అని అడగగానే అలాగే ఉన్నాయి కానీ అప్పు నా ఫ్రెండ్ ఎం చెప్పినా అర్థం చేసుకుంటుంది. అని కళ్యాణ్ చెప్పగానే అనామిక కోపంగా నేను నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేనా? అనగానే కళ్యాణ్ సారీ చెప్తాడు. ఇకపై నేనెప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది.
రుద్రాణి ఏడుస్తున్నట్లు నటిస్తూ వాళ్ల నాన్నగారి గదిలోకి వెళ్లి కాలీ బాండ్ పేపర్స్ చూపిస్తుంది. ఆయన ఎంటివి అని అడగగానే..
రుద్రాణి: కాలీ పేపర్స్.. మీ మనసులో ఎంత సంచలనం చెలరేగుతుందో నాకు తెలుసు నాన్నా.. మీ ఆరోగ్యం కోసం ప్రతిక్షణం నేను దేవుణ్ని ప్రార్థిస్తునే ఉన్నాను. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
అంటూ రుద్రాణి చెప్తుండగానే ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.