Brahmamudi November 7th : రుద్రాణిని ఇంట్లోంచి అపర్ణ గెంటేసిందా? రాజ్‌ను కావ్యను కలిపిన తాతయ్య
రుద్రాణి అనాథ అని ఆమెను మామయ్యగారు చేరదీశారని అపర్ణ చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
రాజ్ వాళ్ల ఇంట్లో అందరూ సమావేశమవుతారు. జరిగిన విషయం గురించి తాతయ్య ఒక నిర్ణయం తీసుకున్నారని.. ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని బామ్మ చెప్తుంది. తాతయ్య తన నిర్ణయాన్ని చెప్పబోతుంటే.. రాహుల్ ఒక్క నిమిషం తాతయ్య అనగానే ఆయన చెప్తుంటే అడ్డుతగులుతావేంట్రా అంటుంది.
రాహుల్: కోర్టులో కూడా తీర్పు చెప్పే ముందు కోర్టుకు చెప్పుకునేది ఏమైనా ఉందా? అని జడ్జి గారు అడుగుతారు బామ్మ. నాక్కూడా అలాంటి అవకాశం కావాలంటున్నాను.
తాతయ్య: చెప్పరా ఇది ఏకపక్ష నిర్ణయం కాదు. మన కుటుంబ సభ్యుల మనస్సుల్లో ఏలాంటి అభిప్రాయం ఉందో అది తెలుసుకుని మాట్లాడాలనుకున్నాను నేను. సరే నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పు.
రాహుల్: నేను తప్పు చేశాను. ఒక్కతప్పు కాదు చాలా తప్పులు చేశాను. స్వప్నని ప్రేమించడం తప్పు, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం కూడా తప్పు. కానీ ఇంత పెద్ద కుంటుంబంలో నేను చేసిన పని వల్ల మచ్చ వస్తుందేమోనని భయంతో స్వప్న గురించి చెప్పలేకపోయాను. పెళ్లి చేసుకున్నాక తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా చూసుకున్నాను. తను ఏది కోరినా కాదనలేదు. అంత మంచిగా చూసుకున్నా స్వప్న మనందరిని మోసం చేసింది. అందుకే నేను స్వప్నతో ఇక కాపురం చేయలేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు మాత్రం విడాకులు ఇప్పించండి.
అని కరాకండిగా చెప్తాడు. దీంతో తాతయ్య రుద్రాణిని అభిప్రాయం అడుగగా.. తనకు విడాకులు ఇప్పించడమే ఇష్టమని చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా
అపర్ణ: ఇంతదాకా వచ్చాక స్వప్నతో పాటు కావ్యను కూడా పంపించేద్దాం. రాజ్‌కు విడాకులిప్పిద్దాం.
రుద్రాణి: అదే మంచిది. తప్పు చేయడమే తప్పు కాదు. తప్పు చేయించడం కూడా తప్పే. వీళ్లిద్దరు ఈ వంశానికి ఈ కుటుంబానికి కోడళ్లుగా పనికిరారు.
కావ్య: నేను చెప్పుకునేది కూడా ఉంది. నాకు కొంచెం అనుమతి ఇస్తారా?
అపర్ణ: ఆ అవకాశం దాటిపోయింది.
కావ్య: కానీ ఇది మీరనుకున్నంత సులువైన విషయం కాదు అత్తయ్య.
అపర్ణ: ఏయ్ అత్తయ్యా అని పిలిచే అర్హత ఈ క్షణం నుంచి నీకు లేదు.
స్వప్న: పోనీ నేను చెప్పుకునేది ఉంది. అదైనా వింటారా?
అనగానే రుద్రాణి నీకంత సీన్ లేదు కానీ ముందు బయటికి నడవవే అనగానే స్వప్న కోపంగా నేను బయటికి పోవాల్సి వస్తే మీ అందరిని బయటికి లాగుతాను అంటూ బెదిరిస్తుంది. రుద్రాణి, స్వప్న ఇద్దరూ తగువులాడుతుంటే
సుభాష్: ఆపండి ఈ తప్పులో రాహుల్ కు భాగముంది. ముందు వాడు మోసం చేయడం వల్లే స్వప్న ఈ అబద్దం ఆడి పెళ్లి చేసుకుంది. కాబట్టి రాహుల్, రాహుల్ కు సపోర్టు చేసిన రుద్రాణి, భర్తని, అత్తని మోసం చేసిన స్వప్న ముగ్గురూ కలిసి బయటికి వెళ్లండి.
రుద్రాణి: అన్నయ్య న్యాయమూర్తిని పక్కన పెట్టి నువ్వు జడ్జిమెంట్ పాస్ చేస్తావేంటి?
సుభాష్: నీ కోడులు కోర్టుకు వెళ్తానంటుంది.
రుద్రాణి: అందుకు కోడలును గెంటివేయండి. మమ్మల్ని ఎందుకు వెళ్లమంటున్నావ్.
సుభాష్: అసలు తప్పు మీ ముగ్గురిలోనే ఉంది. దరిద్రం వదలాలంటే మీ ముగ్గురే వెళ్లాలి.
స్వప్న: అలాగే వెళ్తాం అంకుల్.. మా ఆస్తి మాకు పంచండి. వెళ్లిపోతాం.
అపర్ణ: మీ ఆస్థా..? నీ పుట్టింటి నుంచి ఏం తెచ్చావ్.. రుద్రాణి అత్తింటి నుంచి ఏం పట్టుకొచ్చింది. కట్టుబట్టలతో వచ్చింది. మామయ్యగారు దయతలచి పెంచి పెద్దచేసి పెళ్లి చేశారు. అంతే నీ అత్తకే గతి లేదు. ఎవరి ఆస్థి ఎవరికి పంచాలి.
అనగానే రుద్రాణి కోపంగా నాన్న కంటేనే కూతురా? నన్ను పెంచారు. చదివించారు. పెళ్లి విషయంలో నా ఇష్టాఇష్టాలు పట్టించుకోకుండా ఎవడికో ఇచ్చి నా గొంతు కోశారు. వాడే కనుక సవ్యంగా ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటాను. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఆస్థి విషయంలో నేను ఎక్కడిదాకానైనా వెళ్తాను అని బెదిరిస్తుంది రుద్రాణి. ఇంతలో తాతయ్య గారికి స్ట్రోక్ వస్తుంది. అందరూ కంగారు పడుతూ ఆయనను ఒక దగ్గర కూర్చోబెట్టి టాబ్లెట్ వేస్తారు.
రుద్రాణి: ఈ ఇంట్లో అందరూ ఇంతకాలం నటిస్తూనే ఉన్నారు. ఆఖరికి నువ్వు కూడా తప్పించుకోవడానికి ఎత్తు వేస్తున్నావా నాన్నా..
అనడంతో రాజ్ కోపంగా రుద్రాణిని తిట్టి తాతయ్యకు కాన్సర్ ఉంది. ఆయన ఇక ఎంతో కాలం బతకరు అని నిజం చెప్తాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. అందరూ తాతయ్య చుట్టూ చేరి బాధపడుతుంటారు. తాతయ్య అందరూ కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. దీంతో బామ్మ కోపంగా తాతయ్య అభిప్రాయమే ఫైనల్ అని చెప్తుంది. తాతయ్య స్వప్నను కావ్యను దగ్గరకు తీసుకుని మీరంతా కలిసి సంతోషంగా ఉండటమే నాకూ సంతోషం మీరు ఆవేశపడకుండా హ్యాపీగా ఉండండి. అని చెప్తాడు. మీకోసం మేము కలిసే ఉంటామని చెప్తుంది స్వప్న. రాజ్‌ను పిలిచి కావ్య చేతులను రాజ్ చేతిలో పెట్టి కావ్యను మనఃస్ఫూర్తిగా భార్యగా స్వీకరించమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ అయిపోతుంది.