అన్వేషించండి

Brahmamudi November 4th :తాతయ్యకు నిజం చెప్పిన కావ్య – ఇద్దర్నీ ఇంట్లోంచి వెళ్లపోమని వార్నింగ్‌ ఇచ్చిన అపర్ణ!

స్వప్న, కావ్యలను బయటకు వెళ్లమని అపర్ణ వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారింది. మరోవైపు సుభాష్ కూడా కావ్యను తప్పుపట్టడంతో కావ్య బాధపడుతుంది

Brahmamudi Serial November 4th Episode: పెళ్లి అయిన తర్వాత నిజం చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు. మనకు చెప్పలేదు. సరే కనీసం తన భర్త రాజ్‌కు అయిన నిజం చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు. అర్థం చేసుకోండి అని అపర్ణ చెప్పగానే సుభాష్‌ ఆలోచనలో పడిపోతాడు.

అపర్ణ: ఇంత జరిగినా నా కొడుక్కి జరిగిందేంటి? మోసం.  భార్య చేతిలో మోసపోయాడు అందరి ముందు తల దించుకున్నాడు. అంత ప్రేమ చూపించినా సరే భార్య మోసం చేసిందంటే ఏ భర్త అయినా ఎలా తట్టుకుంటాడు. ఇప్పుడు రాజ్‌ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా?  అంతెందుకు అందరూ కలిసి కావ్యను ఇంట్లోంచి తరిమేస్తే మీరు ఇంట్లోకి తీసుకొచ్చారు కదా? మరి మీకు చెప్పిందా? మిమ్మల్నే కాదు తను ఇంట్లో అందరిని మోసం చేసింది.  

అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. సుభాష్‌ ఆలోచిస్తూ ఉండిపోతాడు. మరోవైపు రుద్రాణి, రాహుల్‌,  స్వప్న మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంటారు.

రాహుల్‌ : తల తిరిగిపోయింది మమ్మీ. ఇన్నాళ్లు డమ్మీ అనుకున్న స్వప్న అంతలా రెచ్చిపోయిందేంటి? ఇదసలు ఎక్స్‌ పెక్ట్‌ చేయలేదు. తప్పు చేసింది కదా ఇంత పెద్ద బాంబు పేల్చుతున్నాం ఈజీగా బయటికి గెంటేయొచ్చు అనుకున్న.. కానీ ఇంతలా మార్చేస్తుంది అనుకోలేదు. ఇన్నాళ్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే తింగరిది అనుకున్న కానీ ఇప్పుడు మనల్నే తింగరోళ్లను చేసింది.

రుద్రాణి : అది ఎంత తెలివైనది అయినా కావోచ్చు. కాని తప్పు చేసి దొరికిపోయింది. ఏం చేసైనా సరే దాన్ని ఇంట్లోంచి గెంటేయాలి.

రాహుల్‌ : అది ఈ ఇల్లు  వదిలిపెట్టి పోతుందని నాకైతే అనిపించడం లేదు మమ్మీ. నువ్వు కోపంగా చూసిన నిజం అదే మమ్మీ. ఇన్నాళ్లు కావ్య తెలివైనది అత్తకు కంచులా తయారైంది అనుకున్నాం. మనకేదైనా ప్రాబ్లమ్‌ వస్తే కావ్య నుంచే వస్తుంది అనుకున్నాం. కానీ ఈరోజు కావ్య సైలెంట్‌ అయిపోయింది. ఆ స్వప్న రెచ్చిపోయింది.

రుద్రాణి : అదే మనకు బలమైంది.

అని కావ్యతో పాటు స్వప్నను ఇద్దరిని ఇంట్లోంచి గెంటేయడానికి ప్లాన్‌ చేస్తారు. మరోవైపు బామ్మ పాలు తీసుకుని తాతయ్య దగ్గరకు వెళ్తుంది. కావ్య అబద్దం చెప్పదని.. స్వప్న కావాలని కావ్యపై నిందలు వేసిందని తాతయ్య చెప్తాడు. 

కావ్య టీ తీసుకొచ్చి అపర్ణకు ఇస్తుంది. అపర్ణ టీ కప్పు తీసుకుని కోపంగా నేలకోసి కొడుతుంది.

అపర్ణ : ఇంత జరిగినా కూడా ముఖానికి వేసుకున్న ముసుగు తీయవా? నీ అసలు రంగు నిన్న అందరి ముందు బయట పెట్టేసిందిగా.. ఇంకా ఎందుకు ఈ మంచితనం అనే ముసుగులో నటిస్తావ్‌..

కావ్య: అత్తయ్య గారు మీరు పూర్తిగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు.

అపర్ణ : నేను ఎప్పుడో నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇంట్లో వాళ్లకు ఇప్పుడే అర్థం అయ్యింది. చేసిన నాటకాలు ఆడిన డ్రామాలు చాలు . మీ తట్ట బుట్ట తీసుకుని మీకై మీరు బయటికి వెళ్లిపోతే చాలా మంచిది. అదే మామయ్యగారు ఒప్పుకున్నాక మేము పంపిచాలనుకుంటే మాత్రం ఇలా పద్దతిగా వెళ్లలేవు.

అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. సుభాష్‌ కూడా నేను ఏమీ చేయలేనని, నిజం నీకు తెలియగానే వచ్చి నాకు చెప్తే ఇవాళ నేనే నీకు అండగా ఉండేవాడిని ఇప్పుడు పూర్తిగా నేనే నీకు సాయం చేయలేనని చెప్తాడు. దీంతో కావ్య బాధగా తాతయ్య దగ్గరకు వెళ్తుంది.

కావ్య: తాతయ్య గారు ఈ ఇంట్లో ఎవరు ఏమనుకున్నా మీరు మాత్రం నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అండగా నిలబడ్డారు. కానీ నిన్న జరిగిన సంఘటనతో మీకు కూడా నామీద కోపం వచ్చుంటుంది కదా తాతయ్యగారు.

అని మీరు నిర్ణయం తీసుకునే ముందు మీకు ఒక నిజం చెప్తాను. స్వప్నకు కడుపు లేదని వాళ్ల పెళ్లి జరిగిన రోజే నాకు తెలసింది. కానీ అంత మంది ముందు ఇంటి పరువు తీయలేక నిజం చెప్పలేకపోయాను. తర్వాత అక్కకు నిజం చెప్పమని చెప్పాను. కానీ నిజం ఇంట్లో వాళ్లకు తెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అందుకే నిజం చెప్పలేకపోయానని తాతయ్యకు చెప్పి వెళ్లిపోతుంది. కావ్య.

స్వప్న బెడ్‌ రూంలో కూర్చుని ఉంటే రాహుల్‌ వచ్చి

రాహుల్‌ :  ఏం చేస్తే ఇక్కడే పర్మినెంట్‌గా ఉండిపోవచ్చని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఏమీ చేయలేవు. తప్పు చేశావ్‌. మా అందరికీ దొరికిపోయావ్‌.

స్వప్న : తప్పా.. నేను చేశానా? ఈ మాట ఇంట్లో  ఎవరైనా అనొచ్చు కానీ నువ్వు అనకూడదు రాహుల్‌. అసలు తప్పు అనే పదానికి మీనింగే నువ్వు. మోసానికి కేరాఫ్‌ అడ్రస్సే నువ్వు

అంటూ ఇద్దరూ గొడవ పడతారు. నేను నిజంగా ప్రేమలో పడింది నీతోనే కానీ నువ్వు మాత్రం నాకు డబ్బు లేదని తెలిసి వేరే వారితో పెళ్లికి సిద్దమయ్యావు అంటుంది స్వప్న. మీరెన్ని ప్లాన్స్‌ వేసినా నిన్ను ఈ ఇంటిని వదిలే ప్రసక్తే లేదని కరాకండిగా చెప్పేసి వెళ్తుంది.

కావ్య దేవుడి దగ్గర నిలబడి బాధపడుతూ

కావ్య: ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కృష్ణ. అసలు నేను ఎం అడుగుతున్నాను. నువ్వేం ఇస్తున్నావ్‌. ఇప్పుడిప్పుడే మా ఆయన మారుతున్నాడని సంతోషపడ్డాను.  కానీ ఇప్పుడు జరిగిన సంఘటనతో నా మీద ప్రేమ మాట అటుంచితే పూర్తిగా ధ్వేషం పెంచుకున్నాడు.

అంటూ కావ్య దేవుడి దగ్గర బాధపడుతూ తన కష్టాలను చెప్పుకుంటుంటే ఇవాళ్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget