Brahmamudi March 27th: రాజ్ కి మందు తాగిచ్చి కావ్య మీదకి రెచ్చగొట్టిన రాహుల్- నిజం తెలుసుకున్న అప్పు
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సెక్యూరిటీకి దొరికిపోతుందేమోనని అప్పుని కళ్యాణ్ పక్కకి లాగేస్తాడు. అక్కని చూడటానికి వచ్చానని చెప్తుంది. అప్పుడు నీతో పాటు మీ అక్కని కూడా తీసుకువెళ్లిపోవాలని చెప్తాడు. ఈ ఇంట్లో మీ అక్క ఉండాలంటే పుట్టింటి వాళ్ళతో నేరుగా ఫోన్లో మాట్లాడకూడదని కండిషన్ ఉందని చెప్పేసరికి అప్పు బాధగా అక్క బాగుంటే చాలని చెప్పి బాధగా వెళ్ళిపోతుంది. కావ్య మంచి నీళ్ళ కోసం కిచెన్ లోకి వెళ్తుంటే అపర్ణ అడ్డుపడుతుంది. ఆ వంక ఈ వంక పెట్టుకుని వంటగదిలోకి రావడానికి వీల్లేదని ఖరాఖండీగా చెప్తుంది. తనని అవమానించినందుకు కావ్య చాలా బాధపడుతుంది. అప్పు తల్లిని తిడుతుంది. ఆ కోటీశ్వరుల కోడలు ఈ ఇంటికి ఎప్పుడైనా వస్తుందానని అప్పు అడుగుతుంది. వస్తుందిలే అని కనకం అబద్ధం చెప్తుంది. కావ్య వాళ్ళ అత్త పెట్టిన కండిషన్ గురించి తనకి తెలుసని అంటుంది. నాన్నకి చెప్పకు ఆయన తట్టుకోలేరు దిగులు పెట్టుకుని మంచాన పడతారని బతిమలాడుతుంది.
Also Read: వేదకి ఐలవ్యూ చెప్పిన యష్- సెలెబ్రేషన్స్ లో నిప్పు పెట్టేసిన విన్నీ
ఇంద్రాదేవి పంతులుని ఇంటికి పిలిపిస్తుంది. ఈరోజు రాత్రి 10.20 నిమిషాల దగ్గర నుంచి అంతా బాగానే ఉందని అమ్మాయిని అబ్బాయి గదిలోకి పంపించమని పంతులు చెప్తాడు. రాజ్ కి ఇష్టం లేని పెళ్లి జరిగింది వచ్చిన అమ్మాయి మీద మనసు లేదు. ఇంత సడెన్ గా శోభనం అంటే వాడి మనసు సిద్ధపడాలి కదా. నేను కూడా ఈ అమ్మాయిని కోడలిగా ఒప్పుకోలేకపోతున్నానని అపర్ణ చెప్తుంది. ఈ విషయాన్ని ఇంతమంది డిస్కస్ చేయడం ఇబ్బందిగా ఉందని రాజ్ అంటాడు. రాజ్ ఈ పెళ్లి వల్ల జరిగిన అవమానం నుంచి కోలుకోలేదని అపర్ణ అంటుంది. రాజ్ కోపంగా కావ్య దగ్గరకి వెళ్ళి ఇష్టం లేదని చెప్పమని అంటే తనకి ఇష్టమేనని మీరు కూడా ఒప్పుకోండని కావ్య అంటుంది. అదంతా రాజ్ ఊహించుకుంటాడు. ఈ కళావతి పంతానికి అయినా ఒప్పుకుంటుందని అనుకుని ఆఫీసుకి వెళ్లాలని అంటాడు. మనవడి ఇష్టాఇష్టాలు కూడా పట్టించుకోవాలి కదా అని అపర్ణ అంటుంది.
అందం, చందం, అణుకువ, పద్ధతి అన్నీ ఉన్నాయి. కాదనుకోవడానికి కారణాలు ఏమి లేవు. మీరందరూ కలిసి ఆ అమ్మాయిని కోడలిగా ఒప్పుకుని తీరాల్సిందే. లేదంటే మనం అందరం తనకి అన్యాయం చేసినట్టు అవుతుందని ఇంద్రాదేవి ఖరాఖండీగా చెప్పేస్తుంది. రాజ్ మాట్లాడబోతుంటే రాహుల్ అడ్డుపడి ఆపుతాడు. ఈ కార్యక్రమం జరిగి తీరుతుందని రాజ్ తాతయ్య తెగేసి చెప్తాడు. రాజ్ ని పెళ్లి చేసుకోవడం కోసం నన్నే అంత బ్యాడ్ చేస్తుందా ఆ ఇంట్లో నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వనని స్వప్న కావ్యకి ఫోన్ చేయబోతుంటే రాహుల్ ఫోన్ లాగేసుకుంటాడు. ఆవేశంలో ఫోన్ చేస్తే మీ చెల్లికి దొరికిపోతాం అప్పుడు నిన్ను నన్ను విడదీస్తారని మాయమాటలు చెప్తాడు. కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంది. మీ అక్కకి మా అన్నయ్యకి శోభనం జరగబోతోందని సిగ్గు పడుతూ చెప్తాడు. కనకం అప్పు దగ్గర ఫోన్ లాక్కుని అది విని సంతోషపడుతుంది. పొరపాటున కూడా ఎవరు ఇక్కడికి రావొద్దని గొడవలు జరుగుతాయని అంటాడు.
Also Read: రాజ్యలక్ష్మి పరువు గోవిందా, ధర్నాకి దిగిన దివ్య- బిజినెస్ డీల్ వద్దన్న నందు
కావ్య శోభనం వద్దని ఎలా చెప్పేదని ఆలోచిస్తూ ఉండగా ఇంద్రాదేవి నగలు, బట్టలు రెడీ తీసుకొస్తుంది. శోభనం పెళ్లి కూతురిలాగా ముస్తాబు చేస్తానని అంటుంది. కానీ కావ్య మాత్రం సుముఖంగా ఉండదు. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఈ తంతు జరిపిస్తున్నామని ఇంద్రాదేవి అంటుంది. ఇప్పటికీ ఈ ఇంటి కోడలిగా గుర్తించబడలేదు, ఈ పెళ్ళితో రాజ్ కి నాకు మనసు గాయపడింది. ఇటువంటి సమయంలో ఇలాంటి తంతు జరిపించినంత మాత్రన ఇప్పటి వరకు జరిగినవి మర్చిపోగలమా అని అంటుంది. దూరం ఆలోచించి ఈ ఏర్పాట్లు చేశామని ఇంద్రాదేవి చెప్తుంది. తనకి ఆత్మాభిమానం ఉంటుందని తన మనసులో ఉన్న బాధని అంతా చెప్పుకుంటుంది. ప్రతి జీవితంలో పెళ్లి తర్వాత వచ్చే శోభనం స్థిరత్వం కోసం అస్తిత్వం కోసమని ఇంద్రాదేవి చక్కగా చెప్తుంది. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు మీ పెద్దరికాన్ని గౌరవించి వెళ్తానని అంటుంది.