Brahmamudi June 14th: స్వప్నని కాపాడిన రాజ్- అసలు నిజం తెలుసుకున్న కావ్య పెళ్లిని ఆపుతుందా?
స్వప్న, రాహుల్ పెళ్లి ఫిక్స్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అక్క ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తానని కావ్య వెళ్తుంది. వెనుకే రాజ్ ని పంపిస్తాడు పెద్దాయన. తమ ప్లాన్ ఫలించినందుకు రాహుల్ నవ్వుకుంటారు. కావ్య ఆవేశంగా వెళ్తుంటే రాజ్ ఆపి ఎక్కడికని వెళ్తున్నావని అంటాడు. ఇంట్లో పెళ్లి జరుగుతుంది, తప్పకుండా ఇంట్లో వాళ్ళు ఎవరో మాయం చేశారు. ఇందులో రాహుల్ హస్తం ఉండి ఉండవచ్చు కదా అని కావ్య అనుమానపడుతుంది. అక్కడ కెమెరా మెన్ ఉంటే అందులో ఫోటోస్ చూసి కల్యూ కోసం వెతుకుతాడు. ప్రతి ఫోటోలో వెయిటర్ మైఖేల్ ఉండటం రాజ్ గమనించి కావ్యకి చూపిస్తాడు. వాడు నిన్న రాత్రి మా అక్క వద్దు అన్నా కూడా కూల్ డ్రింక్ ఇవ్వడానికి ట్రై చేశాడని కావ్య చెప్తుంది. అక్కడే ఉన్న వెయిటర్ ని పిలిచి మైఖేల్ గురించి అడుగుతాడు. నలుగురు వచ్చారు, ఈవినింగ్ నుంచి వాళ్ళు కనిపించలేదని చెప్పడంతో ఇద్దరూ కలిసి వెతకడానికి వెళతారు.
స్వప్నని కిడ్నాప్ చేసిన రౌడీలు తనని ఒక చోటుకి తీసుకొస్తారు. స్వప్నకి మెలుకువ వచ్చి లేస్తుంది. అన్నయ్య అలా అనకు ఈ పెళ్లి కోసం చాలా కష్టపడ్డాను తనని వదిలేయమని బతిమలాడుతుంది. తనని బలవంతంగా డెన్ లోకి తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. పెళ్లి మండపంలో రుద్రాణి నోటికి పని చెప్తుంది. ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే వెళ్ళి తీసుకురావచ్చు కానీ ఇదంతా ఒక నాటకమని రుద్రాణి అంటుంది. నా రాజ్ తీసుకొస్తాడని నమ్మకం ఉందని అపర్ణ చెప్తుంది. తన కూతురు ఇలా చేసేది కాదని కనకం బతిమలాడుతుంది.
Also Read: వేదని అందరి ముందు దోషిని చేసిన మాళవిక- అభిమన్యుని కత్తితో పొడిచిన వసంత్
రుద్రాణి; ఆ రోజు స్వప్న రాజ్ పెళ్లి నుంచి వెళ్లిపోవడానికి రాహుల్ కారణం అన్నారు. తప్పు చేయలేదని నా కొడుకు ఎంత చెప్పినా మీరు నమ్మలేదు పెళ్లికి ఒప్పించారు. ఈ ఇంటి పరువు కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు మరి ఇప్పుడేమైంది? ఇప్పటికీ నా కొడుకు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. నిజంగా రాహుల్ మోసం చేసి ఉంటే స్వప్న వచ్చి కూర్చుని తాళి కట్టించుకోవాలి కదా మరి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ రోజు రాజ్ కంటే రాహుల్ బెటర్ అని ట్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కొడుకు కంటే ఎవరో బెటర్ అనిపించి ఉంటారు అందుకని వాడితో వెళ్ళిపోయింది
మీనాక్షి: నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు
రుద్రాణి: మా అదృష్టం బాగుండి మీడియాని పిలవలేదు పిలిచి ఉంటే మా పరువు ఏమై ఉండేది. అయినా పరువు గురించి మీతో మాట్లాడటం ఏంటి? అదే ఉంటే ఇలా ఎందుకు చేస్తారు. రాహుల్ కి మాయ మాటలు చెప్పి తనతో సంబంధం పెట్టుకుంది. ఇష్టం వచ్చినట్టు తిరిగి కడుపు చేయించుకుంది. రేయ్ రాహుల్ లేరా
అపర్ణ: ఇప్పుడు ఏం చేయాలి
రుద్రాణి: మీ అందరూ స్వప్నతో పెళ్లి చేయాలంటే మీ మాటకి విలువ ఇచ్చి పెళ్లికి ఒప్పించాను. ఇప్పుడు స్వప్నతో తప్పని తేలింది. అందుకే ఈ పెళ్లి రద్దు చేయండి, స్వప్న ఎలాంటిదో తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి మీరే సరిదిద్దాలి. వెన్నెలకి ఇచ్చి పెళ్లి చేయాలి
అపర్ణ: ఏం మాట్లాడుతున్నావ్ కొంచెమైన తెలివి ఉందా? ఒక ఆడపిల్లని కడుపు చేసిన వాడితో నా ఫ్రెండ్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమనడం కరెక్టా
కృష్ణమూర్తి: అసలు తను ఎక్కడికి వెళ్లిందో తెలియకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదమ్మా వేరే అమ్మాయితో మీ అబ్బాయికి పెళ్లి చేస్తే చావడం తప్ప మరొక మార్గం లేదు
రుద్రాణి: నాకే ఇలాంటి కూతురు ఉంటే ఎప్పుడో చచ్చిపోయే దాన్ని
Also Read: తను ప్రేమించింది ఎవరినో చెప్పిన ముకుంద- కొడుకు, కోడల్ని ఒక్కటి చేసేందుకు రేవతి హోమం
సీతారామయ్య: అవకాశం దొరికింది కదా అని మాట్లాడకు నీ మాటలు వాళ్ళ తలరాతని మార్చేస్తాయ్
రుద్రాణి: అలాంటి ఆడదానికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి అయిన తర్వాత ఇంకొకడితో వెళ్లిపోదని ఏంటి గ్యారెంటీ