Ennenno Janmalabandham June 14th: వేదని అందరి ముందు దోషిని చేసిన మాళవిక- అభిమన్యుని కత్తితో పొడిచిన వసంత్
మాళవికని తీసుకొచ్చి వేద తన ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద మీద ఆదిత్య అరవడంతో యష్ సీరియస్ అవుతాడు. తను ఉన్న పరిస్థితి అలాంటిది బాగా డిస్ట్రబ్ అయ్యాడు, తనని నార్మల్ పరిస్థితిలోకి తీసుకురావాలని సర్ది చెప్తుంది. కనకపోయినా కన్నతల్లి ప్రేమ నీలో చూస్తున్నానని అంటాడు. వీళ్ళ మాటలు విన్న మాళవిక సంబరపడుతుంది. నాకు తెలుసు ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో, నాకు లేని ఆనందం నీకు ఉండనివ్వనని అనుకుంటుంది. వేద వెళ్లిపోగానే ఆదిత్య నిద్రలేస్తాడు. అబ్బా ఇలా పక్క తడిపేశానా ఎవరూ చూడకముందే ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. అసలే మమ్మల్ని బయటకి పంపించాలని చూస్తున్నారు. ఈ విషయం తెలిస్తే వేద ఆంటీ ఖచ్చితంగా బయటకి పంపించేస్తుందని బెడ్ షీట్ మీద పౌడర్ వేస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అనుకుని బెడ్ షీట్ మార్చేస్తాడు. అది చూసి వేద ఆశ్చర్యపోతుంది. అయితే చాలా మారిపోయాడని అనుకుంటుంది.
Also Read: రాహుల్ ప్లాన్ సక్సెస్- పెళ్లి మండపంలో శివతాండవం ఆడుతున్న రుద్రాణి
బాగా ఇరికించాను నాకు చాలా సంతోషంగా ఉంది. నా బలం వాడే ఈ ఇంట్లో వీళ్ళ బలహీనత వాడే. వాడిని అడ్డం పెట్టుకుని నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడమని మాళవిక మనసులో అనుకుంటుంది. తర్వాత ఆదిత్య దగ్గరకి వచ్చి అరుస్తుంది. ఇక్కడ నిన్ను నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ మనల్ని ఇక్కడ నుంచి పంపించేసి ఉంటే ఏం చేసే వాడివి నా దగ్గర డబ్బులు లేవు ఇప్పటికిప్పుడు బయటకి పొమ్మంటే ఎక్కడికి వెళ్తాం. ఇంకొకసారి ఏ తప్పు చేయకని తిడుతుంది. అసలే వేద మనం ఎప్పుడు తప్పు చేస్తామా అని ఎదురుచూస్తుంది. నువ్వు ఏం చేసినా మీ నాన్నకి చెప్తుంది. అప్పుడు నువ్వు కొడుకువని కూడా ఆలోచించకుండా బయటకి గెంటేస్తారని నూరిపోస్తుంది. యష్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే వేద వస్తుంది. మళ్ళీ ఎక్స్ రే కళ్ళజోడు తీస్తాడు. వేద దాన్ని లాగేసుకుని పెట్టుకుంటుంది. ఇది మామూలుగానే కనిపిస్తుంది కదా అంటే నన్ను కావాలని ఆట పట్టించారా? అని తిడుతుంది.
Also Read: తను ప్రేమించింది ఎవరినో చెప్పిన ముకుంద- కొడుకు, కోడల్ని ఒక్కటి చేసేందుకు రేవతి హోమం
వసంత్, చిత్ర సంతోషంగా ఉన్న టైమ్ లో అభిమన్యు వస్తాడు. నీ పెళ్ళాంతో నా మీద కేసు విత్ డ్రా చేయించు, లేదంటే మిమ్మల్ని అందర్నీ జైలుకి పంపిస్తానని అభిమన్యు బెదిరిస్తాడు. ఏంట్రా నువ్వు చేసేదని వసంత్ అక్కడే ఉన్న కత్తి తీసుకుని అభిమన్యుని పొడిచినట్టు చూపిస్తారు.