News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi July 14th: 'బ్రహ్మముడి' సీరియల్: కళ్యాణ్ ని దారుణంగా అవమానించిన అప్పు- పుట్టింటికి సాయం చేసేందుకు కావ్య చేసే ప్రయత్నం రాజ్ కి తెలుస్తుందా?

కావ్య మీద రాజ్ కి మంచి అభిప్రాయం రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

ఒక్క రోజు గడువులో అప్పు కట్టకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని చంపక్ లాల్ కృష్ణమూర్తిని బెదిరించడం మొత్తం కావ్య ఫోన్లో వింటుంది. ఇల్లు తాకట్టులో ఉండటం ఏంటి? నాకు తెలియకుండా అమ్మానాన్న ఇంత కష్టపడుతున్నారా? డబ్బు కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారా? అని కావ్య అనుకుంటుంది. ఆవేశంగా కావ్య స్వప్న దగ్గరకి వస్తుంది. చేసిన మోసం బయట పడితే పరిస్థితి ఏంటని నిలదీస్తుంది. ఇంటి దగ్గర అమ్మనాన్న నువ్వు కడుపుతో ఉన్నావని చీర, సారె తీసుకురావడం కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా అంటుంది. వాళ్ళు తెచ్చే చీప్ చీరలు కట్టుకోనని చెప్పమని పొగరుగా సమాధానం ఇస్తుంది. చెంప పగిలిద్ది ఇంకోసారి ఆ మాట అంటే అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. తన విషయంలో జోక్యం చేసుకోవద్దని స్వప్న హెచ్చరిస్తుంది.

Also Read: బెడిసికొట్టిన ప్లాన్- మాళవికని తీసుకెళ్లిపోయిన వసంత్, వేదనే వెళ్లగొట్టిందని అనుకున్న యష్

కళ్యాణ్ కూరగాయలు తీసుకుని అప్పు ఇంటికి వస్తాడు. వాటిని చూసి ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. సరుకులు తీసుకొచ్చాను ఇక నుంచి మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదని అన్ని తాను చూసుకుంటానని కళ్యాణ్ అంటాడు. అప్పు మాత్రం కళ్యాణ్ ని తిడుతుంది. ఏమనుకుంటున్నావ్ మా గురించి అడుక్కుని తినే వాళ్ళం అనుకుంటున్నావా? అసలు ఎవరు చెప్పారు? పరాయి వాళ్ళ దయతో బతుకుతున్నామని ఎవరు చెప్పారని నిలదీస్తుంది. తానేమీ పరాయి వాడిని కాదు కదా అంటాడు. కానీ అప్పు మాత్రం నోటికొచ్చినట్టు వాగుతుంది. తిండికి లేకపోతే మంచినీళ్లు తాగైన బతుకుతాము కానీ ఇలాంటివి తీసుకోమని చీదరింపుగా మాట్లాడుతుంది. సోరి తెలియక మిమ్మల్ని హర్ట్ చేశానని కళ్యాణ్  బాధపడతాడు. సరుకులు తీసుకుపోయి లేనివాళ్ళకి ఇవ్వమని రూడ్ గా మాట్లాడుతుంది.

సాయం చేసిన మనసుని గాయం చేసి పంపించావు కరెక్ట్ కాదని ఇంట్లో వాళ్ళు అప్పుని తిడతారు. డబ్బు పెడితే అన్ని దొరుకుతాయి కానీ మనుషులు మాత్రం దొరకరని కనకం చెప్తుంది. కావ్య తన పుట్టింటికి ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తుంది. రాజ్ వర్క్ చేసుకుంటూ ఉండగా పనిమనిషి కాంతం వచ్చి స్కూల్ ఫీజు డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. కావ్యని పిలిచి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. ఇక నుంచి డబ్బు ఏదైనా అవసరమయితే కావ్యనే ఇస్తుందని కాంతంకి చెప్తాడు. ఇంట్లో పని చేసే పిల్లల ఖర్చు అంతా రాజ్ సర్ చూసుకుంటారని కాంతమ్మ చెప్తుంది. టను వెళ్లిపోయాక రాజ్ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. కావ్య ఆలోచనలో ఉండి సరిగా వినిపించుకోదు. ఇన్ హేలర్స్ తెప్పించి మిగిలిన చిల్లర కూడా రాజ్ కి ఇచ్చేస్తుంది. కళ్యాణ్ అప్పు అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. కావ్య డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. పుట్టింటి గురించి పట్టించుకోలేకపోతున్నానని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది.

Also Read: అత్త మనసు గెలుచుకున్న కావ్య- స్వప్నని బయటకి పంపేందుకు ఐడియా ఇచ్చిన రుద్రాణి

స్వప్న ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వెయిట్ చేస్తుంటే రాహుల్ వచ్చి ఏంటని అడుగుతాడు. డ్రెస్ ఆర్డర్ ఇచ్చానని వాడికోసం వెయిట్ చేస్తున్నానని పొగరుగా సమాధానం చెప్తుంది. ఇంత పొట్టి డ్రెస్ వేసుకుంటే ఇంట్లో వార్ జరుగుతుంది, దీని గొయ్యి ఇదే తొవ్వుకుంటుందని రాహుల్ మనసులో సంబరపడతాడు. స్వప్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. కొరియర్ బాయ్ వచ్చి పార్సిల్ ధాన్యలక్ష్మి చేతికి ఇస్తాడు. అది ఓపెన్ చేస్తుంటే స్వప్న ఫీల్ అవుతుందని రాహుల్ అంటాడు. ఇంకొకరికి వచ్చినవి తాను చూడనని ధాన్యలక్ష్మి తిరిగి ఇస్తుంటే.. ఈవిడకి అనుమానం రాకూడదంటే చూడనివ్వాలని అనుకుని చూడమని చెప్తాడు. సరిగ్గా ఓపెన్ చేసే టైమ్ కి అది కిందపడిపోతుంది. స్వప్న వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కావ్య వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది.

Published at : 14 Jul 2023 09:37 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial July 14th Episode

ఇవి కూడా చూడండి

Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!

Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!

Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి