Brahmamudi July 13th: 'బ్రహ్మముడి' సీరియల్ : అత్త మనసు గెలుచుకున్న కావ్య- స్వప్నని బయటకి పంపేందుకు ఐడియా ఇచ్చిన రుద్రాణి
కావ్య మీద రాజ్ కి అభిప్రాయం మారుతూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య, కళ్యాణ్ ని స్టేషన్ నుంచి విడిపించి బయటకి తీసుకొస్తాడు. అసలు నీకు సడెన్ గా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందని రాజ్ నిలదీస్తాడు. ఇందులో వదిన తప్పేమీ లేదని అంటాడు. ఇక నుంచి నువ్వేమి నేర్పించొద్దులే అదేదో నేనే చూసుకుంటానని రాజ్ అంటాడు. ఆ మాటకి కావ్య సంతోషంగా అవునా అయితే ఇప్పుడే నేర్పించమని అడుగుతుంది. ఇప్పుడేనా ఈరోజుకి చేసిన ఘనకార్యం చాలులే పద అంటాడు. అపర్ణ టీవీ రిమోర్ట్ కోసం వెతుకుతుంటే ఎక్కడ చూసినా ఇన్ హేలర్స్ కనిపిస్తాయి. రాజ్ కి మొన్నటి పరిస్థితి మళ్ళీ రాకూడదని కావ్య తెప్పించిందని ఇంద్రాదేవి మెచ్చుకుంటుంది. నీ కోడలు కొడుకు గురించి ఇంతగా పట్టించుకుంటుంటే నువ్వు మాత్రం తనని పట్టించుకోవడం లేదు. తన దగ్గర కనీసం ఫోన్ కూడా లేకుండా లాగేసుకున్నావ్. ఆ ఇంటి నుంచి ఇంకొక ఆడపిల్ల ఈ ఇంటికి కూడా వచ్చింది. అవసరాలకు ఉండాలనే కదా ఫోన్ వాడుకునేదని ధాన్యలక్ష్మి కూడా అంటుంది.
Also Read: తాళి తెచ్చి మాజీ మొగుడి చేతిలో పెట్టిన తులసి- నిద్రమాత్రలు మింగిన దివ్య?
అప్పుడే రాజ్ వాళ్ళు వచ్చి ఏమైంది మమ్మీ అంత సీరియస్ గా ఉందని అడుగుతాడు. ఏం లేదులే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారని అడుగుతారు. ముగ్గురూ మూడు సమాధానాలు చెప్పి ఇరుక్కుపోతారు. అపర్ణ కోపంగా కావ్య దగ్గరకి వచ్చి తన చేతిలో ఫోన్ పెడుతుంది. అది చూసి కావ్యతో పాటు ఇంట్లో అందరూ బిత్తరపోతారు. ఇది మీరు మనస్పూర్తిగా ఇస్తున్నారా అని కావ్య అడుగుతుంది. నీ ఫోన్ నీ దగ్గర ఉండటం ఎంత అవసరమో తెలిసింది అందుకే ఇచ్చానని చెప్పేసి అపర్ణ వెళ్ళిపోతుంది. మొత్తానికి రాజ్ మనసు మాత్రమే కాదు అత్త మనసు కూడా గెలుచుకున్నావ్ ఘటికురాలివేనని ధాన్యలక్ష్మి మెచ్చుకుంటుంది. ఆ మాటకి స్వప్న కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమో అనుకున్నా నా చెల్లి చాలా ముదురు రాజ్ ని ఒక్కసారి హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఇంట్లో అందరినీ కంట్రోల్ లోకి తెచ్చుకుందని అనుకుంటుంది.
రాహుల్ కొత్త ఫోన్ తీసుకొచ్చి స్వప్నకి ఇస్తాడు. రాజ్ కావ్య కోసం తీసుకొచ్చాడని నువ్వు కూడా అడుగుతావు కదా అందుకే తెచ్చానని అంటాడు. ఇంట్లో అందరూ నా చెల్లి మాయలో పడ్డారు. తనతో నేను పోటీ పడితే నేను ఇంటికి పెద్ద పాలేరు అవుతానని అంటుంది. నా టాలెంట్ ఏంటో చూపిస్తే ఇంట్లో అందరికీ తెలిసి వచ్చేలా చేస్తాను. నీకు చాలా మంది సెలబ్రెటీలు తెలుసు కదా నేను మోడలింగ్ చేస్తాను. దుగ్గిరాల ఇంటి కోడలు మోడలింగ్ చేసి ఫుల్ ఫేమస్ అయితే తనని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారని సలహా ఇస్తుంది. కడుపు వేసుకుని పొట్టి డ్రెస్ లు వేసుకుని మోడలింగ్ చేస్తానంటే ఈ ఇంట్లో ఎవరూ ఒప్పుకోరని ఆ ఆలోచన మానుకుని ఉండమని రాహుల్ తిట్టేసి వెళ్ళిపోతాడు. బయటకి వెళ్ళగానే రుద్రాణి ఎందుకు తన మాట కాదని అన్నావని తిడుతుంది. మోడలింగ్ చేస్తే ఇంటి పరువు తీశావని బయటకి గెంటేస్తారు అదే కదా మనకి కావలసింది అనుకుని తనని ఇంటి నుంచి బయటకి పంపించేందుకు స్కెచ్ వేస్తారు.
Also Read: ఇకనైనా మారమంటూ లవ్ లైట్స్ తేంపేసిన మురారీ- ముకుంద లవ్ ఫోటోస్ భవానీ చూస్తుందా?
మోడలింగ్ అవకాశాలు ఇప్పించి నీపేరు, నా పేరు బయటకి రాకుండా చూడమని రుద్రాణి ఐడియా ఇస్తుంది. దీంతో రాహుల్ మళ్ళీ స్వప్న దగ్గరకి వెళ్ళి సెలెబ్రెటీ అయితే ఇంట్లో అందరూ మెచ్చుకుంటారని అంటాడు. కానీ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తాను కానీ తన పేరు బయటకి రాకూడదని మాట ఇస్తేనే హెల్ప్ చేస్తానని చెప్తాడు. దీంతో స్వప్న సరే అంటుంది. కనకం స్వప్నకి సూడిదలు ఇవ్వాలని కృష్ణమూర్తిని అడుగుతుంది. అప్పుడే కావ్య కనకానికి ఫోన్ చేస్తుంది. ఎవరో కావ్య అంట అనుకుని కనకం తిక్కగా అంటుంది. ముందుల ఇఫ్ట్ చేసి మాట్లాడమని అప్పు అనేసరికి కావ్య మాట్లాడుతుంది. ఇది తన ఫోన్ అని తన అత్త తిరిగి ఇచ్చారని చెప్తుంది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారని సంతోషంగా అడుగుతుంది. సూడిదలు తీసుకొస్తానని కనకం అంటే ఇప్పుడు నాన్న ఉన్న పరిస్థితిలో ఇదంతా అవసరమా అని కావ్య అంటుంది. పొరపాటున నోరు జారి కడుపు లేదని చెప్పబోయి మళ్ళీ కవర్ చేస్తుంది.
కావ్య ఫోన్ మాట్లాడుతూ ఉండగా సేటు కృష్ణమూర్తిని గట్టిగా పిలుస్తూ వస్తాడు. కనకం మళ్ళీ చేస్తానని కాల్ కట్ చేస్తుంది. కావ్య మళ్ళీ ఫోన్ చేయడంతో అది కిందపడి ఆటోమేటిక్ గా లిఫ్ట్ అవుతుంది. అసలు కట్టలేదు వడ్డీ కూడ ఇవ్వలేదు. తాకట్టు పెట్టిన ఇంటిని వేలం వేసి నాకు అప్పజెప్పేవాళ్ళు. కూతురి పెళ్లి అంటే అప్పు ఇచ్చాను ఇప్పుడు నాటకాలు మొదలు పెట్టారా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండని సేటు చంపక్ లాల్ నిలదీస్తాడు. ఈ మాటలన్నీ కావ్య ఫోన్లో వింటూనే ఉంటుంది.