అన్వేషించండి

Gruhalakshmi July 12th: తాళి తెచ్చి మాజీ మొగుడి చేతిలో పెట్టిన తులసి- నిద్రమాత్రలు మింగిన దివ్య?

రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కేఫ్ కి సాయం చేయడం కోసం తులసి తన తాళి తీసి ఇవ్వబోతుంటే ఎందుకు ఇలా చేస్తున్నావని అనసూయ నిలదీస్తుంది. ఇప్పుడు ఎవరి బతుకులు వాళ్ళవని కాసేపు వేదాంతం మాట్లాడుతుంది. తాళిని ఎగతాళి చేయలేను అందుకే ఇన్నాళ్ళూ మంగళసూత్రం ఉంచుకున్నా ఇప్పుడు ఉంచుకుంటానని చెప్పి బంగారు తాళిబొట్టు తీసి పసుపు తాడు మెడలో వేసుకుంటుంది. దివ్య తల్లి తిట్టింది తలుచుకుని ఏడుస్తుంటే రాజ్యలక్ష్మి బ్యాచ్ చూసి తెగ నవ్వుకుంటారు. ఈ కన్నీళ్లే కదా నువ్వు చూడాలనుకున్నావ్ బాగా చూసుకుని ఎంజాయ్ చేసుకోమని లాస్య అంటుంది. తన దెబ్బకి దివ్య ఇలా ఏడుస్తుందని అనుకోలేదు కాస్త ఎదురుతిరుగుతుందని అనుకున్నానని అనుకుంటుంది. ఒక్క దెబ్బకి మొగుడు, తల్లి దూరమయ్యారని సంబరపడతారు. దివ్యని నీ కొడుక్కి దూరం చేస్తానని లాస్య అంటుంది. తన కొడుకు సంజయ్ మాత్రమేనని విక్రమ్ గాడు ఆపద్ధర్మ కొడుకు వాడి ఆస్తి సంజయ్ పేరు మీద మార్చేవరకు ఈ ప్రేమ ఆ తర్వాత వాడు ఎవడో నేను ఎవరోనని కఠినంగా మాట్లాడుతుంది.

నందు కేఫ్ రీఓపెన్ చేసి తప్పు చేశాము ఏమోనని నిరాశగా మాట్లాడతాడు. ఇదంతా లాస్య వల్లే జరిగిందని అంటాడు. ఓటమి ఒప్పుకోకూడదని తను చెప్పినట్టు చేయమని అలా చేస్తానని మాట ఇస్తేనే చెప్తానని కండిషన్ పెడుతుంది. దీంతో నందు తులసికి మాట ఇస్తాడు. నందు చేతిలో తులసి తాళిబొట్టు పెట్టి దీన్ని అమ్మేసి డబ్బు తీసుకొచ్చి కేఫ్ డెవలప్మెంట్ కి వాడమని సలహా ఇస్తుంది. ఎందుకు ఈ పాపం చేయిస్తున్నావని అంటాడు. తన మాట వినకపోతే అందరికీ దూరమవుతానని తులసి బెదిరిస్తుంది. చేతిలో తాళి పెట్టి అమ్మమని సెంటి మెంట్ చేస్తే ఎలా అని బాధపడతాడు. తులసి నిర్ణయాన్ని అనసూయ వాళ్ళు కూడా సమర్ధిస్తారు. తులసి ఏది చెప్పినా కరెక్ట్ అంటూ ముసలోళ్ళు వంత పాడతారు. తులసి సహాయాన్ని కాదనకు మళ్ళీ అదృష్టం కలిసి వస్తుంది రుణం తీర్చుకోవచ్చని నచ్చ జెప్పడంతో సరేనని అంటాడు.

Also Read: ఇకనైనా మారమంటూ లవ్ లైట్స్ తేంపేసిన మురారీ- ముకుంద లవ్ ఫోటోస్ భవానీ చూస్తుందా?

దివ్య దగ్గరకి వచ్చి లాస్య రెచ్చగోట్టేందుకు చూస్తుంది. బురదలో రాయి వేయడం ఎందుకని వెళ్లిపోతున్నానని దివ్య కౌంటర్ వేస్తుంది. దీని నుంచి బయట పడేందుకు మార్గం చెప్తానని అంటుంది. తోడు దొంగలు కూడబలుక్కుని చేస్తున్నారా? అంటూ గట్టిగానే బదులిస్తుంది. మీ అత్త ఇచ్చిన సలహా ఏంటో నాకు తెలియదు కానీ నేను ఇచ్చే సలహా వినమని అంటుంది. మొగుడ్ని ప్రేమతో కొంగుకి కట్టేసుకోవడం కుదరదు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవాలని ఐడియా ఇస్తుంది. నీ మొగుడికి నువ్వంటే ప్రేమ ఉంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యి నిన్ను చుట్టుకుపోతాడు ట్రై చేయమని చెప్తుంది. చుట్టుకుపోవడం కాదు నన్ను బయటకి నెట్టేస్తాడు అప్పుడు చూసి సంబరపడదామని అనుకుంటున్నావా? విక్రమ్ ని బ్లాక్ మెయిల్ చేయడం అసలు చేయనని దివ్య అంటుంది.

Also Read: కావ్య, కళ్యాణ్ ని స్టేషన్ నుంచి విడిపించిన రాజ్- హనీమూన్ కావాలంటూ రచ్చ చేసిన స్వప్న

లాస్య విక్రమ్ దగ్గరకి వచ్చి దివ్య స్లీపింగ్ పిల్స్ మింగింది ఏమోనని డౌట్ గా ఉందని ఎక్కిస్తుంది. దీంతో విక్రమ్ కంగారుగా తన దగ్గరకి పరుగులు పెడతాడు. దివ్య పాలు తాగబోతుంటే విక్రమ్ వచ్చి వాటిని నేలపాలు చేస్తాడు. ఏంటి నువ్వు చేసిన పనని అడుగుతుంది. నేను అదే అడుగుతున్నా ఏంటి నువ్వు చేస్తున్న పనని విక్రమ్ నిలదీస్తాడు. ఈ ఇంట్లో నీకు పూర్తి స్వేచ్చగా బతికే హక్కు ఉంది అంతే కానీ ప్రాణం తీసుకునే హక్కు లేదని అంటాడు. రాజ్యలక్ష్మి డ్రామా మొదలుపెడుతుంది. ప్రాణం తీసుకునే అవసరం ఏమొచ్చిందని అడుగుతుంది. నువ్వు నిద్రమాత్రలు వేసుకోవడం నేను కళ్ళారా చూశానని లాస్య అబద్ధం చెప్తుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Embed widget