Bigg Boss Keerthi Bhat : 200కి వస్తావా అంటే.. ఎందుకో తెలియక సరే అనేదాన్ని - ఎక్కడెక్కడో టచ్ చేసేవారు: నటి కీర్తి భట్
Bigg Boss Keerthi Bhat: కీర్తీ భట్.. సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్. అయితే, ఈమె జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారంట ఆమె. '
Bigg Boss Keerthi Bhat With Shobha Shetty: కీర్తీ భట్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై తన యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ మనసు దోచుకున్నారు. ఇక బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత తన ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే, ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు. తల్లిదండ్రులను కళ్లముందే పోగొట్టుకుంది కీర్తి. ఇలా ఒకటికాదు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చింది. అయితే, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తోంది. 'కాఫీ విత్ శోభా' ప్రోగ్రామ్ కి వచ్చిన ఆమె చాలా విషయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఆ ప్రోమో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది.
కాబోయే భర్తతో కలిసి..
ఓ యూట్యూబ్ చానెల్‌లో ప్రసారమవుతోన్న ‘కాఫీ విత్ శోభా’ అనే కార్యక్రమంలో కేవలం ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు మాత్రమే వస్తారు. దీనికి శోభాశెట్టి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో కీర్తి భట్, ఆమె కాబోయే భర్త కార్తిక్ పాల్గొన్నారు. ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు పంచుకున్నట్లుగా ఆ ప్రోమో ద్వారా తెలుస్తుంది.
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను..
ఎలా ఉన్నావు? ఏం నడుస్తుంది లైఫ్ లో అని శోభ అడిగిన ప్రశ్నకి కీర్తీ చాలా చాలా హ్యాపీగా ఆన్సర్ ఇచ్చారు. "ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్ లోకి కొత్త మెంబర్ వచ్చారు కాబట్టి. ఎంగేజ్మెంట్ అయ్యాక.. చాలా రోజులు గ్యాప్ తీసుకుంది ఎందుకంటే.. ఇద్దరినీ అర్థం చేసుకుని నెగటివ్స్ ఏమైనా ఉంటే వదిలేద్దాం’’ అని నవ్వుతూ తెలిపింది. తమ మధ్య చాలా గొడవలు పెట్టేందుకు చూశారని, విడగొట్టేందుకు చూశారని కీర్తి తెలిపింది.
మెసేజ్ చేసిన మూడు నెలలకు చూసింది..
ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ... "కీర్తీ చాలా మూడ్ స్వింగ్స్ ఉన్న అమ్మాయి. ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు నవ్వుతుందో తెలీదు. ఇక 2016లో ప్రొఫైల్ పంపించి మీరు మెయిన్ లీడ్ చేయాలని చెప్పి మెసేజ్ చేశాను. మూడు నెలల తర్వాత రిప్లై వచ్చింది. అప్పటికి మా షెడ్యూల్ కూడా అయిపోయింది. కీర్తి ఆర్గానిక్ ఐటమ్స్ బాగా చేస్తుంది. ఉప్మాలో ఎప్పుడైనా వేరుశనగ పప్పు ఏరుకుంటాం.. కానీ, నేను ఉప్మా ఏరుకోవాలి. కీర్తి నా లైఫ్ లోకి రావడం చాలా అదృష్టం. నేను చాలా లక్కీ. మీకు కూడా అలాంటి అమ్మాయి దొరికితే కచ్చితంగా వదులుకోవద్దు" అని అన్నాడు.
200 కి వస్తావా అని అడిగితే.. తెలియక వస్తాను అనేదాన్ని..
"కుటుంబసభ్యులకు యాక్సిడెంట్ అయిన తర్వాత మంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. బాడీలో స్పర్శ లేదు. తెలుస్తుంది కానీ, చేతితో నెట్టేయడానికి కూడా చేతకాలేదు. ఇక నయమైన తర్వాత.. అక్కడ నుంచి బయటికి వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బుల కావాలి. ఏమీ తెలీదు అప్పుడు. 200 రూపాయలకు వస్తావా? అంటే సరే అన్న వస్తాను అనేదాన్ని. తర్వాత వాళ్ల లుక్ చూసి అర్థమయ్యేది" అంటూ తన లైఫ్ లో జరిగిన దారుణమైన ఘటనలను గుర్తుచేసుకుంది కీర్తి.
Also Read: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ