Ammayi garu Serial Today September 18th: అమ్మాయిగారు సీరియల్: రాఘవ, ఆనంద్‌ల కోసం దీపక్‌తో రాజు పోరాటం! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
Ammayi garu Serial Today Episode September 18th దీపక్ రాఘవని చంపాలని ప్రయత్నించడం రాజు అడ్డుకోవడం రాజు, రాఘవ, ఆనంద్‌లను చంపేయమని విజయాంబిక దీపక్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ, ఆనంద్ తప్పించుకున్నారని రౌడీలు దీపక్‌కి కాల్ చేసి చెప్తారు. వాళ్లని ఫాలో అవ్వండి నేను ఇప్పుడే వస్తాను అని దీపక్ చెప్తాడు. విజయాంబికతో విషయం చెప్పి నేను వెళ్లి వాళ్ల సంగతి చూస్తా అని అంటాడు. విజయాంబిక దీపక్‌తో రాఘవ ఈ గుమ్మం తొక్కకూడదు.. అవసరం అయితే వాడిని చంపేయ్ అని అంటాడు.
దీపక్, విజయాంబిక మాటలు రాజు విని దీపక్‌ని ఫాలో అవుతాడు. ఇక కోమలి సూర్యప్రతాప్‌ని హ్యాపీ చేస్తానని మంచి సర్‌ఫ్రైజ్ ఇస్తానని భరతనాట్యం చేస్తుంది. అందరూ బిత్తరపోయి లేచి నిల్చొండి పోతారు. సూర్యప్రతాప్ కోపంగా చూస్తాడు. రూప అని సూర్యప్రతాప్ పెద్దగా అరుస్తాడు. దెబ్బకి కోమలి డ్యాన్స్ ఆపేసి షాక్ అయి నిల్చొంటుంది. సూర్యప్రతాప్ కోమలిని లాగి పెట్టి కొడతాడు. రూప నవ్వుకుంటుంది. నిన్ను నాట్యం చేయమని నేను అడిగానా అని సూర్యప్రతాప్ అంటే నాట్యం అంటే మీకు ఇష్టం అని చేశాను అని కోమలి అంటే నేను చెప్పానా.. నాట్యం అంటే నాకు ఇష్టం ఉండదు అని సూర్యప్రతాప్ చెప్పడంతో కోమలి బిత్తరపోయి రూపని చూస్తే రూప కోమలిని చూసి కన్నెగరేస్తుంది.
సూర్యప్రతాప్ కోపంగా నాకు ఏం ఇష్టమో ఇష్టం లేదో నీకు గుర్తు లేదు అంటే నువ్వు రూపవో కాదో అని నాకు అనుమానంగా ఉందని అంటాడు. విజయాంబిక మనసులో కోమలిని ఎవరో పట్టించాల్సిన అవసరం లేదు అదే దొరికిపోతుంది అని అనుకుంటుంది. కోమలితో నువ్వు నా రూపవి అయితే నాకు నచ్చని పని చేయవు నువ్వు అలా చేస్తున్నావ్ అంటే నువ్వు నా రూపవి కాదు అని అనిపిస్తుంది. నిజం చెప్పు నువ్వు ఎవరు అని అడుగుతాడు. కోమలిని కాపాడటానికి విజయాంబిక చీటీలో వచ్చినట్లు ఎవరికి వచ్చింది వాళ్లు చేశారు కదా మన రూపకి నాట్యం వచ్చుంటే తను చేసుంటుందని కవర్ చేస్తుంది.
రూప హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకొని వచ్చింది కదా కొన్ని మర్చిపోయి ఉంటుంది అని విజయాంబిక అంటుంది. కోమలి రెండు చేతులు జోడించి నన్ను క్షమించండి నాన్న ఇంకెప్పుడూ మిమల్ని బాధ పెట్టను అంటుంది. సూర్యప్రతాప్ కోపంగా వెళ్లిపోతాడు. రూప కోమలి దగ్గరకు వెళ్లి వెటకారంగా నవ్వి.. మార్కులు బాగానే పడినట్లు ఉన్నాయ్.. కానీ ఈ మార్కులతో పాస్ అవ్వడం కష్టం కానీ ఇంకోసారి మంచి మార్కులు వచ్చేలా చేస్తా పెట్టే బేడ సర్దుకొని రెడీగా ఉండు అని చెప్తుంది.
విజయాంబిక కోమలి దగ్గరకు వెళ్లి నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఏం చేసినా చెప్పు అని అన్నింటినీ ఈజీగా తీసుకోవడం మంచిది కాదు.. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేవరకు నువ్వు సైలెంట్‌గా ఉంటే మంచిది అర్థమైందా అని అంటుంది. కోమలి ఇక నుంచి రూప వాళ్ల మాటలు నమ్మకూడదు అనుకుంటుంది. రాఘవ, ఆనంద్ పరుగులు పెడుతుంటే దీపక్ కారుతో ఎదురుగా వస్తాడు. రాఘవ నువ్వు మా మామయ్యని కలుస్తావా.. నిజం చెప్తావా అంటాడు. నీ లాంటి ఎంత మంది కుక్కలు కలిసినా మా అమ్మగారిని కలిసి నిజం చెప్తా అని అంటాడు. నువ్వు మీ అమ్మగారి కోసం ఇంత చేస్తే నేను మా అమ్మ కోసం ఇంకెంత చేయాలి అని చాకు తీసుకొని రాఘవని పొడవడానికి వెళ్తాడు.
రౌడీలు ఆనంద్, రాఘవల్ని పట్టుకుంటారు. దీపక్ రాఘవని పొడిచే టైంకి రాజు వచ్చి దీపక్ చేయి పట్టుకుంటాడు. రాజుని చూసి దీపక్ షాక్ అయిపోతాడు. రాజు దీపక్‌ని చితక్కొడతాడు. ఈ రోజు నా చేతుల నుంచి నిన్ను కాపాడటం ఎవరి తరం కాదు రాఘవని నేను కాపాడుతా.. రాఘవని ఈ సారి తప్పించడం నీ తరం కాదు నీ తల్లి తరం కాదు అని అంటాడు. రౌడీలను రాఘవ, ఆనంద్‌లను వదిలేసి వెళ్లిపోమని చెప్పి రాఘవ, ఆనంద్‌లను తీసుకొని రాజు బయల్దేరుతాడు.
విరూపాక్షి సూర్య మాటలు తలచుకొని బాధ పడుతుంటే రూప, మందారం విరూపాక్షి దగ్గరకు వస్తారు. ఇంతలో రాజు రూపకి కాల్ చేసి రాఘవ, ఆనంద్ తనతో ఉన్నారని ఇద్దరినీ దీపక్ చంపాలి అని ప్రయత్నించాడని ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అమ్మగారికి చెప్పమని అంటాడు. రూప సంతోషంగా విరూపాక్షితో రాజు రాఘవని తీసుకొస్తున్నాడని చెప్తాడు. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. దీపక్ విజయాంబికకు కాల్ చేసి రాఘవ, ఆనంద్ తప్పించుకున్నారని రాజు వచ్చి ఇద్దరినీ ఇంటికి తీసుకొస్తున్నాడని నేను ఆపలేకపోయానని అంటాడు. రాజుని కూడా చంపేయ్ కానీ వాళ్లని వదలకు అని విజయాంబిక చెప్తుంది.
దీపక్ మళ్లీ రౌడీలతో వెళ్లి రాజు వాళ్లని ఆపుతాడు. వీళ్లిద్దరే చస్తారు అనుకుంటే నువ్వు చస్తావ్ అన్నమాట అని అంటాడు. రాజు దీపక్‌తో నీ చావు పెద్దయ్య గారి చేతిలో అనుకున్నా కానీ నా చేతిలోనే ఉంది.. అంటాడు. దీపక్ మనుషులు రాజుని పట్టుకుంటారు. రాజు ఆనంద్, రాఘవల్ని పారిపోమని అంటాడు. దీపక్ రాఘవ వాళ్ల వెనక పడతాడు. ఆనంద్ దీపక్‌ని పట్టుకొని నాన్న నువ్వు వెళ్లిపో అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















