Jagadhatri Serial Today September 18th: జగద్ధాత్రి సీరియల్: ఇది పక్కా క్రైమ్ థ్రిల్లర్ మూవీనే! జేడీ, కేడీలు రంగంలోకి దిగితే ప్రతి సీన్ క్లైమాక్సే!
Jagadhatri Serial Today Episode September 18th జేడీ, కేడీలు విక్కీ అంతు చూడటానికి రంగంలోకి దిగడం విక్కీ మాధురిని చంపేస్తా అని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మాధురి కనిపించలేదని ఇంట్లో అందరూ కంగారు పడతారు. వంశీ మాత్రం దారుణంగా మాట్లాడుతాడు. యువరాజ్ వంశీనే ఏదో చేసుంటాడు అని అంటాడు. అంతా ఆ తల పొగరుదాని వల్లే వచ్చింది. దాన్ని మీరు అలా పెంచారు.. అది మీ తప్పు అని మాట్లాడుతాడు.
జగద్ధాత్రి కోపంగా ఏం మాట్లాడుతున్నావ్ వంశీ భార్య అంటే కనీసం బాధ్యత లేదు.. బాధ లేదు.. తను అంటే నీకు అస్సలు ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నావ్ ఎంత ఊరుకుందామన్నా నీ మాటలే అలా మాట్లాడేలా చేస్తున్నాయి అని అంటుంది. వైజయంతి ఏడుస్తూ అదే కదా నా కూతురు కనిపించడం లేదని మనమంతా బాధ పడుతున్నా భార్య గురించి కనీసం బాధ్యత లేదు ఏం పట్టనట్లు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని అంటుంది. నేను ఇలాగే మాట్లాడుతా అని వంశీ అంటే నువ్వు ఇంత వెధవ అని తెలీక నీకు ఇచ్చి పెళ్లి చేశాం లేదంటే అస్సలు చేసేవాళ్లం కాదని యువరాజ్ అంటాడు. నన్నే వెధవ అంటావా అని వంశీ గొడవకు దిగుతాడు. అరిచావ్ అంటే బాగోదు అని యువరాజ్ అంటే నీ చెల్లికి నీ వెధవ బుద్ధులే వచ్చాయ్.. మాటలు వినకపోతే అనుభవిస్తుంది కదా అని దారుణంగా మాట్లాడుతాడు.
కౌషికి, సుధాకర్ గొడవ వద్దని అంటారు. మాధురిని వెతికే పని చూడకుండా ఈ గొడవలు ఎందుకురా అని సుధాకర్ ఏడుస్తూ కొడుకుతో చెప్తాడు. సంతోషంగా వచ్చింది మళ్లీ తనని అలా చూస్తానా లేదా అని భయంగా ఉందిరా.. తనకు ఏమైనా అయితే నేను బతకలేనురా అని సుధాకర్ ఏడుస్తాడు. కౌషికి బాబాయ్‌కి ధైర్యం చెప్తుంది. యువరాజ్ మనసులో నా చెల్లి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తా దీనికి కారణం అయిన వాళ్లని మాత్రం వదలను అని అనుకుంటాడు.
కేథార్ జగద్ధాత్రితో చెల్లికి ఏమైనా అయితే నాన్న మనకు దక్కరు జగద్ధాత్రి.. సాక్ష్యాలు కోసం ఆగడం ఏంటి జగద్ధాత్రి మాధురితో పాటు సంధ్య కూడా ప్రమాదంలో ఉంది.. ఇలా అయితే ఎలా ధాత్రి అని అంటాడు. కొంచెం వెయిట్ చేద్దాం అని జగద్ధాత్రి అంటుంది. ఇంతలో జగద్ధాత్రికి రమ్య కాల్ చేసి ఆ కార్ నెంబరు హోం మినిస్టర్ తాయారు పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్తుంది. కేథార్ ధాత్రితో సాక్ష్యం వచ్చేసింది.. వాడి తల్లి పేరుతో ఉన్న కారుని వాడు వాడుతున్నాడు వాడు పని చెప్దాం పద అంటే ఆ కారులో మాధురి ఉందని సాక్ష్యం చూపించలేకపోతే సెర్చ్ వారెంటీ ఇవ్వరు.. ఇక స్ట్రైట్‌గా వెళ్తే లాభం లేదు సాధు సార్ సాయం తీసుకొని వేరే రూట్లో వెళ్లాల్సిందే అని సాధు సార్‌కి కాల్ చేస్తుంది.
సాధు సార్‌కి విషయం చెప్తుంది. ఇంత జరిగితే నాకు ముందే ఒక మాట చెప్పాలి కదా.. అయినా సాక్ష్యాలు ఏం అవసరం లేదు.. ఇద్దరు ప్రాణాలు మనకి ముఖ్యం ఏం చేస్తారో చేయండి.. ఈరోజు రాత్రికి వాడి కథ ముగించేయండి.. కానీ సాక్ష్యాలు ఉండకూడదు.. నేను పర్మిషన్ ఇస్తున్నా వెళ్లండి అని అంటారు. జగద్ధాత్రి కేథార్‌తో పర్మిషన్ వచ్చేసింది కేడీ ఇక హోం మినిస్టర్ లేదు ఏం లేదు అటాక్ చేయడమే అని రాత్రి అవ్వగానే జేడీ, కేడీతో పాటు మరో ఇద్దరు నలుపు రంగు బట్టలు వేసుకొని ముఖానికి నలుపు రంగు పూసుకొని లొకేషన్‌కి వచ్చేస్తారు. సిగ్నల్ రాకుండా
జామర్ వాడాలని అనుకుంటారు. రెండు టీమ్‌లుగా విడిపోయి ఎవరు చనిపోయినా పర్లేదు సంధ్య, మాధురి ముఖ్యం అనుకొని రంగంలోకి దిగుతారు.
సంధ్యని అందరూ కలిసి రేప్ చేయడంతో ఒంటి నిండా గాయాలు అయి చావు బతుకుల మధ్య ఉంటుంది. దాహం దాహం అని అంటుంది. ఓ రౌడీ విక్కీకి చెప్పడంతో విక్కీ సంధ్య దగ్గరకు వెళ్లి మందు తాగించేస్తారు. జేడీ ముందు నుంచి అటాక్ చేయడానికి వెళ్తే కేడీ వెనక నుంచి అటాక్‌కి రెడీ అవుతాడు. ఇక విక్కీ దగ్గర ఉన్న వాడు మాధురిని కూడా వాడేద్దాం అని అంటాడు. విక్కీ సరే అని మరో గదిలో మాధురిని పెట్టమని అంటాడు. విక్కీ సంధ్య మీద మందు పోసి నీ ఆత్మకి శాంతి కలగాలి అని మాధురి దగ్గరకు వెళ్తాడు. కేడీ, జేడీలు రౌడీలను చితక్కొట్టి లోపలికి వస్తుంటారు.
మాధురి మీదకు విక్కీ వెళ్తే మాధురి తను ప్రెగ్నెంట్ అని వదిలేయమని వేడుకుంటుంది. అయినా విక్కీ వదలడు.. జేడీ కోపంతో రౌడీని కత్తితో కసి తీరా పొడిచేస్తుంది. ఓ రౌడీ విక్కీ దగ్గరకు వచ్చి మిలటరీ దిగిపోయింది అన్న కమాండోస్ వచ్చి మన వాళ్లని చంపేస్తున్నారని అంటాడు. విక్కీ చాలా భయపడతాడు. నీ చావు వచ్చేసిందిరా అని మాధురి అనడంతో మాధురిని విక్కీ కొడతాడు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ తాయారుకి కాల్ చేయబోతే ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయి ఉంటాయి.
విక్కీ మాధురికి గన్ గురి పెట్టి జేడీ వాళ్ల మీద అరుస్తాడు. అందరూ గన్‌లు పట్టుకొని వెళ్లబోతే ముందు వస్తే దీని తల పేలిపోతుంది అని అంటాడు. నన్ను ఏం చేసినా దీన్ని చంపేస్తా అంటాడు. తనని వదులుతావా లేదా అని జేడీ, కేడీలు అంటే మీకు ఇది ప్రాణాలతో కావాలి అంటే మీ గన్‌లు అన్నీ కింద పడేయండి అని అంటాడు. అందరూ గన్‌లు కింద పెట్టేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















