అన్వేషించండి

Jagadhatri Serial Today September 17th: జగద్ధాత్రి సీరియల్: సంధ్యని పాడు చేసేసిన విక్కీ, రౌడీలు! జేడీ, కేడీలు వెనక్కి తగ్గడానికి కారణమేంటి?

Jagadhatri Today Episode Sep 17th జేడీకి తాయారు కాల్ చేసి సెర్చ్ వారెంట్ లేకుండా తన గెస్ట్ హౌస్‌లో వెతకొద్దని చెప్పడం విక్కీ మాధురి, సంధ్యలను టార్చర్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు గెస్ట్ హౌస్‌కి వచ్చి మొత్తం వెతుకుతూ ఉండటంతో విక్కీ తాయారుకి కాల్ చేస్తూనే ఉంటాడు. జేడీ, కేడీ అన్ని గదులు వెతుకుతూ ఉంటారు కానీ సంధ్య, మాధురిని చూడరు. జేడీ సంధ్య ఉన్న గదిలో వెతుకుతుంది కానీ బెడ్ కింద ఉన్న సంధ్యని చూడదు. రౌడీలు విక్కీకి సైగ చేస్తాడు. 

 
విక్కీ తాయారుకి విషయం మొత్తం చెప్తాడు. తాయారు వెంటనే జేడీకి కాల్ చేసి తన గెస్ట్‌ హౌస్‌ వెతుకుతున్నావ్ అంట.. పిచ్చి పిచ్చిగా ఉందా.. వెంటనే వెళ్లిపోండి అని అంటుంది. దానికి జేడీ ఓ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి వచ్చారని తెలిసింది అందుకే వెతుకుతున్నాం అని జేడీ అంటే సెర్చ్ వారంటీ ఉందా.. లేకుండా వెతకకూడదు అని తెలీదా.. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి గెస్ట్‌ హౌస్‌లో దాచుకునేలా ఉన్నామా.. ఏమైనా ఉంటే సెర్చ్‌ వారెంటీ వెతుకు లేదంటే మీ పై అధికారులకు చెప్పి నిన్ను సస్పెండ్ చేయిస్తా అంటుంది. మీకు అంత శ్రమ ఇవ్వం మేమే వెళ్లిపోతాం అని జేడీ వెళ్లిపోతుంది.
 
విక్కీ జేడీతో ఏంటి సెర్చ్ వారెంటీతో రమ్మని మా అమ్మ చెప్పిందా.. నన్ను కొట్టారు నేను మా అమ్మకి చెప్పా.. బయటకు పోండి మేం ఆడుకోవాలి అని జేడీ, కేడీలను పంపేస్తాడు. కొద్ది సేపు ఉంటే మాధురి ఎక్కడుందో తెలిసిపోయేది.. ఛా అని జేడీ అంటే వాడు వాళ్ల అమ్మతో చెప్పించాడు అంటే మా చెల్లిని వాడే కిడ్నాప్ చేశాడు. సంధ్య కూడా వాడికే చిక్కుంటుంది. ఏదో ఒక ఆధారం ఉంటేనే సెర్చ్ వారెంటీ వస్తుంది. పద వెతుకుదాం అని సంధ్య మొదట కాల్ చేసిన ఏరియా పేరు రమ్యకి అడిగి తెలుసుకుంటారు. 
 
విక్కీ అతని రౌడీలు మత్తులో ఉన్న సంధ్యని పాడు చేస్తారు. సంధ్య చనిపోయి ఉంటే గోయి తీసి పాతేయమని విక్కీ తన మనుషులకు చెప్తాడు. తర్వాత మాధురి సంగతి చూద్దామని అంటాడు. మరోవైపు మాధురి కోసం వంశీ మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించకపోవడంతో సుధాకర్‌కి కాల్ చేసి మాధురి వచ్చిందా.. మాధురి కనిపించడం లేదని విషయం చెప్తాడు. ఇంట్లో అందరూ చాలా కంగారు పడతారు. వంశీ పోలీస్‌ కంప్లైంట్ ఇస్తానని వెళ్తాడు. కూతురు గురించి బెంగ పెట్టుకొని సుధాకర్‌కి ఆయాసం పెరిగిపోతుంది. అందరూ కంగారు పడతారు. వైజయంతి ఏమైంది అని ఏడుస్తుంది.
 
యువరాజ్ మనసులో నా చెల్లినే కిడ్నాప్‌ చేస్తారా అది ఎవరైనా సరే వాళ్లని ఉంచను అని అంటాడు. ఎవరికి కిడ్నాప్ చేసుంటారు అంత అవసరం ఏముంది అని కౌషికి వాళ్లు అనుకుంటారు. జేడీ, కేడీలు మాధురి కిడ్నాప్ అయిన ప్లేస్‌కి వచ్చి సీసీ కెమెరాలు చూసి కారు ఒక్కటే గుర్తిస్తారు. కారు నెంబరు రమ్యకి పంపించి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చెప్పమని అంటుంది. 
 
కౌషికి జగద్ధాత్రికి కాల్ చేస్తుంది. మాధురిని ఎవరో కిడ్నాప్ చేశారని కౌషికి చెప్తుంది. వంశీ చెప్పాడని త్వరగా రమ్మని చెప్తుంది. ఇంటికి వెళ్లి ధైర్యం చెప్దామని జేడీ అంటే నాకే ధైర్యం సరిపోవడం లేదు జేడీ అని కేథార్ అంటాడు. మరోవైపు యువరాజ్ తన మనుషులకు చెప్పి తన చెల్లిని కిడ్నాప్ చేశారని సీసీ కెమెరాల్లో చూసి వాడు ఎవడో వెంటనే చెప్పమని వాడు ప్రాణాలతో కావాలని చెప్పి మొత్తం వెతకమని అంటాడు. వంశీ అతని తల్లి వచ్చి పోలీస్‌ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి వస్తారు. మాధురి మాట వినకుండా వెళ్లిపోయిందని వంశీ అతని తల్లి చెప్పి మాకు ఈ ఒక్క పనే కాదు వేరే పనులు కూడా ఉన్నాయి.. మేం వెళ్తాం తన గురించి ఏమైనా తెలిస్తే చెప్తాం అని దారుణంగా మాట్లాడుతాడు. కేథార్ వంశీని ఆపి నువ్వు మనిషివేనా.. తను కనిపించకపోతే అలాగే మాట్లాడుతావా అని అంటాడు. కేథార్ కూడా వంశీ మీద కోప్పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today July 4th: నిండు మనసులు: గుండె పోటుతో కుప్పకూలిపోయిన విజయానంద్! రిసెప్షన్ ఆగిపోయినట్లేనా!
నిండు మనసులు: గుండె పోటుతో కుప్పకూలిపోయిన విజయానంద్! రిసెప్షన్ ఆగిపోయినట్లేనా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 4th:కుట్రతో రామచంద్రాన్ని కిందపడేసిన దమయంతి...నేరం రాధమీద నెట్టి అవమానాల పాలుచేసిన దమయంతి
నువ్వులేక నేను లేను: కుట్రతో రామచంద్రాన్ని కిందపడేసిన దమయంతి...నేరం రాధమీద నెట్టి అవమానాల పాలుచేసిన దమయంతి
Karthika Deepam 2 Serial Today July 4th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని ప్రశ్నించిన కార్తీక్! జ్యోత్స్నకి పెద్ద పనిష్మెంట్!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని ప్రశ్నించిన కార్తీక్! జ్యోత్స్నకి పెద్ద పనిష్మెంట్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget