Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: నా తాళిని విహారిని వదిలేదే లేదు: యమునకు షాక్ ఇచ్చిన లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode September 17th లక్ష్మీ యమునతో విహారికి విడాకులు ఇవ్వను ఈ ఇంటి నుంచి వెళ్లను అని చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి గుడిలో ఉన్నాడని తెలిసి పద్మాక్షి, యమునను తీసుకొని గుడికి వస్తుంది. సహస్ర ఇద్దరినీ చూసి దాక్కుంటుంది. ఇక జడ్జి లక్ష్మీ, విహారిలను పీటల మీద కూర్చొమని చెప్తుంది. పంతులుతో వాళ్లిద్దరికీ విడాకులు.. పెళ్లికి ఎలా మంత్రాలు చదువుతారో వాళ్లిద్దరినీ విడగొట్టడానికి మంత్రాలు చదవండి అని అంటుంది.
విహారి, లక్ష్మీ ఇద్దరూ షాక్ అయి లేచేస్తారు. పెళ్లికి మంత్రాలు ఉంటాయి కానీ విడిపోవడానికి ఉండవు.. అని పంతులు చెప్తారు. దానికి జడ్జి వేద మంత్రాలే చదవండి.. వాటి తోనే ఒక్కటైయ్యారు కదా వాటితోనే విడిపోతారు అని చెప్తుంది. విహారి కరెక్ట్ అని నేను కట్టిన తాళే నీకు ఇప్పుడు వద్దు కదా నేనే దాన్ని తీసేస్తాను అని లక్ష్మీతో అంటాడు. లక్ష్మీ వద్దని తాళి పట్టుకుంటుంది. విహారి లక్ష్మీతో ఈ మూడు ముళ్లు తీసేస్తే నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవచ్చని అంటాడు. లక్ష్మీ తన తాళిని ముట్టుకోవద్దని అంటుంది. తాళి తీయకుండానే విడాకులు ఇప్పించేయండి అంటుంది. విహారి తాళి తీసేస్తా అని అంటాడు.
జడ్జి లక్ష్మీతో విడాకులు అయిపోతే ఆ తాళితో నీకు సంబంధం ఉండదు అది తీసే అని అంటుంది. లక్ష్మీ వద్దని జీవితాంతం ఆ తాళిని నేను మోస్తా అని అంటుంది. విహారి వద్దు కానీ విహారి కట్టిన తాళి కావాలా అని అడుగుతుంది. జడ్జి లక్ష్మీతో మీ ఇద్దరూ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి ఇద్దరికీ పది నిమిషాలు టైం ఇస్తానని జడ్జి అంటుంది. మరోవైపు యమున, పద్మాక్షి గుడి మొత్తం వెతుకుతుంది. ఇక జడ్జి యమునని చూసి వెళ్తుంది. యమున గారు మీ భర్త హరికృష్ణ గారు మా క్లాస్ మేట్ అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత యమున, పద్మాక్షి వెళ్లిపోతారు. తర్వాత జడ్జి విహారి దగ్గరకు వచ్చి తను మీ అమ్మ కదా.. నువ్వు హరి కొడుకు అని నాకు తెలుసు. మీ నాన్న నాకు చాలా మంచి ఫ్రెండ్. నేను ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉండటానికి మీ నాన్న కారణం. మీ కేసు చూసిన రోజు నాకు అర్థమైంది నువ్వు హరికృష్ణ కొడుకు అని.. లక్ష్మీ నువ్వు విహారి కోసం పోరాడటం చూసి అర్థమైంది నువ్వు విహారి చేయి వదలవు అని మీ ఇద్దరూ సమస్యకి విడివిడిగా కాకుండా కలిసి సమాధానం వెతకండి అని చెప్తుంది. ఇద్దరిని దీవించి మీకు నేను విడాకులు ఇవ్వను అని వెళ్లిపోతుంది.
విహారి లక్ష్మీని హగ్ చేసుకొని మనల్ని ఇక ఎవరూ విడదీయలేరు అని అంటుంది. ఇంటికి వచ్చిన పద్మాక్షి తన ఫ్రెండ్‌కి కాల్ చేస్తే నేను చూసింది కచ్చితంగా విహారినే అని అంటుంది. ఇంతలో విహారి వస్తాడు. విహారిని ఆపి నువ్వు గుడికి వెళ్లావా అని అడుగుతుంది. లక్ష్మీ కూడా కూరగాయల సంచి తల మీద అక్షింతలతో ఇంటికి వస్తుంది. విహారి వెళ్లానని చెప్తాడు. ఎవరితో వెళ్లావ్.. ఎందుకు వెళ్లావ్ అని అడుగుతుంది. ఇంతలో చారుకేశవ వచ్చి మన స్టాఫ్‌తో వచ్చా అని చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావ్ అల్లుడు అని విహారి కేసు నుంచి తప్పించుకుంటే గుడికి వస్తా అని మొక్కుకున్నానని చెప్తాడు. సహస్రని ఎందుకు తీసుకెళ్లలేదు అని అడుగుతుంది. సహస్ర ఎక్కడా కనిపించలేదు అని అంటాడు చారుకేశవ.
పద్మాక్షి లక్ష్మీని కూడా నువ్వు ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. లక్ష్మీ కూరగాయలకు వెళ్లిందని యమున చెప్తుంది. ఆ మాట అది చెప్పలేదా అని పద్మాక్షి అడుగుతుంది. లక్ష్మీ కంగారు తల మీద అక్షింతలు పద్మాక్షి చూస్తుంది. లక్ష్మీని దాని గురించి నిలదీసే టైంకి సహస్ర ఆకలి అమ్మా అని తీసుకెళ్లిపోతుంది. పద్మాక్షి అక్షింతలు గురించి ఆలోచిస్తుంది. లక్ష్మీ మీద అనుమానం రోజు రోజుకి పెరిగిపోతుంది. లక్ష్మీ తన మొగుడు వచ్చినా వెళ్లడం లేదు.. విహారి లక్ష్మీని వదలడం లేదు.. ఆ లక్ష్మీ గురించి విహారి గురించి.. అసలు ఏం జరుగుతుందో అంతా తెలుసుకుంటా అని అనుకుంటుంది.
జడ్జి లక్ష్మీ విహారిలకు విడాకులు ఇచ్చారో లేదో అని టెన్షన్ పడుతూ లక్ష్మీకి విషయం అడుగుతుంది. లక్ష్మీ ఏడుస్తూ గుడిలో జరిగింది మొత్తం చెప్తుంది. ఎందుకు తాళి తీయించుకోలేదు లక్ష్మీ అని యమున అడుగుతుంది. ఆ పని నువ్వు చేయలేదు అంటే నీకు విహారిని వదలడం ఇష్టం లేదా.. విహారి కట్టిన తాళి ఇంకా అలాగే మోయాలి అనుకుంటున్నావా.. విహారి జీవితం నుంచి నీకు వెళ్లిపోవాలి అని ఉందా లేదా.. నువ్వు విడాకులు ఇవ్వకపోతే విహారిని వదలకపోతే ఏం అవుతుందో తెలిసి కూడా విహారిని వదలడం లేదు అంటే అర్థమేంటి.. నీకు ఏమైనా ఆశలు కోరికలు ఉన్నాయా చెప్పు లక్ష్మీ అని యమున అడుగుతుంది. లక్ష్మీ యమున కాలి మీద పడి నన్ను ఈ విషయంలో క్షమించండి విహారి గారితో తాళి తీయించాలి అనుకున్నా కానీ తాళి ముట్టుకోగానే సహించలేకపోయా.. నా ప్రాణం తీసినా ఈ తాళి తీయను అని లక్ష్మీ అనేస్తుంది. నాకేం ఆశలు కోరికలు లేవు ఈ ఇంట్లో ఓ మూలన ఉంటాను.. విహారి గారికి దూరంగా ఉంటాను..అంతే కానీ విడాకులు ఇవ్వనమ్మా నన్ను అర్థం చేసుకోండి అని చెప్తుంది. లక్ష్మీ మాటలకు యమున షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















