Nuvvunte Naa Jathaga Serial Today September 17th: నువ్వుంటే నా జతగా సీరియల్: నేత్ర చీటింగ్.. తల పట్టుకున్న మిథున? మిథునకు ఆదిత్య కుట్ర తెలుస్తుందా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 17th నేత్ర కేసు వాపస్ తీసుకుంటా అని పోలీస్ స్టేషన్‌లో రివర్స్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode నేత్ర కేసు వెనక్కి తీసుకుంటా అనడంతో మిథున నేత్రని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. దేవాకి మిథున కళ్లతోనే ధైర్యం చెప్తుంది. కేసు క్లోజ్ చేసి దేవాని విడిపించమని అంటుంది. ఎస్‌ఐ నేత్రతో నిన్ను ఎవరైనా భయపెట్టారా.. నిన్ను ఎవరైనా బెదిరించారా అని అడుగుతాడు. లేదని నేత్ర అంటే మరి కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావ్ నువ్వు ధైర్యంగా ఉండు డిపార్ట్‌మెంట్ మొత్తం నీ వెనక ఉంది అని అంటారు.
మరోసారి నేత్రతో కేసు వెనక్కి తీసుకుంటావా అని అడుగుతాడు. అక్కడే ఆదిత్య ఉండటం చూసిన నేత్ర భయంతో కేసు వెనక్కి తీసుకోను అని చెప్తుంది. మిథున షాక్ అయి ఇదేంటి ఇలా చేశావ్ అని నేత్రని నిలదీస్తుంది. దాంతో ఎస్‌ఐ బాధితురాలిని బెదిరిస్తే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అంటాడు. ఇక నేత్రతో వీడియో వాగ్మూం తీసుకుంటారు. నేత్ర తనకు అనుకూలంగా దేవా వాటర్ కోసం వచ్చి తన మీద అఘాయిత్యం చేశాడచి ఏడుస్తూ చెప్తుంది. తను అబద్ధం చెప్తుందని దేవా అరుస్తాడు. అంత దారుణంగా అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా అని దేవా చిరాకుపడతాడు.
దేవాని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని ఎస్‌ఐ అంటాడు. నేత్ర ఏడుస్తూ కేసు వెనక్కి తీసుకోవాలి అనుకున్నా కానీ దేవా మరో అమ్మాయి మీద కూడా ఇలాగే అత్యాచారం చేస్తాడేమో అని భయంతో కేసు పెట్టానని అంటుంది. మిథున కోపంగా ఏయ్ మా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అంటుంది. బాధితురాలిని బెదిరించావని నిన్ను జైలులో పెట్టాలా.. నువ్వు వచ్చిన పని అయిపోయింది ఇక పో అంటాడు. మిథున ఆటో కోసం రోడ్డు మీద ఎదురు చూస్తుంటే అటుగా హరివర్థన్ వచ్చి నీతో మాట్లాడాలమ్మా అని మిథునని తీసుకెళ్తాడు.
మిథునతో అందరిని వదిలేసి అతనితో వెళ్లిపోయావ్.. చూస్తూ చూస్తూ ఏ తండ్రి రౌడీని అల్లుడుగా ఒప్పుకోడు.. నేను మాత్రం నీ కోసం అందుకు రెడీ అయిపోయా.. ఇప్పుడు వాడి మీద రేప్ కేసు ఉంది.. ఈ జన్మలో వాడి ముఖం చూడను అని వచ్చేయాలి కానీ నువ్వు ఇంకా అతని కోసం తాపత్రయం పడుతున్నావ్ కదా నిన్ను ఏం అనాలో అర్థం కావడం లేదు అని హరివర్ధన్ అంటే నా భర్త ఏం తప్పు చేయడు అని నేను నమ్ముతున్నా అని మిథున అంటుంది. దేవా మనసులో అలాంటి దురుద్దేశం ఉంటే నన్ను కూడా అలా చూసేవాడు కదా.. నేను చీర మార్చుకునేటప్పుడు కూడా తల దించుకొని వెళ్లిపోయేవాడు.. దేవా మంచోడు అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అని అంటుంది. ఎవరో కావాలనే ఈ కుట్ర చేశారు అది తెలుసుకొని నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిస్తా.. అప్పుడు మీరే అంటారు నీకు నిజంగా శ్రీరాముడిలాంటి భర్త దొరికాడు అని అంటుంది.
మిథున దేవాని తీసుకొస్తుందని శారద వేయి కళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఇంతలో మిథున ఆటో దిగడంతో దేవా కూడా వచ్చేశాడని శారద, సత్యమూర్తి అందరూ దేవా అంటూ పరుగులు తీస్తారు. కానీ మిథున ఒక్కర్తే రావడంతో చూసి బాధ పడతారు. దేవాని ఎందుకు తీసుకురాలేదని శారద అడిగితే నేత్ర మోసం చేసిందని మిథున చెప్తుంది. జరిగింది అంతా చెప్తుంది. దేవా బయటకు రాడా జైలులోనే ఉంటాడా అని శారద చాలా ఏడుస్తుంది. ఈ రేప్ కేసు వల్ల వాడి భవిష్యత్ నాశనం అయిపోయేలా ఉందని సత్యమూర్తి కూడా ఏడుస్తాడు.
మిథున మామయ్యతో దేవాని కోపంగా చూసే మీరే దేవా కోసం ఏడుస్తున్నారు. ఈ ప్రేమ దేవాని నిర్దోషిలా బయటకు వచ్చేలా చేస్తుంది. చేయని తప్పునకు నా కొడుకుని శిక్షిస్తున్నారని శారద ఏడుస్తుంది. దేవాకి ఏం కాదు.. నేత్ర ప్రవర్తన వెనక చాలా అనుమానాలు ఉన్నాయి. దాని సంగతి నేను తేల్చుతా అని మిథున అంటుంది. నేత్ర, ఆదిత్య కలుస్తారు. నీ ప్లాన్ సూపర్ మిథున మైండ్ బ్లాక్ అయిపోయిందని అంటాడు. నేత్రకి డబ్బు ఇస్తాడు. మిథున గురించి నాకు బాగా తెలుసు తను ఓడిపోయినట్లే కనిపిస్తుంది కానీ గెలవడానికి పోరాడుతుంది. మిథునతో జాగ్రత్త తనకి నువ్వు కనిపించకు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. ఈ డబ్బు కొందరికి ఇవ్వాలి ఇచ్చేసి వెళ్లిపోతా అని అంటుంది. మరోసారి నేను నిన్ను కలవకూడదు.. కలిస్తే నీ చావే అని ఆదిత్య అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















