Chinni Serial Today September 17th: చిన్ని సీరియల్: మధు ప్రేమకి తల్లిదండ్రుల గీన్ సిగ్నల్! చిన్ని పరిస్థితేంటి? లోహిత-వరుణ్ లవ్ స్టోరీలో ట్విస్ట్!
Chinni Serial Today Episode Sep 17th వరుణ్ లోహితకు తనకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని చెప్పాలనుకోవడం, మధు మ్యాడీని ప్రేమిస్తుందని మధు తల్లిదండ్రులకు తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధుని డ్రాప్ చేయడానికి ఒప్పుకుంటాడు కానీ రివర్స్‌లో కూర్చొమని చెప్తాడు. లోహిత మొత్తం చూసి వాళ్లని ఫాలో అవుతుంది. మ్యాడీ స్పీడ్‌గా వెళ్లడంతో మధు బైక్ ఆపమని గోల చేస్తుంది. మ్యాడీ జాకెట్ అడిగి దాన్ని ఇద్దరి నడుములకు కట్టుకుంటుంది. మ్యాడీ వాళ్లు వేరే రూట్‌లో వెళ్లడంతో లోహిత ఎటు వెళ్లారా అనుకుంటుంది. ఇంతలో లోహితకు వరుణ్ కాల్ చేస్తాడు.
వరుణ్ లోహితతో కంగారుగా మాట్లాడుతూ కలుద్దాం అన్నావ్ కదా కాఫీ షాప్‌కి వస్తున్నా నువ్వు వచ్చేయ్ అంటాడు. లోహిత వెళ్లిపోతుంది. స్వప్న చిన్ని ఇంటికి వస్తుంది. మ్యాడీ బైక్ చూసి మ్యాడీని కాఫీ షాక్‌కి తీసుకెళ్లమని చెప్తే ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటా అని అనుకుంటుంది. చంటి మ్యాడీకి జామ ఆకులో చింతపండు ఉప్పు, కారం కలుపు ఇస్తాడు. వీలేజ్ పాన్ అంటూ మ్యాడీ తిని సూపర్ అని అంటాడు. మధు స్వప్న దగ్గరకు వెళ్లి మ్యాడీకి నీ లవ్ మేటర్ చెప్పావా అంటే లేదు అని అంటుంది. మ్యాడీని కాఫీ షాప్‌కి తీసుకెళ్లి లవ్ గురించి చెప్తావ్ అనుకుంటే ఇలా చేశావ్ ఏంటే అని అంటుంది. చెప్పాలి అనుకున్నా కానీ నేను ముందు నా ప్రేమ విషయం మా అమ్మానాన్నలకు చెప్పాలి అనుకున్నా.. వాళ్లకి చెప్పిన తర్వాతే మ్యాడీకి చెప్తా అని అంటుంది. స్వప్న షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు అని అంటుంది. ఇంతలో మధు తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మొత్తం వినేస్తారు.
సుబ్బు, స్వరూపలు సీరియస్‌గా రావడంతో మధు కంగారు పడుతుంది. కానీ స్వరూప మధుని హగ్ చేసుకొని నా బంగారం.. ఈ రోజుల్లో ప్రేమించిన వాడితో పారిపోయే సంగతి ఎవరో చెప్తే తల్లిదండ్రులకు తెలుస్తుంది. కానీ నువ్వు మాకు అంత గౌరవం ఇచ్చి నీ ప్రేమ సంగతి కూడా మాకు చెప్పాలి అనుకున్నావ్ అంటే అమ్మానాన్నలుగా మేం గెలిచినట్లే అమ్మా అని అంటుంది. సుబ్బు కూడా మధుతో ఒకసారి నీ మాట కాదు అని నేను తప్పు చేశా ఇప్పుడు ఆ తప్పు చేయను.. నీకు నీ ప్రేమకు తోడుగా మేం ఉంటాం అని అంటారు. మధు ఎగిరి గంతేస్తుంది.
స్వప్న పసుపు రంగు డ్రస్ తీసి మధుకి ఇచ్చి నీ ఫేవరెట్ కలర్ ఈ డ్రస్‌లో మ్యాడీ చూస్తే ఇక అంతే ఈ డ్రస్ వేసుకొని వెళ్లి ప్రపోజ్ చేయ్ అని అంటుంది. మరోవైపు వరుణ్ కాఫీ షాప్‌లో లోహిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో లోహిత వస్తుంది. వరుణ్ దగ్గరకు లోహిత వెళ్లి హాయ్ చెప్పి హగ్ ఇస్తుంది. వరుణ్ డల్‌గా ఉంటాడు. ఇక మ్యాడీ గురించి లోహిత అడిగితే మధుని డ్రాప్ చేసి వస్తా అని చెప్పాడని వరుణ్ చెప్తాడు. లోహిత తనకు చాలా హ్యాపీగా ఉందని.. గోవాలో ఎంగేజ్మెంట్, లండన్లో డెస్టినేషన్ వెడ్డింగ్, పారిస్‌లో హనీమూన్ అని మన పెళ్లి వండర్‌లా జరగాలి అని అంటుంది. మీ అమ్మవాళ్లు ఒప్పుకుంటారా అని వరుణ్ అడిగితే వాళ్లు నా పర్సనల్ మ్యాటర్స్ గురించి నన్ను ఫోర్స్ చేయరు అని అంటుంది.
వరుణ్ మనసులో ఇంట్లో వాళ్లు తనకి మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పాలి అనుకుంటాడు. ఇక మధు పసుపు రంగు డ్రస్‌లో రావడంతో స్వప్నతో మ్యాడీ మొదటి సారి విజిల్ వేయాలి అని ఉంది కానీ రాదే అని అంటాడు. దానికి స్వప్న నాకు వచ్చు నేను వేస్తా నువ్వు కవర్ చేసేయ్ అంటుంది. మధు రాగానే ఇద్దరూ విజిల్ వేస్తారు. మధు రాగానే సూపర్‌గా ఉన్నావ్ అని మహి అంటాడు. ఇక మధు తనని కాఫీ షాప్‌కి తీసుకెళ్లమని అంటుంది. లోహిత, వరుణ్ ఇద్దరూ కాఫీ తాగుతూ ఉంటారు. మధు మహికి ప్రపోజ్ చేసేసిందేమో అని లోహిత తెగ టెన్షన్ అయిపోతుంది. ఇంతలో మహి, మధు కాఫీ షాప్‌కి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















