Ammayi garu Serial Today September 16th: అమ్మాయిగారు సీరియల్: లవ్ స్టోరీ చెప్తామంటూ సూర్యప్రతాప్‌ని గతంలోకి తీసుకెళ్లిన రాజు, రూపలు!
Ammayi garu Serial Today Episode September 16th రాజు రూపలు సూర్యప్రతాప్, విరూపాక్షిలను దగ్గర చేయాలి అని వాళ్ల గతాన్ని ప్రేమ కథగా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ, ఆనంద్ ఇద్దరూ తప్పించుకొని పారిపోతుంటే రౌడీలు వెంట పడుతుంటారు. దీపక్‌కి రౌడీలు కాల్ చేస్తుంటే ఫోన్ కలవదు.. ఇక ప్రోగ్రాంలో రెండో నెంబరు ఎవరికి వచ్చింది అని బంటీ అడిగితే రాజు తనకు వచ్చిందని అంటాడు.
రాజుని బంటీ పిలిచి ఏం వచ్చింది నువ్వేం చేస్తావ్ అంటే రాజు తన ప్రేమ కథ చెప్తా అని అంటాడు. బంటీ ఒకే అనడంతో నా కథ చెప్పాలి అంటే రాజు పక్కన రాణి ఉండాలి అని అంటాడు. నేను రాణిలా చేస్తా అని రూప అలియాస్ రుక్మిణి పరుగులు పెడుతుంది. విజయాంబిక దీపక్‌తో వీళ్లు ఇద్దరూ ఏదో ప్లాన్ చేశారురా.. ఒక్కసారి ఇద్దరూ వెళ్లే మీ మామయ్య ఊరుకోరని ఇలా ఒక్కొక్కరు వెళ్లి నాటకం మొదలు పెట్టారని అనుకుంటారు.
రాజు స్టేజ్‌పై తన లవ్ స్టోరీ మొదలు పెడతాడు.. నా పేరు రాజు.. పేరుకి రాజు అయిన ఓ రాజుకి నమ్మిన బంటుని అని సూర్యప్రతాప్‌ని ఉద్దేశించి చెప్తాడు. నేనో మామూలోడిని.. ఇక మా అమ్మాయి గారు గొప్పింటి బిడ్డ.. మినిస్టర్ గారి బిడ్డ.. అంతస్తుల్లో ఉన్న అమ్మాయిగారిని నా పక్కన నిలబెట్లాడు ఆ దేవుడు. ఇక మా పెళ్లి గురించి చెప్పాలి అంటే సీతమ్మ రాముడ్ని స్వయం వరంలో ఒక్క చూపుతో పడేసింది అంటే నమ్మలేదు కానీ మా అమ్మాయి గారు ఒక్క చూపుతో పడేస్తే నమ్మేసా ఆ అనుభూతి చెందా అని చెప్తాడు.
సూర్యప్రతాప్ ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తాడు. విరూపాక్షి మోడ్రన్ డ్రెస్‌లో గొడుగు పట్టుకొని వస్తుంటే సూర్యప్రతాప్ స్కూటీ మీద వెళ్తూ మొదటి సారి చూపి అలా ఉండిపోవడం గుర్తు చేసుకుంటాడు. రాజు దగ్గరకు రూప ఎంట్రీ ఇస్తుంది. ఏంటి చందమామ అలా చూస్తున్నావ్ అని అంటాడు. నేను చందమామ కాదు అని రూప అంటే.. మీరు నాకు చందమామే ఎందుకంటే చీకటిలో ఉన్న నా మనసుకి వెలుగు ఇచ్చింది నీ దర్శనమే అని రాజు అంటాడు. ఆ డైలాగ్ సూర్యప్రతాప్ విరూపాక్షితో మొదటి పరిచయంలో చెప్తాడు. అప్పుడు ఆ సీన్ గుర్తు చేసుకుంటాడు. మాటలు బాగా చెప్తున్నావ్ సేక్స్‌పియర్ అని విరూపాక్షి అంటే సూర్యప్రతాప్ ఎల్లోరా శిల్పాలను నేను చూడలేదు కానీ నీ అంత అందంగా ఉండవు అనుకుంటున్నా అని అప్పట్లో విరూపాక్షిని పొగిడిన సీన్ గుర్తు చేసుకుంటాడు సూర్యప్రతాప్. విరూపాక్షిని చూస్తుంటాడు.
రాజు, రూపలు సూర్యప్రతాప్ డైలాగ్స్ అన్నీ రిపీట్ చేస్తారు. అచ్చం విరూపాక్షి తన పేరు చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడం.. దేవకన్యని తాకితే నేను శిల అయిపోతానేమో అని సూర్యప్రతాప్ అనడం ఏం అయిపోవులే అని విరూపాక్షి చేయి అందించడం.. మీరు చేయి తాగితే నాకు గుండె తాకినట్లు ఉందని సూర్యప్రతాప్ అంటాడు. అచ్చం రాజు, రూపలు సూర్యప్రతాప్‌కి తన గతం గుర్తు వచ్చేలా మాట్లాడుతారు. విజయాంబిక, దీపక్‌లు ఇదేంటి అనుకుంటారు వింతగా చూస్తుంటారు.
విరూపాక్షిని రెండో రోజు సూర్యప్రతాప్ కనిపిస్తాడు. విరూపాక్షి సూర్యప్రతాప్‌ని చూస్తున్నా సూర్యప్రతాప్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఏమైందని విరూపాక్షి అడిగితే మీరు మినిస్టర్ కూతురు అని విన్నాను.. నేను మిడిల్ క్లాస్ వద్దండి అంటే ప్రేమ ఇవేమీ చూడవు.. అంతస్థుల తేడా ఉండదు అని అంటుంది. దానికి సూర్యప్రతాప్ మీ నాన్న నన్ను చంపేస్తారు అంటే చంపేస్తే చూస్తూ ఊరుకుంటానా.. నువ్వు అంటే నాకు ప్రాణం.. నువ్వులేకపోతే ఉండలేను.. నువ్వు తప్ప మరో మగాడిని చూడను.. బతికితే నీ నీ భార్యగా బతుకుతా లేదంటే మా నాన్న కూతురిలా బతుకుతా కానీ మరొకరి భార్యగా బతకను అని విరూపాక్షి సూర్యప్రతాప్‌కి ప్రపోజ్ చేస్తుంది. విజయాంబిక రాజు, రూపల యాక్టింగ్ చూసి వీళ్లు నా తమ్ముడిని మార్చేసేలా ఉన్నారు ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది.
సూర్యప్రతాప్ విరూపాక్షికి తన ప్రేమ గురించి చెప్పడం అన్నీ సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటాడు. విరూపాక్షిని చూస్తూ అలా ఉండిపోతాడు. ఆ బంధం అబద్ధమా.. ఆ స్నేహం అబద్ధమా.. ఆ కాలం అబద్ధమా.. అనే బ్యాగ్రౌండ్‌కి సూర్యప్రతాప్ విరూపాక్షిని చూస్తూ బాధ పడతాడు. రాజు రూపతో నా స్థాయికి తగ్గట్టు గిఫ్ట్ తీసుకొచ్చా అది మీ స్థాయికి సరిపోతుందో లేదో అని పట్టీలు చూపిస్తాడు. స్థాయి చూడను నువ్వు పది రూపాయలతో తీసుకొచ్చినా నాకు అపురూపమే అని రూప అనడం.. సూర్యప్రతాప్ చాలా భారంగా తాను విరూపాక్షికి పట్టీలు పెట్టడం గుర్తు చేసుకొని అలా ఉండిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















