అన్వేషించండి

Ammayi garu Serial Today September 13th: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజులు కోమలి ఆట కట్టించారా? సూర్య-విరూపాక్షిల పెళ్లిరోజున ఊహించని ట్విస్ట్!

Ammayi garu Serial Today Episode September 13th కోమలిని రెచ్చగొట్టి రూప, రాజులు సూర్య,విరూపాక్షిల పెళ్లి రోజు వేడుక కోమలి చేసేలా చేయడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Ammayi garu Serial Today Episode ఆనంద్‌ సూర్యప్రతాప్‌ ఇంటికి వచ్చి కోమలి రూప కాదని అన్నీ సాక్ష్యాలు చూపిస్తాడు. అయితే దీపక్ సూర్యప్రతాప్‌ తప్పు చేసినట్లే ఓ వీడియో సృష్టించి అది సూర్యప్రతాప్‌కి చూపించి ఇది ఏఐ టెక్నాలజీ మామయ్య నేను బ్లాక్ మెయిల్ చేయించడం లేదు ఇప్పుడున్న టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చు.. మీరు మంచి నాయకుడు అయినా ఇలాంటి రాసలీలలు చేస్తారని చెప్పొచ్చు అంతా ఏఐ మహిమ మామయ్యా. ఈ అమ్మాయి రూప కాదు కోమలి అని కూడా టెక్నాలజీని ఉపయోగించి చేయొచ్చు అని కోమలి కోమలి కాదు.. రూప అని నమ్మిస్తాడు. ఆ డాక్యుమెంట్స్ అనీ క్రియేట్ చేయించినవే అని సూర్యప్రతాప్‌ని నమ్మించేస్తాడు.

సూర్యప్రతాప్‌ పూర్తిగా దీపక్ మాటలు నమ్మేస్తాడు. రుక్మిణి, విరూపాక్షిలే అంతా చేయించారని ఇద్దరినీ ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ఇద్దరూ ఏడుస్తూ వెళ్లిపోతుంటే రాజు సూర్యప్రతాప్‌ని ఒప్పించి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా అని ఇద్దరూ ఇంట్లో ఉండేలా చేస్తాడు. ఇక దీపక్ చివరి నిమిషంలో తప్పించినందుకు విజయాంబిక, కోమలిలు దీపక్‌ని ఆకాశానికి ఎత్తేస్తారు. రాజుకి అనుమానం వచ్చేసింది ఇక అశోక్‌కి కాల్ చేయకు కాల్స్ లిఫ్ట్ చేయకు ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్తుంది. దాంతో కోమలి అశోక్ ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్‌ చేయదు.

విరూపాక్షి జరిగింది తలచుకొని ఏడుస్తుంటే రూప, రాజులు ఓదార్చే ప్రయత్నం చేస్తారు. దానికి విరూపాక్షి ఈ పాతికేళ్లలో నేను ఎదురైన ప్రతీ సారీ సూర్య నన్ను తిడుతూనే ఉన్నాడు.. తిట్టాడు అని బాధ పడటం లేదు ఇలా అయినా మాట్లాడుతున్నాడని అనుకున్నాను కానీ నా వల్ల ఇప్పుడు మీరు బాధ పడుతున్నారని ఏడుస్తుంది. రాఘవ వస్తే అంతా సెట్ అయిపోతుంది అప్పటి వరకు తప్పదు అని రూప తల్లిని ఓదార్చుతుంది.

రూప తన తల్లిదండ్రుల పెళ్లి రోజుని గుర్తు చేసుకొని ఎలా అయినా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటుంది. తాను చెప్తే సూర్య ప్రతాప్ఒప్పుకోడు కాబట్టి కోమలిని వాడుకోవాలని అని అనుకుంటుంది.

కోమలిని చూసి రూప, రాజులు ఇద్దరూ కోమలిని బకరాని చేసేలా మాట్లాడుతారు. రేపు కోమలికి చెక్ పెడతా రాజు.. రేపు అమ్మానాన్నల పెళ్లిరోజుని రాత్రి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తా. ఈ విషయం కోమలికి తెలీదు కాబట్టి కోమలి మీద నాన్నకి అనుమానం వస్తుంది నా మీద కోపం తగ్గిపోతుంది అని అంటుంది. రాజు తెగ నటించేస్తూ ఈ విషయం కోమలికి తెలీకూడదు అమ్మగారు.. కోమలి వినేస్తే తను ప్లాన్ చేసి మార్కులు కొట్టేస్తుంది అని అంటాడు. కోమలి మొత్తం వినేసి మీ కంటే ముందు నేను సెలబ్రేట్ చేస్తా అని అనుకుంటుంది. మరోవైపు దీపక్ ఆనంద్ని కూడా రాఘవ దగ్గరకే కట్టి పడేస్తాడు.

రూప వేసిన వలలో పడిపోయిన కోమలి ఉదయమే అందర్ని పిలిచి డెకరేషన్ చేయించేస్తుంది. సూర్యప్రతాప్‌కి కొత్త బట్టలు ఇచ్చి సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేశా అని చెప్తుంది. దీపక్, విజయాంబికలకు విషయం తెలిసి మనం వాళ్లని విడదీయాలి అనుకుంటే ఈ పిచ్చిది ఇలా చేస్తుంది ఏంటా అనుకుంటారు. కోమలి విరూపాక్షికి కూడా విష్ చేసి కొత్త బట్టలు ఇస్తుంది. విరూపాక్షి రూపతో మా పెళ్లి రోజుని అది చేయడం ఏంటి అని అంటే దానికి రూప నాన్నకి మన మీద కోపంతో మనం ఏం చేసినా ఒప్పుకోరని కోమలి చేసేలా మేమే ప్లాన్ చేశాం నువ్వు రెడీ అవ్వు అమ్మా అని చెప్తారు.

కోమలి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి కళ్లు మూసుకొని కిందకి తీసుకెళ్తుంది. కిందకి తీసుకొచ్చిన తర్వాత సూర్యప్రతాప్‌ మొత్తం చూసి హ్యాపీగా ఫీలవుతాడు. కోమలి అరుస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న అని అంటుంది. దానికి సూర్యప్రతాప్‌ సర్‌ఫ్రైజ్‌లు మనం హ్యాపీగా ఫీలయ్యేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు.. కోపంతో రగిలిపోకూడదు అని అంటాడు. కోమలి షాక్ అవుతుంది. సూర్యప్రతాప్‌ కోమలితో నా జీవితంలో పెళ్లి రోజు అనేది ఓ పీడ కల అలాంటిది నువ్వు సెలబ్రేట్ చేయాలి అనుకోవడం ఏంటి.. ఈ రోజే ఆ మహా తల్లి నిన్ను నన్ను గాలికి వదిలేసి పోయింది.. ఈ ఇంటి పరువు బజారుకి ఈడ్చేసింది. నన్ను ప్రాణాలతో ఉన్న శవాన్ని చేసింది. ఇలాంటి రోజు నీకు సెలబ్రేట్ చేయాలి అని ఎలా అనిపించింది. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే నిన్ను కూతురి అని కూడా చూడను అని కడిగేసి వెళ్లిపోతాడు. రూపా ఇలా ఇరికించేశావేంటే అని కోమలి అనుకుంటుంది.

సూర్యప్రతాప్‌ వెళ్తూ వెళ్తూ విరూపాక్షిని కోపంగా చూస్తాడు. విరపాక్షి బాధ పడుతూ వెళ్లిపోతుంది. ఇప్పుడు కోమలి తిక్క కుదిరిందని విజయాంబిక, దీపక్ అనుకుంటారు. విజయాంబిక కోమలితో ఇప్పుడు అర్థమైందా ఎందుకు నిన్ను ఆపాలి అనుకున్నామో.. ఇది నా తమ్ముడి దృష్టిలో రూప చేసింది కాబట్టి నిన్ను వదిలేశాడు లేదంటే చంపేసేవాడని అంటుంది. కోమలి విజయాంబికతో రాజు, రూపలే ఇలా నన్ను బుక్ చేశారని చెప్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని దీపక్ చెప్తాడు.

రాజు సూర్యప్రతాప్‌తో అమ్మాయి గారు చాలా బాధ పడుతున్నారు. మిమల్ని హ్యాపీగా ఉంచాలని ఇలా చేశారు. అమ్మాయి గారు గెస్ట్‌లను కూడా పిలిచేశారు. అందరూ తప్పుగా అనుకుంటారు. మిమల్ని ఎవరూ ఏం అన్నా నేను భరించలేను. మీరేం సెలబ్రేట్ చేసుకోవద్దు వచ్చిన వాళ్ల ముందు నవ్వుతూ నిల్చొండి చాలు అని మొత్తానికి మామని ఒప్పిస్తాడు. బంటీ తాతయ్య, అమ్మమ్మల చేయి పట్టుకొని తీసుకొస్తాడు. బంటీ తాతకి గిఫ్ట్ అని రాజు,రూప, బంటీ, సూర్యప్రతాప్, విరూపాక్షి ఉన్న స్కెచ్ గిఫ్ట్ ఇస్తాడు. బాగుంది అని సూర్య ప్రతాప్ చెప్తాడు.

మరోవైపు కోమలి లవర్ అశోక్ మారు వేషంలో సూర్యప్రతాప్‌ ఇంటికి గిఫ్ట్ పట్టుకొని వస్తాడు. కోమలి చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తాడు. ఎందుకు వచ్చావ్ అని కోమలి అడిగితే నువ్వు ఫోన్ మాట్లాడటం లేదు అని భయంగా ఉందని అంటాడు. రాజుకి నీ మీద అనుమానం ఉంది.. ఆనంద్‌ కూడా మొత్తం చెప్పేశాడని నా ఫోన్ ట్యాప్ చేసుంటారని విజయాంబిక నీతో మాట్లాడొద్దని చెప్పిందని కోమలి చెప్తుంది. విజయాంబిక, దీపక్లుల అశోక్ని చూసి నువ్వు ఇక్కడికి రావడం ప్రమాదం కదా అంటే నా గురించి మీరేం టెన్షన్ పడకండి నేను నన్ను చూసుకుంటా అని అశోక్అనడంతో విజయాంబిక లాగి పెట్టి కొట్టి ఏమనుకుంటున్నావ్రా.. దొరికితే నిన్ను చంపేయడమే కాదు మమల్ని చంపేస్తారు. ఇంకోసారి కోమలికి కాల్ చేసినా ఈ ఇంటి వైపు వచ్చినా చంపేస్తా అంటుంది. అశోక్‌ని వెళ్లిపోమనని చెప్తుంది. ఇంతలో రాజు అక్కడికి రావడంతో అశోక్‌ దాక్కుంటాడు.

రాజు కోమలితో ఏంటి అంత కంగారు పడుతున్నావ్.. నీకు ఓ మాట చెప్పాలి నీ వల్లే ఈ ఫంక్షన్ జరుగుతుంది అందుకు థ్యాంక్స్ కానీ ఇంకో మాట.. వీళ్లు నిన్ను తెచ్చినట్లే ఇంతకు ముందు చాలా మందిని తీసుకొచ్చారు.. వాళ్లంతా శిక్ష అనుభవిస్తున్నారు. నీకు ఇంతకంటే పెద్ద శిక్షే పడుతుంది. అమ్మగారికి పెద్దయ్యగారిని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విడదీయలేరు. ఈ రోజు ఎలా అయినా ఇద్దరినీ కలిపి చూపిస్తా అని కేక్ కటింగ్‌కి పిలుస్తాడు. సూర్యప్రతాప్‌, విరూపాక్షి ఇద్దరూ కేక్ కట్ చేస్తారు. విరూపాక్షి సూర్యప్రతాప్‌ చేయి పట్టుకున్నా సూర్యప్రతాప్‌ ఏం అనడు. కేక్ ఒకరికి ఒకరు తినిపించుకోండి అని బంటీ చెప్పడంతో విరూపాక్షి సూర్యప్రతాప్‌కి కేక్ అందిస్తే సూర్యప్రతాప్‌ అయిష్టంగానే తింటాడు. రూప చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇవీ వారం హైలెట్స్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget