Ammayi garu Serial Today September 15th: అమ్మాయిగారు సీరియల్: దీపక్ చెర నుంచి తప్పించుకున్న రాఘవ, ఆనంద్! సూర్యతో నిజం చెప్తారా?
Ammayi garu Serial Today Episode September 15th రాఘవ, ఆనంద్ ఇద్దరూ దీపక్ చెర నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్, విరూపాక్షి కేక్ కట్ చేసి తినిపించుకుంటారు. బంటీ తాతతో నీకు ఇంకో సర్‌ఫ్రైజ్ ఉందని అంటాడు. మరోవైపు ఆనంద్, రాఘవలు విరూపాక్షి పాతికేళ్లగా పడుతున్నా బాధ అంతా తొలగించాలని ఎలా అయినా తప్పించుకోవాలని అనుకుంటారు. ఏం చేయాలా అని ఆలోచించి ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గర జరిగి కట్లు విప్పుకుంటారు. రాఘవ, ఆనంద్‌లు పారిపోవడం రౌడీలు చూసి వెంటపడతారు.
బంటీ తాతకు రెండో సర్‌ఫ్రైజ్‌గా పార్టీ ఏర్పాటు చేస్తాడు. సూర్యప్రతాప్, విరూపాక్షిలను పక్కపక్కనే కూర్చొపెట్టి.. మిగతా అందర్ని జంటలుగా కూర్చొపెడతాడు. పార్టీ ఏర్పాటు చేసిన రూపమ్మకి థ్యాంక్స్ అని చెప్తాడు. ఇక చిట్టీలు ఏర్పాటు చేసి అందులో ఏం ఉంటే అది చేయాలి అని చెప్తాడు. అందరికీ చిట్టీలు పంచుతాడు. ముందు చీటీ నెంబరు వన్ చంద్రకి రావడం అందులో జీవిత భాగస్వామి కోసం చెప్పాలని రావడంతో చంద్ర సుమ గురించి చెప్తాడు. ఎక్కడి నుంచో వచ్చి మన కోసం మనతో బతుకుతారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు సాధారణం కానీ అవన్నీ దాటుకొని భాగస్వామిని నమ్మాలి.. కనిపించేవి నిజం కాదు.. చెప్పుడు మాటలు విని మన దాంపత్య జీవితం నాశనం చేసుకోకూడదు అని చెప్తాడు. అవన్నీ సూర్యప్రతాప్ తనకు అనుకుంటూ ఇబ్బందిగా ఫీలవుతాడు. విరూపాక్షి సూర్యప్రతాప్‌నే చూస్తుంటుంది.
రెండో నెంబరు మందారానికి రావడంతో చేయలేని పని చేయాలి అని వచ్చిందని చెప్పి దీపక్, విజయాంబికల్ని పిలుస్తుంది. దీపక్, విజయాంబిక, మందారం కలిసి ఓ డ్రామా చేస్తారు. మందారం పెళ్లి రోజు అని దీపక్కి ఆశీర్వాదం అడగటం దీపక్ ఇచ్చే టైంకి విజయాంబిక పిలిచి కాఫీ అడుగుతుంది. కాఫీ ఇస్తే బాలేదు షుగర్ లేదు.. చల్లారిపోయింది అని మందారాన్ని సతాయిస్తుంది. మాటి మాటికీ తిప్పుతుంది. ఇక దీపక్ అయితే మందారాన్ని పట్టించుకోడు. విజయాంబిక మందారాన్ని కొడుతుంది. దాంతో మందారం అత్తకి ఎదురు తిరుగుతుంది. పోనీలే అని సేవలు చేస్తే నా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోనివ్వకుండా నన్నే కాఫీ అని తిప్పుతావా.. పైకా టేస్ట్ లేదని కొడతావా అని అత్తని కొడుతుంది.
దీపక్ ఎంట్రీ ఇచ్చి మా అమ్మనే కొడతావా అని మందారాన్ని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. దాంతో మందారం ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా అనే బ్యాగ్రౌండ్ పాటకు అత్తా, భర్తల్ని చితక్కొడుతుంది. ఇలా కొట్టేవేంటే అని దీపక్ అడిగితే డ్రామాలో భాగంగా అలా కొట్టానని మందారం అంటుంది. అందరూ క్లాస్స్ కొడతారు. రాజు, రూపలు నవ్వుకుంటారు. మొత్తానికి అత్తా భర్తల్ని కొట్టి మందారం తన కోరిక నెరవేర్చుకుంటుంది. దీపక్ తల్లితో డ్రామా అని చెప్పి ఫ్యూచర్ చూపించింది అంటే.. దాని మనసులో ఉన్నది చేసింది దగ్గర్లోనే దానికి మనం ఏంటో చూపిద్దాం అని తల్లీ కొడుకులు అనుకుంటారు. విజయాంబికకు మందారం కొట్టడం చూసి విరూపాక్షి కూడా నవ్వుకుంటుంది. మరోవైపు ఆనంద్, రాఘవలు తప్పించుకొని సూర్యప్రతాప్ ఇంటి వైపు వస్తుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















