Ammayi garu Serial Today October 8th: అమ్మాయి గారు సీరియల్: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుంటున్న కోమలి.. రాజు, రూపలకు దొరికిపోతుందా!
Ammayi garu Serial Today Episode October 8th రూప, రాజులు అశోక్ కోమలి నిశ్చితార్థం దగ్గరకు వెళ్లి సూర్యప్రతాప్‌కి విషయం చెప్పాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ కోమలిని పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఆ మాటలు కోమలి వినదు కానీ మందారం విని దీపక్‌ని చితక్కొడుతుంది. నీకు పెళ్లాం తప్ప అందరు ఆడవాళ్లు కావాలిరా అని పచ్చడి చేస్తుంది. ఇంతలో విజయాంబిక వచ్చి మందారాన్ని ఆపుతుంది. మందారం దీపక్ చెంప మీద కొట్టాలని చేయి ఎత్తి విజయాంబికను ఒక్కటిస్తుంది.
దీపక్ ఏం చేశాడని అడుగుతుంది. దాంతో మందారం విజయాంబికతో వీడు ఆ కోమలిని ప్రేమిస్తున్నాడు అంట.. పెళ్లి చేసుకుంటాడంట.. ఈయన గారు ఆవిడ గారి కోసం ఏం ఏం చేశాడో అన్ని వివరంగా చెప్తాడు.. ఇంకా చాలా చాలా చెప్పాడని మొత్తం చెప్తుంది. దాంతో విజయాంబిక దీపక్‌కి ఒక్కటిస్తుంది. మందారం వాడిని నువ్వు కొట్టడం తప్పే కాదు వాడి మాటలు పట్టించుకోకు.. ఈ విషయం బయటకు చెప్తే నీ పసుపుకుంకుమలే పోతాయి ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్తుంది. వాడికి బుద్ధి వచ్చినట్లు నేను చేస్తా అంటుంది. దీపక్ తల్లితో రూపలా నటిస్తున్న కోమలి రూప వెళ్లిపోయిన తర్వాత ఆస్తి కోమలికే వస్తుంది కదా అని ప్రేమిస్తున్నా అని నటించా అని చెప్తాడు. విజయాంబిక నమ్మేస్తుంది.
అశోక్ తల్లిదండ్రులు నిశ్చితార్థానికి టైం అయింది కోమలి ఎక్కడా అని అశోక్‌ని అడుగుతారు. కోమలికి ఫోన్ చేయమని అంటారు. కోమలి ఫోన్ ట్రాప్‌లో ఉంది ఇప్పుడెలా అని అశోక్ దీపక్‌కి కాల్ చేస్తాడు. దీపక్‌తో కోమలిని త్వరగా పంపించండి అని అంటాడు. కోమలి ఎప్పుడో వచ్చేసిందని దీపక్ అంటాడు. ఇంతలో కోమలి అక్కడికి వెళ్తుంది. కోమలిని రెడీ చేయమని మామగారు అశోక్ తల్లితో చెప్తారు. రూప కోమలి గది మొత్తం చూసి ఉదయం నుంచి చూశా కోమలి ఎక్కడా కనిపించడం లేదని రాజుతో చెప్తుంది. కోమలి ఎక్కడికి వెళ్లుంటుందని రాజు అంటాడు. దీపక్, విజయాంబికలు టెన్షన్ పడటం చూసి వాళ్ల దగ్గర కోమలి లేదు వాళ్ల టెన్షన్ కోమలి కోసమే అయింటుంది. మొత్తానికి ఏదో తేడా కొడుతుందని రాజు అంటాడు. ఇంతలో అక్కడికి మందారం వస్తుంది.
మందారం రాజు, రూపలతో కోమలికి ఈ రోజు నిశ్చితార్థం అని చెప్తుంది. రాజు రూపలు షాక్ అయిపోతారు. రాత్రి దీపక్ కోమలి అని తనతో చాలా చెప్పాడని మందారం చెప్తుంది. కోమలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని రూప అంటుంది. కోమలి ఫోన్ ట్రాప్ చేసుండటంతో లొకేషన్‌కి రాజు, రూపలు బయల్దేరుతారు. అశోక్, కోమలిల నిశ్చితార్థం జరుగుతుంటుంది. రాజు, రూపలు గుడి దగ్గరకు వెళ్తారు. మొత్తం చూస్తుంటారు. ఇక విజయాంబిక, దీపక్‌లు రూప, రాజుల కోసం చూస్తూ ఉంటారు. కోమలి కోసం సూర్యప్రతాప్ అడిగితే ఏం చేద్దాం అని అనుకుంటుంది. రాజు, రూపలు మొత్తం తిరిగి ఓ చోట అశోక్, కోమలిల నిశ్చితార్థం జరుగుతుంటే వెళ్తారు. నిశ్చితార్థం పేరుతో కోమలి గొయ్యి కోమలి తవ్వుకుంది.. ఈ విషయం పెద్దయ్యగారికి తెలియాలి అంటాడు. వీడియో తీయమని రూప అంటే వద్దు అలా చేస్తే ఏఐతో చేశాం అని చెప్తారు. అందుకే నేను పెద్దయ్య గారిని తీసుకొస్తా అంటాడు. టైం సరిపోదు అని రూప అని వీడియో కాల్ చేసి చూపిద్దాం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















