Ammayi garu Serial Today October 2nd: అమ్మాయిగారు సీరియల్: విజయాంబిక, దీపక్‌లకు కొరడా దెబ్బల శిక్ష పడటానికి కారణమేంటి? గుడిలో రాజు, రూప ఏం చేశారు?
Ammayi garu Serial Today Episode October 2nd విజయాంబిక, దీపక్ గుడిలో దొంగతనం చేశారని రాజు, రూపలు పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరినీ చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప, రాజు, సుమ, చంద్ర, మందారం అందరూ తమ ప్లాన్ సక్సెస్ అయిందని ఇక త్వరగా వెళ్లిపోదాం.. మళ్లీ నాన్నకి అనుమానం వస్తుందని రూప అంటుంది. వద్దని లంచ్ తర్వాత వెళ్దాం.. అప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుందని రాజు అంటాడు. అవును ఈ రోజు మొత్తం వదిలేద్దాం అని చంద్ర అంటాడు.
రూప వాళ్లు మాట్లాడుకున్న మాటలు అన్నీ విజయాంబిక, దీపక్, కోమలి వింటారు. దీపక్ మొత్తం వీడియో తీస్తాడు. విజయాంబిక క్లాప్స్ కొట్టి చాలా బాగా ప్లాన్ చేశావ్ చంద్ర అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మీ అన్నయ్యకి నమ్మకద్రోహం అంటే నచ్చదు అని తెలిసి కూడా నమ్మక ద్రోహం చేశావ్.. మీరు ఇంట్లో అందర్ని బయటకు తీసుకొచ్చినప్పుడే డౌట్ వచ్చింది మీరు మాట్లాడింది అంతా వీడియో తీశాం.. పదండి మీ అందరి సంగతి తేల్చుతా అని విజయాంబిక వెళ్తుంది.
చంద్ర, సుమ విజయాంబికను ఆపుతారు. ఏం తప్పు చేయకుండా వదిన శిక్ష అనుభవిస్తుంది.. పాపం అక్క.. అన్నయ్య కూడా వదిన లేకుండా బతికేశాడు కదా అని చంద్ర అంటాడు. వదిన ఇద్దరినీ కలిసి ఉండేలా చేద్దాం వదిన గారు ప్లీజ్ వదినగారు అని సుమ బతిమాలుతుంది. విజయాంబిక ఇద్దరినీ తిడుతుంది. చీ కొడుతుంది. ఈ మోసగాళ్లతో చేరి మమల్నే మోసం చేస్తావా మిమల్ని వదలను అని అంటుంది విజయాంబిక. సుమ వాళ్లు ఎంత చెప్పినా విజయాంబిక వినకుండా ఇంటికి బయల్దేరుతుంది.
కోమలి రూపతో కర్పూరం పెట్టి నా చేయి కాల్చావు కదా.. ఇంటికి రా మీ నాన్న కోపంతో మీరంతా కాలిపోవడం నేను చూస్తా అని కోమలి అంటుంది. మరోవైపు గుడిలో ఓ దంపతులు అమ్మవారికి ముక్కుపుడక సమర్పించాలని వస్తారు. అయితే అందులో ముక్కు పుడక కనిపించడదు. వాళ్లంతా కంగారు పడుతుంటారు. రాజు అది విని పంతులు వాళ్లతో మీ ముక్కుపుడక అతనే తీసుకెళ్తున్నాడని దీపక్‌ని చూపిస్తాడు. దాంతో అందరూ దీపక్ పారిపోతున్నాడని పరుగున వెళ్లి దీపక్ వాళ్లని అడ్డుకుంటారు. మేం సీఎం తాలూక అని విజయాంబిక అంటే మీరు సీఎం తాలూక అని మాకు తెలుసు కానీ మీరు దొంగలు అని అమ్మవారి ముక్కుపుడక తీసిన వాళ్లకి శిక్ష పడుతుందని అంటారు.
పాప పుడితే అమ్మవారికి ముక్కు పుడక పెడతామని మొక్కుకున్నాం మా సెంటిమెంట్ ఒకసారి వాళ్ల దగ్గర వెతకండి అని ఆ దంపతులు చెప్తారు. రాజు దీపక్ దగ్గర మందారం విజయాంబికను వెతుకుతారు. రాజు తన జేబులో నుంచి ముక్కు పుడక తీసి దీపక్ జేబులో వేసి దీపక్ జేబులో దొరికినట్లు బయటకు తీస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. అమ్మవారి ముక్కు పుడక దొంగతనం చేసిన నిన్ను వదలను అని పెద్దలు అంటారు. విజయాంబిక ఎంత చెప్పినా వినరు.. గుడిలో దొంగతనం చేసిన వాళ్లకి అనవాయితీగా వస్తున్న శిక్ష వంద కొరడా దెబ్బలు అని అంటారు. దీపక్, విజయాంబిక బిత్తర పోతారు.
రాజు రూపలు నవ్వుకుంటారు. దీపక్, విజయాంబికల్ని స్తంభానికి కట్టేసి కొరడా తెచ్చి మేం కొట్టడం సరి కాదు.. మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు వచ్చి కొట్టండి అంటారు. దాంతో రూప చంద్రని కొట్టమని అంటుంది. అక్కని కొట్టడానికి మీకు మనసు రాదు అని నాకు తెలుసు అని కోమలిని కొట్టమని అంటుంది. కోమలి సారీ చెప్పి ఇద్దరినీ చితక్కొడుతుంది. ఇద్దరూ కుయ్యో ముర్రో అనుకుంటారు. కోమలి అలిసిపోవడంతో మిగతా లెక్క నేను చూసుకుంటా రూపక్క నువ్వు తప్పుకో అని రూప వెళ్తుంది. మనసులో అత్త దొరక్క దొరక్క చాలా రోజులకు దొరికావ్ నీ పని అయిపోయింది చీర బిగిస్తుంది. ఇద్దరినీ రూప పచ్చడి చేసేస్తుంది. రూప కూడా అలసి పోయి రాజుకి కొరడా ఇస్తుంది. రాజు కూడా చావగొడతాడు.
దీపక్, విజయాంబిక ఓ చోట కూర్చొని బాధ పడుతుంటే కోమలి వెళ్లి ఇదంతా రాజు చేశాడు అని చెప్తుంది. ఇంతలో చంద్ర వచ్చి మేం అంతా ఆగమని చెప్పినా ఆగకుండా వెళ్లిపోతుంటే ఏమో అనుకున్నాం దొంగతనం చేస్తారా.. ఇంత బతుకు బతికి ఇలా చేయడం ఏంటి అని సుమ చంద్ర అంటారు. ఇదంతా మీ ప్లాన్ అని మాకు తెలుసు మీరు చేసిన పనికి తమ్ముడితో చెప్పి మీకు ఉంటుందని అంటారు. మీరు ఆ విషయం చెప్తే మేం మీరు చేసిన దొంగతనం గురించి చెప్తాం అని రాజు వీడియో చూపించి బెదిరిస్తాడు. సోషల్ మీడియాలోనూ వైరల్ చేస్తాం అంటాడు. దెబ్బకి విజయాంబిక, దీపక్‌లు సైలెంట్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















