Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీని కోడలిగా అంగీకరించిన యమునలో పశ్చాత్తాపం! పోచమ్మ ఏం చెప్పింది!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 2nd లక్ష్మీనే విహారి భార్య అని ఇంటి అసలైన కోడలు అని పోచమ్మ యమునతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పోచమ్మకి కనకమహాలక్ష్మీనే విహారి అసలైన భార్య అని తెలిసి ఎవరూ చూడకుండా లక్ష్మీ, విహారిలతో సారె ఇప్పిస్తుంది. అమ్మవారికి సారె ఇచ్చాం కదా.. అమ్మ ఊరిని పొగుడుతుందని అందరూ అంటారు. పద్మాక్షితో అందరూ మీ ఫ్యామిలీని తీసుకొచ్చారు.. మీ కూతుర్ని తెచ్చారు చాలా సంతోషంగా ఉందని అంటారు. పానకాలు వీర్రాజుతో వాళ్లు సంతోషంగా ఉన్నారు మీరు చూడలేరు కదా వెళ్లిపో అని అంటాడు. వాళ్లు వెళ్లిపోవాలనే చూస్తున్నా అని వీర్రాజు అంటాడు.
పంతులు విహారితో మీ భార్యతో మీరు గుడిలో ఉన్న చెట్టుకి ఉయ్యాల కడితే మీ నాన్న గారు పుడతారని అంటారు. పద్మాక్షి ఎమోషనల్ అయి మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు.. ఇప్పుడు నా కూతురికి పుడతారు అని సంతోషపడుతుంది. భక్తవత్సలం, కాదాంబరి కూడా మా కొడుకు మా మనవడికి పుడతారని సంతోషపడతారు. పంతులు సహస్రకి ఉయ్యాల ఇచ్చి మీరు అత్యంత శ్రద్ధగా ఉయ్యాల కట్టండి సంవత్సరంలో మీరు బిడ్డని కంటారు అని పంతులు చెప్తాడు.
పద్మాక్షి లక్ష్మీని తోడుగా పంపుతుంది. సహస్రతో లక్ష్మీ వెళ్లి సహస్రని చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కట్టమని చెప్తుంది. సరే అని సహస్ర చేస్తుంది. సహస్ర మొక్కకొని ఉయ్యాల కడుతుంది. తర్వాత సహస్ర వెళ్లిపోతుంది. సహస్ర కట్టిన ఉయ్యాల గాలికి ఊగి పడిపోతుంటే లక్ష్మీ పట్టుకుంటుంది. ఇక లక్ష్మీ ఆ ఉయ్యాల చెట్టుకి కడుతుంది. యమున అది చూసి షాక్ అయిపోతుంది. పోచమ్మ కూడా చూస్తుంది. పోచమ్మ యయున దగ్గరకు వచ్చి ఏదో సందిగ్ధంలో ఉన్నారు అని అంటుంది. ఏం లేదు అని యమున అంటే.. ఏం లేకపోవడం ఏంటి.. మోసంతో కలిసిన బంధం ఏది.. ఆ దేవుడు కలిపిన బంధం ఏదో తెలీన సందిగ్ధంలో ఉన్నావు..నిజం నాకు తెలుసు నీకే అసలు నిజం తెలీదు అని పోచమ్మ అంటుంది. అసలు నిజమా అని యమున అడుగుతుంది.
పోచమ్మ యమునతో ఆ దేవుడు కలిపిన విహారి, లక్ష్మీల బంధం గురించి మాట్లాడుతున్నా.. మీ ఇంటికి అసలైన కోడలు ఆ కనక మహాలక్ష్మీ అని పోచమ్మ చెప్పగానే యమున షాక్ అయిపోతుంది. ఆ విషయం తెలీక మీరు చాలా తప్పులు చేశారు.. ఇకనైనా గుర్తించండి ఆ కనక మహాలక్ష్మీ మీ కొడుకు ఆయుష్షున్ని మోస్తుంది. తనే ఓపికతో మీ కుటుంబం ముక్కలు కాకుండా కాపాడుతుంది. తన వల్లే మీరంతా సంతోషంగా ఉంటున్నారని గుర్తించండి.. ఇప్పటికైనా తనకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వండి అని చెప్తుంది. యమున చాలా చాలా ఏడుస్తుంది.
లక్ష్మీని గతంలో అవమానించడం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. అయ్యో ఎంత తప్పు చేశాను.. ఎంత పొరపాటు చేశాను.. నా వల్ల లక్ష్మీ ఎంతో బాధ పడింది.. చివరకు విడాకులు ఇవ్వమని కూడా బలవంతం చేశాను.. వాళ్లది దేవుడు కలిపిన బంధం కాబట్టే విడాకులు ఇవ్వకుండా ఆపాడు. నా తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటా అదే న్యాయం అని యమున అనుకుంటుంది. లక్ష్మీని తలచుకొని రాత్రి వీధిలో నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది.
లక్ష్మీ ఇంట్లో అందరికి భోజనం వడ్డిస్తుంది. భక్తవత్సలం లక్ష్మీతో ఆ అమ్మవారే నీకు అమ్మ అయింది.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అన్ని అంటాడు. అదృష్టమా పాడా అదే నిజం అయితే ఎందుకు మొగుడు దగ్గర లేకుండా ఇలా మన ఇంట్లో పని చేసుకుంటుంది అని అడుగుతుంది కాదాంబరి. పద్మాక్షి కోపంగా మన ఇంటి పనిమనిషితో సారె ఇప్పించడం ఏంటో అంతా మన ఖర్మ అని అంటుంది. సహస్ర మనసులో నేను మా బావ కలిసి ఇవ్వాల్సిన సారె నవ్వు ఇచ్చావ్ నీ అంతు చూస్తానే అని అనుకుంటుంది. సహస్ర అన్నం కలుపుతూ ఉంటే కాదాంబరి లక్ష్మీకి సాంబారు వేయమని చెప్తుంది. లక్ష్మీ సహస్ర చేతి మీద సాంబారు వేసేస్తుంది. దాంతో కళ్లు కనిపించడం లేదా అని సహస్ర లక్ష్మీని కొడుతుంది. అప్పుడే వచ్చిన యమున సహస్రని కొడుతుంది. తనని కొట్టి శిక్షించడానికి నీకు ఏం హక్కు ఉంది అని అడుగుతుంది.
సహస్ర కోపంగా అది ఈ ఇంటి పని మనిషి తప్పు చేసింది కొడతా అంటుంది. తను పని మనిషి కాదు.. ఈ ఇంటి కోడలు.. విహారి తాళి కట్టిన భార్య అని నిజం చెప్పేస్తుంది యమున. అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావ్ యమున నువ్వు అని పద్మాక్షి అడగటంతో యమున తేరుకొని నిజం చెప్పలేదు అని అనుకుంటుంది. విహారి కూడా సహస్రని తిడతాడు. కాదాంబరి సహస్రని ఏం అనొద్దు అని అంటే ఎందుకు ఆపుతావ్ అమ్మమ్మ.. బావ ఎప్పుడూ తాళి కట్టిన భార్యని పట్టించుకోడు.. వేరే వాళ్ల కోసం దెబ్బలు తింటాడు. సొంత పెళ్లాన్ని ఎవరు ఎన్ని అన్నా చూస్తూ ఉంటాడు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. మీ అమ్మా కొడుకుల వల్ల నా కూతురు ఎలా బాధ పడుతూ వెళ్లిందో చూశారా అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ బాధ పడుతూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















