Nindu Manasulu Serial Today October 2nd: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణ మధ్య ఏం జరుగుతోంది? గణ చెంపపై చేయి వేసింది ఎవరు?
Nindu Manasulu Serial Today Episode October 2nd సిద్ధూ, ప్రేరణ లోన్ కోసం వెళ్లడం, విశ్వాసం దగ్గర గణ విజయానంద్ సీక్రెట్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ షర్ట్‌కి ప్రేరణ రింగ్ ఉంటుంది. అది చూసి కుమార్ సిద్ధూని ఆట పట్టిస్తాడు. ఇక ప్రేరణ ముఖం కడుక్కొని వచ్చి చెల్లి దగ్గర కూర్చొంటుంది. చెవికి రింగ్ లేదు అక్కా అని ఐశ్వర్య అంటే ప్రేరణ సిద్ధూని హగ్ చేసుకోవడం గుర్తు చేసుకొని ఎక్కడో పడిపోయిందని అంటుంది.
ఇన్వెస్టర్లతో గొడవ అయింది.. సిద్ధూ వాళ్లని కొట్టాడు.. అని ఈ విషయం అమ్మకి చెప్పకు అమ్మ టెన్షన్ పడుతుందని అంటుంది. ఐశ్వర్య అక్కతో సిద్ధూకి నీకు మధ్య ఏదో జరుగుతుందని అంటుంది. ఎంత దాగా వెళ్తుందో అది చూస్తా అంటుంది. అలాంటిది ఏం లేదని ప్రేరణ వెళ్లిపోతుంది. మరోవైపు గణ సిద్ధూ కొట్టిన సీన్ గుర్తు చేసుకొని ఒంటరిగా గార్డెన్‌లో కూర్చొని చెంప మీద చేయి వేసుకొని ఉంటాడు. సార్ ఎక్కడ ఉన్నారు అని అనుకొని సుధాకర్ చూసి వెళ్తాడు. ఏమైంది సార్ ఇలా కూర్చొన్నారు అని అంటాడు. గణ చెంప మీద చేతి అచ్చులు చూసి షాక్ అయిపోతాడు. చెంప ఏంటి సార్ ఎర్రగా బీట్‌రూట్‌లా కందిపోయింది అని అడుగుతాడు. అంతలా కనిపిస్తుందా అని గణ అంటే అవును సార్ అంటాడు. మిమల్ని ఎవరు సార్ కొట్టింది.. అంత దమ్ము ఎవరికి ఉంది సార్ అని సుధాకర్ అంటాడు. సుధా ఎందుకు అలా అరుస్తున్నావ్ అమ్మ వింటుందని గణ అంటాడు. గణ ఫ్రస్టేట్ అవ్వడం సుధా మాటలు చాలా కామెడీగా ఉంటాయి.
గణ సుధాకర్తో తన చెంపని ఫొటో తీయమని అంటాడు. వాడు అంతు చూడాలి అంతకు అంత బదులు తీర్చుకోవాలి అని ఫొటోలు తీసుకుంటాడు. ఎవడో మంచి పని చేశాడని సుధాకర్ అనుకుంటాడు. గణ ఫొటోలు చూసి రగిలిపోతాడు. ఇక సిద్ధూ పడుకొని ఉంటే ప్రేరణ హగ్ చేసుకోవడం గుర్తు వచ్చి పడుకోకుండా డిస్ట్రబ్ అవుతాడు. ఉదయం సిద్ధూ ప్రేరణ వాళ్ల ఇంటికి వస్తాడు. రంజిత్ చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. సిద్ధూ రంజిత్తో అప్పుడే మర్చిపోయారా అని మొత్తం గుర్తు చేస్తాడు. దాంతో రంజిత్ అప్పుడెప్పుడో జరిగినవి చెప్తున్నావ్ అంటే నువ్వు నాకు తెలిసినవాడివే.. పైగా ప్రేరణ కోసం వచ్చావ్ కదా లోపలికి వెళ్లు అని అంటాడు.
సిద్ధూ లోపలికి వెళ్తుంటే ప్రేరణ కనిపిస్తుంది. ఏంటి లోపలికి వచ్చేస్తున్నావ్ అంటే మీ ఓనర్ పర్మిషన్ ఇచ్చారని సిద్ధూ అంటాడు. అవునా అని ప్రేరణ అనుకుంటుంది. ఇక ప్రేరణ సిద్ధూకి చెవి రింగు అడుగుతుంది. నా దగ్గర లేదు అని సిద్ధూ అంటాడు. ఉంది అని ప్రేరణ అంటే నన్ను దొంగ అంటున్నావా అని సిద్ధూ అంటాడు. సరే వదిలేయ్ అని ప్రేరణ అంటుంది. మొత్తానికి సిద్ధూ ప్రేరణకి చెవి పోగు ఇవ్వడు. ఐశ్వర్య చూసి వీళ్లు అర్థం కారు కానీ వీళ్ల మధ్య ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది.
గణ విశ్వాసం ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఉంటాడు. విశ్వాసం చూసి జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకుంటాడు. గణ విశ్వాసంతో మాట్లాడి విజయానంద్ మంచోడు కాదు అని విశ్వాసాన్ని రెచ్చి గొట్టి విజయానంద్కి సీక్రెట్ తెలుసుకుంటాడు. విజయానంద్కి పెద్ద బిజినెస్ మెన్ రత్నం గుండె మీద కాలు పెట్టి అతని భార్య, పిల్లల్ని బెదిరించి మొత్తం ఆస్తులు లాక్కున్నాడు.. వాడే మా సార్ని ఏం చేయలేకపోయాడు మీరేం చేస్తారు సార్ అని విశ్వాసం అంటాడు. గణ విశ్వాసానికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. ఇదేంటి థ్యాంక్స్ చెప్తున్నాడు కొంప తీసి ఫ్లో చెప్పేశానా అనుకుంటాడు.
ప్రేరణ, సిద్ధూ ఓ ఆఫీస్కి వస్తారు. అక్కడ విశ్వాసం ఇద్దరినీ చూసి ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటాడు. వాళ్లకి తెలీకుండా ఫాలో అవుతాడు. సిద్ధూ, ప్రేరణ లోన్ కోసం వెళ్తారు. తమ కాఫీ షాప్ ఐడియా బాగుంది అంటారు. కానీ లోన్ రాదు అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















