Ammayi garu Serial Today October 24th: అమ్మాయిగారు సీరియల్: కోమలికి కొట్టిన విరూపాక్షి! అడ్డంగా బుక్కైపోయిన నకిలీ రూప!
Ammayi garu Serial Today Episode October 24th కోమలిని సూర్యప్రతాప్ ముందు ప్రశ్నలతో రాజు, విరూపాక్షిలు ఇరికించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ ఇంటికి వచ్చేస్తారు.. కోమలి ఇంకా ఇంటికి రాలేదని విజయాంబిక, దీపక్ టెన్షన్ పడతారు. సూర్యప్రతాప్ తర్వాతే విరూపాక్షి రావడంతో ఇద్దరూ ఎక్కడైనా కలిసి వచ్చారా ఏంటి అని విజయాంబిక అంటుంది.
విరూపాక్షి రూప, రాజుల దగ్గరకు వెళ్తుంది. ఏమైంది అలా ఉన్నారు అని అడిగితే కోమలి అశోక్‌తో బయటకు వెళ్లింది.. ఫాలో అయ్యాను కానీ మిస్ అయిపోయా అని రాజు చెప్తాడు. ఇక కోమలిని అశోక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కోమలి రావడం విరూపాక్షి వాళ్లు చూస్తారు. విరూపాక్షి మనసులో రాజుకి తాయొత్తు కట్టి నా కూతురు అల్లుడిని విడదీయాలి అని చూస్తావా.. ఇంత కాలం బిడ్డ కోసం ఓర్పుతో ఉన్న విరూపాక్షిని చూసుంటావ్,, కానీ ఇప్పుడు నా బిడ్డ జోలికి వస్తే ఆదిపరాశక్తిలా మారే విరూపాక్షిని చూస్తావ్ అని కోపంగా కిందకి వెళ్తుంది. రాజు, రూపలు వెనక వెళ్తారు.
విరుపాక్షి కోమలి దగ్గరకు వెళ్లి లాగిపెట్టి కొడుతుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని అడుగుతుంది. కోమలి షాక్ అయి నిల్చొంటుంది. మరొకటి కొట్టేలోపు సూర్యప్రతాప్ వచ్చి ఆపుతాడు. రూపని ఎందుకు కొడుతున్నావ్ అని విరూపాక్షిని అడుగుతాడు. నువ్వే అడుగు సూర్య అని విరూపాక్షి అంటుంది. ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్లి ఇప్పటి వరకు రాలేదు అందుకే నేనే అమ్మకి చెప్పాను అని రూప అంటుంది. అందులో తప్పేముంది అని సూర్యప్రతాప్ అడిగితే రూప మామూలు మనిషి కాదు సీఎం కూతురు ఒంటరిగా బయటకు వెళ్లడమేంటి అని విరూపాక్షి అడుగుతుంది. ఎక్కడికి వెళ్లినా రాజుని తీసుకెళ్తారు కదా ఎందుకు తీసుకెళ్లలేదు అని మందారం అంటుంది. ఇక రాజు అయితే మీరు నన్ను పిలవలేదు కదా నేను పిలిచినా పట్టించుకోకుండా వెళ్లారు.. అసలు మీరు ఎవరితో వెళ్లారు అని అడుగుతాడు.
రాజు కోమలితో మీరు ఒంటరిగా వెళ్లలేదు ఎవరితో బైక్‌లో వెళ్లారు కదా ఎవరు అని అడుగుతాడు. సూర్యప్రతాప్ ఏంటమ్మా ఇది ఎవరు అతను అని అడుగుతాడు. దీపక్ తల్లితో అయిపోయింది మమ్మీ వీళ్లంతా కలిసి కోమలిని ఇరికించేశారు అని అంటాడు. సూర్యప్రతాప్ కోమలితో అడుగుతున్నారు కదా రూప ఎవరితో వెళ్లావ్.. ఎందుకు వెళ్లావ్.. ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. ఏం చెప్పి తప్పించుకోవాలి అని కోమలి అనుకుంటే విజయాంబిక వచ్చి చేసిన మంచి చెప్పకపోతే ఎలా రూప చెప్పు బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్లాను అని చెప్పు అని అంటాడు.
విరూపాక్షి కోమలితో ఆ మాత్రానికి నువ్వు వెళ్లడం ఏంటి రాజుకి చెప్పినా నాకు చెప్పినా మీ నాన్నకి చెప్పినా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయేది కదా అంటుంది. యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్ వాళ్ల నాన్నకి అందుకే వెళ్తాను.. మా నాన్నే ఆ పరిస్థితిలో ఉంటే వదిలేస్తానా అందుకే వెళ్లాను అంటుంది. ఏ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుందని రాజు అడుగుతాడు. కోమలి మళ్లీ ఇరుక్కుందని విజయాంబిక అంటుంది. మీరు నాన్నలా చూశారు అంటే నాకు ఆయన విలువైన మనిషే నేను వెళ్లి చూసొస్తా ఏ హాస్పిటల్ అని అంటాడు. కంగారులో చూసుకోలేదు తర్వాత వెళ్లేటప్పుడు ఇద్దరం వెళ్దాం అని తప్పించుకొని వెళ్లిపోతుంది కోమలి.
సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరకు వెళ్లి రూపని కొట్టి తప్పు చేశావ్.. ఇప్పటికైనా రూపని అర్థం చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. ఈ విజయాంబిక వల్లే మన ప్లాన్‌లు పోతున్నాయి.. అత్తయ్య తిక్క కుదిరేలా చేయాలి అని రూప అంటుంది. కోమలి విజయాంబిక వాళ్లతో నా వల్ల కాదు నేను ఇక్కడ ఉండలేను రాజు నన్ను వదలడం లేదు అంటుంది. రాజుకి తాయొత్తు కట్టావ్ కదా మరి నీ వెంటే ఉంటాడు అని విజయాంబిక అంటుంది. నీకు ఏం ప్రాబ్లమ్ వచ్చినా మమల్ని దాటుకొని వెళ్లాలి అని అంటుంది. విరూపాక్షిని తన పెళ్లికి పిలిచారు తను వస్తే అయిపోతుందని కోమలి అంటే పెళ్లి ముందే ఇక్కడ పని పూర్తి చేసి తాయొత్తుకి విరుగుడు పెడదాం అని అంటుంది.
ముగ్గురు మాట్లాడుకుంటే రాజు అక్కడికి వస్తాడు. అమ్మాయిగారు రక్తం ఇచ్చి నీరసంగా ఉంటే మీరు ఇబ్బంది పెడతారా బయటకు వెళ్లండి అని పంపేస్తాడు. కోమలికి జ్యూస్ ఇస్తాడు. వాళ్లతో మీరు మాట్లాడటం ఏంటి పెద్దయ్య గారు చూస్తే కోప్పడతారు అని అంటాడు. విజయాంబిక దీపక్‌తో కోమలికి ధైర్యం చెప్పేశా కానీ నాకు భయం వేస్తుంది అని అంటుంది. కోమలి ఇంటి నుంచి వెళ్లకముందు ఆస్తి మొత్తం దక్కించుకోవాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















