Ammayi garu Serial Today October 20th: అమ్మాయిగారు సీరియల్: రాజుపై కోమలి వశీకరణ ప్రయోగం! రాజు కోమలి కొంగు పట్టుకొని తిరుగుతాడా!
Ammayi garu Serial Today Episode October 20th కోమలి వశీకరణ చేసిన తాయెత్తుని రాజుకి కట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి బాధ పడుతుంటే రూప, రాజు వెళ్లి మాట్లాడుతారు. చీర నీ కోసం తీసుకురాకపోయినా ఇంకెవరికీ ఇవ్వకుండా నీకే ఇచ్చారు అంటే నాన్నకి నీ మీద ప్రేమ ఉండటం వల్లే కదా.. పైగా చీర కట్టుకొని నువ్వు నాన్న దగ్గరకు వెళ్తే కోప్పడకుండా ఉన్నారు అంటే నీ మీద ప్రేమే కదా అని అంటుంది రూప.
విరూపాక్షి సంతోషంగా అవును ఇది వరకులా సూర్య నా మీద అరవడం లేదు అని అంటుంది. మార్పు మొదలైంది అని రాజు అంటాడు. విరూపాక్షి హ్యాపీగా ఫీలవుతుంది. రూప మనసులో నీతో అబద్ధం చెప్పినా అది నిజమే అవుతుందని అనుకుంటుంది. కోమలి సీక్రెట్‌గా గదిలోకి వెళ్లడం దీపక్ చూసి తల్లితో మనకు చెప్పకుండా మనం చెప్పినా వినకుండా బయటకు వెళ్తుందని అంటాడు. కోమలిని కంట్రోల్‌లో పెట్టాలి అని విజయాంబిక, దీపక్ వెళ్తారు. కోమలి దగ్గరకు వెళ్లి అశోక్‌ని కలవడానికి వెళ్లావా అని అడుగుతారు. దానికి కోమలి ఉదయం చెప్పిన పని కోసం వెళ్లా అని తాయొత్తు చూపిస్తుంది.
తాయొత్తు వశీకరణ తాయొత్తు అని అది ఎవరికి కడితే వాళ్లు వశీకరణకు గురవుతారని వెంట పడతారని చెప్తుంది.కోమలి ఓ మంత్రసాని దగ్గరకు వెళ్లి తన భర్త తనని పట్టించుకోవడం లేదని వేరే మహిళ మోజులు ఉన్నాడని చెప్తుంది. దాంతో ఆమె మంత్రించిన తాయొత్తు ఇచ్చి అది నీ భర్తకి కడితే నీ వశం అయిపోతాడని నీ వెంటే పడతాడు అని అతనికి తెలీకుండా కడితే నీ వశం అయిపోతాడు అని అంటుంది. కోమలి ఆ విషయం విజయాంబికతో చెప్పి రాజుని మన వశం చేసుకుంటే మనం రాఘవని లేపేయాలి.. తర్వాత విరూపాక్షి, రూపల్ని బయటకు గెంటేయాలి అని అనుకుంటారు.
దీపక్ మనసులో ఆ తాయొత్తు అంత పవర్ ఫుల్ అయితే కోమలికి కట్టి కోమలిని నా వశం చేసుకోవాలని అనుకుంటాడు. దీపక్ రాజు వాళ్లని చూసి రాజు నిద్రలో ఉండటంతో కోమలికి వెళ్లి తాయొత్తు కట్టమని అంటాడు. కోమలి రాజు, రూపల గదిలోకి వెళ్తుంది. రాజు చేతికి తాయొత్తు కట్టేలోపు రాజు లేచి కూర్చొంటాడు. కోమలి బిత్తరపోతుంది. పక్కనే దాక్కుంటుంది. దాంతో రాజు నిద్రలోనే కోమలి చేతిని తొక్కి బయటకు వెళ్తాడు. కోమలి చేయి నలిగిపోతుంది. అరవలేక నోరు మూసుకుంటుంది. మళ్లీ రాజు నిద్రపోగానే రాజు చేతికి తాయొత్తు కట్టడానికి వెళ్తుంది. రాజు నిద్రలో కోమలి చేయిని పట్టుకొని లాగేస్తాడు. కోమలి అలా ఉండిపోతుంది.
కోమలి ఇంకా రాలేదు ఏంటా అని దీపక్ వాళ్లు చూసి కోమలిని రాజు పట్టుకోవడం చూసి దీపక్ రాజు చేయి నుంచి కోమలిని విడిపిస్తాడు. నిద్రలో ఉన్న రాజు దీపక్‌ని ఒక్కటి తంటాడు దాంతో దీపక్ బయట పడతాడు. మొత్తానికి కోమలి రాజుకి తాయొత్తు కట్టేస్తుంది. ఇక నుంచి రాజు నా చుట్టూ తిరుగుతాడని కోమలి అంటుంది. ఉదయం కోమలి దేవుడుకి దండం పెట్టుకొని ఈ ఇంట్లో ఉండలేను అని వీలైనంత త్వరగా పని ముగించుకొని వెళ్లిపోయి అశోక్‌ని పెళ్లి చేసుకోవాలి అందుకు రాజు తన చేతిలో కీలుబొమ్మ అవ్వాలి అని మొక్కుకొని పూజ చేస్తుంది. రూప అది చూసి కోపంగా కోమలి దగ్గరకు వెళ్లి కాపురం కూల్చడానికి వచ్చి ఏం పూజలు చేస్తున్నావ్ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















