Ammayi garu Serial Today October 15th: అమ్మాయిగారు సీరియల్: దారుణం.. రాఘవ గుండెల మీద కొట్టేసిన విజయాంబిక! రూప కళ్లెదుటే ఘోరం!
Ammayi garu Serial Today Episode October 15th రూప ముందే విజయాంబిక రాఘవ గుండెల మీద కొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ కోలుకోవడంతో రూప, రాజులు హాస్పిటల్‌కి వెళ్లి సూర్యప్రతాప్‌ని కూడా రమ్మని చెప్తారు. రాజు సూర్యప్రతాప్‌ని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్తాడు. రూప ఒక్కర్తే రాఘవ దగ్గర ఉంటుంది. విజయాంబిక, దీపక్‌లు బయట సెక్యూరిటీతో రాఘవ లేచాడు మా తమ్ముడు వచ్చి మిమల్ని మెచ్చుకుంటారు. అంత వరకు మీరు టీ తాగి రండి అని పంపేస్తుంది.
విజయాంబిక, దీపక్‌లు రాఘవ దగ్గరకు వెళ్తారు. రూప విజయాంబిక, దీపక్‌ని చూసి షాక్ అవుతుంది. రాఘవ కూడా భయపడతాడు. విజయాంబిక రాఘవతో నేను ఏంటో తెలిసి కూడా నా గురించి చెప్పాలి అనుకున్నావ్ అంటే నీకు ఎన్ని గుండెలురా నీ గుండె కొట్టుకోకూడదు అని అంటుంది. దీపక్ తలుపు వేస్తాడు. రూప విజయాంబిక దగ్గరకు వచ్చి బయటకు వెళ్లమని అంటుంది. సెక్యూరిటీని రాజుని పిలుస్తుంది. దీపక్ రూపని పట్టుకుంటే విజయాంబిక దీపక్ దగ్గరకు వెళ్లి నేను దయ తలిస్తే బతికిన వాడిని నా మీదే ఎదురు తిరుగుతావా అంటుంది. రాఘవ విజయాంబిక ఈ రోజు ఏది ఏమైనా నీ గురించి పెద్దయ్యగారికి చెప్తా విజయాంబిక అని అంటాడు. నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని విజయాంబిక రాఘవని కొడుతుంది.
మరోవైపు సూర్యప్రతాప్, చంద్ర ప్రతాప్ హాస్పిటల్‌కి వస్తుంటారు. రూప విజయాంబిక మీద అరవడంతో విజయాంబిక రూప గొంతు పట్టుకొని నలిపేస్తుంది. తర్వాత రాఘవ దగ్గరకు వచ్చి రాఘవని చూసి కోపంగా నువ్వు బతకకూడదురా అని పిడికిలి బిగించి రాఘవ గుండె మీద గట్టిగా గుద్దేస్తుంది. రాఘవ ఊపిరి అందక అలా ఉండిపోతాడు. అప్పుడే రాజు, సూర్యప్రతాప్ వాళ్లు వస్తారు. విజయాంబిక ఏం తెలీనట్లు రాఘవ రాఘవ అని పిలుస్తుంది. రాజు వచ్చి విజయాంబికను పక్కకు నెట్టి రాఘవని లేపాలని చూస్తాడు. రాఘవ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతాడు. రాజు రూపని పిలిచినా రూప అలా ఉండిపోతుంది. ఏం మాట్లాడదు.. రుక్మిణి అని గట్టిగా రాజు అరుస్తాడు.
రాజు రూపతో ఇప్పటి వరకు మాట్లాడిన రాఘవ ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే అత్త రాఘవ గుండెల మీద కొట్టిందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నేను రాఘవని ఎందుకు కొడతాను అని కవర్ చేయాలని చూస్తుంది. అత్త చెప్తుంది అబద్ధం అని అత్త రాఘవని కొట్టింది అని రూప చెప్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి చూసి రాఘవ మళ్లీ కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తాడు. ఇదంతా అత్త వల్లే దీనికి కారణం వీళ్లిద్దరే నన్ను నమ్ము నాన్న అని రూప ఏడుస్తుంది. ఎందుకు అక్క రాఘవ ఎదురైన ప్రతీ సారి అడ్డు పడాలి అని చూస్తున్నావ్.. రాఘవ చెప్పే నిజానికి నీకు సంబంధం ఏంటి అని చంద్ర అడుగుతాడు. నాకేం సంబంధం లేదు అని విజయాంబిక అంటే మరి ఎందుకు నువ్వు హాస్పిటల్‌కి వచ్చావ్ అని సూర్యప్రతాప్ అడుగుతారు. రాఘవ స్ఫ్రుహాలోకి వచ్చాడని నీకు ఎవరు చెప్పారు.. చూడు రాఘవకి నీకు ఎలాంటి సంబంధం లేదు ఇంకోసారి నువ్వు ఈ హాస్పిటల్‌లో కనిపించడానికి వీల్లేదు బయటకు పొండి అని సూర్యప్రతాప్ పంపేస్తాడు.
సూర్యప్రతాప్ వాళ్లు కూడా వెళ్లిపోతారు. విజయాంబిక చేసిన దానికి రూప ఏడుస్తుంది. మిమల్ని ఒంటరిగా వదిలేసి తప్పు చేశానని రాజు అంటాడు. అత్తయ్యని దీపక్‌ని అంత ఈజీగా వదలను రాజు ఎందుకురా రూపతో పెట్టుకున్నానా అన్నట్లు చేస్తానని అంటుంది. విరూపాక్షి కొంత మందిని తీసుకొని ఓ కంపెనీకి తీసుకెళ్లి వాళ్లు నెల నెలా మీ కంపెనీలో జమ చేస్తున్నారు వాళ్లు ఆటోలు కొనుక్కోవాలని అనుకుంటున్నారు.. ఆటోలు కొనుక్కునేందుకు డబ్బు సాయం చేయమని చెప్తుంది. తర్వాత వాళ్లు జమచేస్తారు అని సీఎం ఫండ్ కూడా వచ్చేలా చేస్తానని అంటుంది. ఆయన ఒకే అని అంటారు. దీపక్ కోమలితో జరిగింది చెప్తాడు. దీపక్, కోమలి, విజయాంబిక మీటింగ్ పెడతారు. మీ మామయ్య రాకముందే మనం వెళ్లాం కాబట్టి తప్పించుకున్నాం.. లేదంటే మన పరిస్థితి ఏంటా అని విజయాంబిక అంటుంది. మీ మామయ్య విరూపాక్షికి దగ్గరవుతున్న విధానం చూస్తుంటే విరూపాక్షి తప్పు చేసిందని నమ్మడం లేదు.. ఇక రూప ముందే రాఘవని కొట్టాం కాబట్టి రూప కూడా మనల్ని వదలను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















