Ammayi garu Serial Today October 10th: అమ్మాయిగారు సీరియల్: కోమలి, అశోక్ తప్పించుకున్నారా! రాజు, రూపలకు ఎదురుదెబ్బ!
Ammayi garu Serial Today Episode October 10th కోమలి, అశోక్‌ల నిశ్చితార్థం సూర్యప్రతాప్ చూడకుండా విజయాంబిక అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలి, అశోక్‌లకు నిశ్చితార్థం అవుతున్న దగ్గరకు రాజు, రూపలు వెళ్లి చూసి సూర్యప్రతాక్‌కి కోమలిని దగ్గరుండి పట్టించాలి అనుకుంటారు. ఓ జంటకి పెళ్లి అని చెప్పి సూర్యప్రతాప్‌ని గుడికి తీసుకొస్తారు. విజయాంబిక, దీపక్‌లు కోమలిని తప్పించాలని పరుగున వస్తారు.
కోమలి, అశోక్‌ల నిశ్చితార్థం పూర్తయిపోతుంది. రాజు, రూపలు సూర్యప్రతాప్‌ని తీసుకొచ్చే సరికి అక్కడ కోమలి, అశోక్‌లు నిశ్చితార్థం కాకుండా రెండు జంట పెళ్లి జరుగుతుంటుంది. కోమలి గెటప్ మార్చేసి అక్కడే ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ రూప అని సూర్యప్రతాప్ అడిగితే మీరు బిజిగా ఉన్నారు కాబట్టి నేను వచ్చాను.. మీ పేరు మీద అందరికీ పసుపు కుంకుమ తాళిబొట్టు ఇచ్చానని చెప్తుంది. కోమలి సూర్యప్రతాప్ దగ్గర మార్కులు కొట్టేస్తుంది. నేను లేకపోయినా నువ్వు లోటు తీర్చుతావని అర్థమైందని సూర్యప్రతాప్ అంటాడు. రాజు, రూపలు షాక్ అయిపోతారు. ఇక సూర్యప్రతాప్ రెండు జంటల్ని ఆశీర్వదిస్తాడు.
రూప మనసులో ఇంత సెడన్ ఎలా తప్పించుకున్నారు అని అనుకుంటుంది. రాజు కూడా మనసులో పెద్దయ్యగారు వస్తున్నారని కోమలికి ముందే ఎలా తెలిసిందని అనుకుంటాడు. కోమలి నటన వెనక ఏదో జరిగిందని అనుకుంటాడు. అశోక్ తన తల్లిదండ్రుల్ని హడావుడిగా గుడి నుంచి తీసుకెళ్లిపోతాడు. విరూపాక్షి అక్కడికి వస్తుంది. విరూపాక్షి గుర్తు పట్టేస్తుందని అశోక్ తల్లిదండ్రుల్ని పంపేసి కోమలిని తీసుకొస్తా అని చెప్తాడు. రాజు, రూపలు అశోక్ వాళ్ల కోసం వెతుకుతారు. విరూపాక్షి రావడంతో రాజు, రూపలు కోమలి వాళ్లు తప్పించుకున్నారని చెప్తారు. ఇక సూర్యప్రతాప్ విరూపాక్షి కూడా అక్కడే ఉండటంతో కోపంగా చూస్తాడు. సూర్యప్రతాప్ చూపునకు ముగ్గురు భయపడతారు.
సూర్యప్రతాప్ దగ్గరకు వచ్చి అసలేం జరుగుతుంది ఇక్కడ నాకు సామూహిక వివాహాలు అని చెప్పి వచ్చారు..ఇక్కడ కోమలి, అశోక్ అంటున్నారు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడుగుతాడు. కోమలి కూడా తెలివిగా ఎవరు ఆ కోమలి, అశోక్ అని అంటుంది. కోమలి నా ఫ్రెండ్ అని రూప కవర్ చేస్తుంది. ఇక విజయాంబిక, దీపక్‌లు రాజు రూపల దగ్గరకు వచ్చి ఇదంతా మా పనే అని అంటారు. ఇప్పుడు తప్పించుకున్నారు కానీ ఈ సారి మిమల్ని ఎవరు కాపాడుతారో అదీ చూస్తా అని రూప అంటుంది. పంతులు సూర్యప్రతాప్, విరూపాక్షిలను పిలిచి జంటల్ని దీవించమని చెప్పడంతో ఇద్దరూ లోపలికి వెళ్లి కొత్త జంటల్ని ఆశీర్వదిస్తారు.
విజయాంబిక ఆలోచిస్తూ ఉంటే దీపక్ ఏమైందని అడుగుతాడు. మనం గెలిచిన చోటే వాళ్లు గెలవడానికి ఓ అవకాశం వదిలేశాంరా.. ఇప్పటి వరకు రాజు, రూపలకు అశోక్ అమ్మానాన్నలు ఎవరో తెలిసిపోయింది.. మన ప్లాన్ అశోక్ తల్లిదండ్రులకు తెలిసి పోయింది కాబట్టి వాళ్లు మనల్ని దెబ్బ తీసే లోపు మనం వాళ్లని దెబ్బ కొట్టాలి అని అంటుంది. ఇంతలో కోమలి వచ్చి చాలా థ్యాంక్స్ చెప్తుంది. నాకు అశోక్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ లేరు వాళ్లని దూరం చేసుకోలేను మీరు చేసిన దానికి థ్యాంక్స్ అంటుంది. దీపక్ తల్లితో ఇది మనల్ని ప్రాబ్లమ్స్‌లోకి నెట్టేసేలా ఉంది అని అంటాడు. దాని సంగతివదిలేయ్ ముందు విరూపాక్షిని దెబ్బకొట్టాలి అని విజయాంబిక కొడుకుతో ప్లాన్ చెప్తుంది. రాజు, రూపలు బాధ పడుతుంటే విరూపాక్షి వస్తుంది. ఏదో చేస్తున్నా ఆపుకోండి అని విజయాంబిక అందని భయంగా ఉందని రూప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















