Ammayi garu Serial Today May 6th: అమ్మాయి గారు సీరియల్: బంటీ తన మనవడని తెలిసి మురిసిపోయిన సూర్య.. కొలనులో దిగిన రూపని చంపేస్తారా!
Ammayi garu Today Episode బంటీని రూప, రాజులు తమ బిడ్డ అని సూర్యప్రతాప్‌కి పరిచయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు రౌడీలను చితక్కొట్టి బంటీని కాపాడుతాడు. చండీయాగానికి టైం అయిపోవడంతో సూర్యప్రతాప్ రాజుకి కాల్ చేస్తుంటాడు. రాజు కాల్ లిఫ్ట్ చేయడు. ఇక రూప విరూపాక్షికి కాల్ చేస్తుంది. విరూపాక్షి ఫోన్ కలవదు. చంద్ర కూడా కాల్ చేస్తాడు అయినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక పంతులు శుభ గడియలు ప్రారంభం అయ్యావని ఈ టైంలో యాగం ప్రారంభించాలని లేదంటే మళ్లీ ఏడాది కోసం వెయిట్ చేయాలని అంటారు.
సూర్యప్రతాప్: అమ్మా రూప నీకు మంచి జరగడం మీ అమ్మకి ఇష్టం లేదు. నేను మనస్శాంతిగా ఉండటం అస్సలు ఇష్టం లేదు అందుకే నమ్మించి మోసం చేసింది.
రూప: అలా ఏం కాదు నాన్న ఏదో జరిగుంటుంది. అమ్మకి నేను అంటే ప్రాణం నాన్న.
సూర్యప్రతాప్: ఈ రోజు పూజ ఎంత ముఖ్యమో మీ అమ్మకి తెలుసు. అయినా రాజుని పిలిచింది. ఇద్దరూ ఇప్పుడు ఫోన్ తీయడం లేదు. పంతులు గారు నాకు భార్య లేదు అనుకొని పూజ ప్రారంభించండి. రూపకి అమ్మానాన్న అన్నీ నేనే అనుకొని పూజ చేయించండి.
పంతులు: క్షమించండి అయ్యా మీకు భార్య లేకపోతే అలా చేయొచ్చు కానీ ఉన్నా లేదు అనుకొని చేయడం తప్పు.
విజయాంబిక: తమ్ముడు విరూపాక్షికి నువ్వు కాల్ చేయలేదని ఇలా చేస్తుందేమో రూప కోసమే కదా నువ్వు చేయ్ తమ్ముడు.
సూర్యప్రతాప్: అమ్మ రూప నీ కోసం నేను చాలా తగ్గాను ఇక ఆ విరూపాక్షి ఆటలు సాగవు.
బంటీ: అమ్మా.. అమ్మా..
రూప బంటీ అని వెళ్లి ముద్దాడుతుంది. సూర్యప్రతాప్‌కి బంటీని గతంలో పరిచయం చేయడం గుర్తొస్తుంది. ఎలా ఉన్నావ్ బంటీ అని రూప అడుగుతుంది. దానికి బంటీ నువ్వు నాన్న దూరంగా ఉన్నారు కదా అమ్మ అందుకే కొంచెం బాలేను అంటాడు. సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. తర్వాత బంటీ సూర్యప్రతాప్‌ని ఫ్రెండూ అని పలకరిస్తాడు. రూప తండ్రితో మా బిడ్డ చనిపోయాడని చెప్పారు కదా నాన్న కానీ చనిపోలేదు. పురిటిలో చనిపోయినట్లు చెప్పించారు. ఆ రోజు నాతో పాటు మీరు నా కొడుకు చనిపోయినట్లు నమ్మిన అబద్ధమే నాన్న ఈ బంటీ. నా కొడుకు నాన్న అని ఎమోషనల్ అవుతుంది. సూర్యప్రతాప్, చంద్ర, సుమ అందరూ షాక్ అయిపోతారు.
రాజు కూడా బంటీ మీ మనవడు పెద్దయ్య అని చెప్తాడు. సూర్యప్రతాప్ బంటీని దగ్గరకు తీసుకొని ఏడుస్తాడు. బంటీని పట్టుకొని హగ్ చేసుకొని ముద్దాడుతాడు. బంటీ ఏడ్వొద్దు ఫ్రెండూ అంటే నీ ఫ్రెండ్‌ని కాదురా మీ తాతయ్యని అంటాడు. అందరూ చాలా సంతోషిస్తారు. సూర్యప్రతాప్ కోపంగా దీపక్, విజయాంబికల్ని చూసి ఆ రోజు మీరు హాస్పిటల్‌లో చెప్పింది అని అంటే డాక్టర్ అబద్ధం చెప్పింది ఆ డాక్టర్‌ని ఊరికే వదలకూడదు అని ఏడుపు నటిస్తుంది. అందరూ సంతోషంగా ఉండటంతో పంతులు పూజ ప్రారంభిస్తాడు. సూర్యప్రతాప్ మనవడిని ఒడిలో పెట్టుకుంటాడు. అందరూ కలిసి పూజలో కూర్చొంటారు. రూప చాలా సంతోషిస్తుంది.
పూజ పూర్తయిపోతుంది. రూపని పంతులు నీటిలోకి వెళ్లి మూడుసార్లు మునిగి పసుపు కుంకుమలు కలపాలి అంటారు. కోనేటికి అందరూ వెళ్లిపోతారు. విజయాంబిక, దీపక్‌లు చాలా కంగారు పడతారు. దాంతో దీపక్ తల్లితో నీటిలో మునిగిన రూప పైకి తేలదు పైకి వచ్చినా రూప శవమే వస్తుందని అంటాడు. నీటిలో తన మనుషులు రూపని చంపడానికి రెడీగా ఉన్నారని అంటాడు. ఇక రూప నీటిలోకి వెళ్తుంది. కుటుంబం మొత్తం కలిసి ఉండాలని రూప కోరుకొని నీటిలో మునుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















