Ammayi garu Serial Today August 8th: అమ్మాయి గారు సీరియల్: ఎదురుగా రూప ఉన్నా కోమలినే రూప అనిపించేలా చేష్టలు.. ఇది సాధ్యమేనా!
Ammayi garu Serial Today Episode August 8th కోమలి సూర్యప్రతాప్‌కి దగ్గర అవుతూ అసలైన రూపని దూరం చేయడానికి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episodeరూప కోమలిని తీసుకెళ్లి నీ బండారం బయట పెడతానని అంటే ఏం చెప్తావ్ నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని కోమలి రూపని ప్రశ్నిస్తుంది. రూప షాక్ అయిపోతుంది. సూర్యప్రతాప్ దృష్టిలో నువ్వు రుక్మిణివి ఏం చెప్తావ్ పద చెప్పదువు అని అంటుంది. నేను రూప కాదు అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని అంటుంది.
సూర్యప్రతాప్ దృష్టిలో రూప ముఖం అంటే నేను గుర్తొస్తా నువ్వు కాదు అని అంటుంది. ఆయన కూతుర్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేస్తారో నా కంటే నీకే బాగా తెలుసు అని అంటుంది. రాజు నువ్వు చెప్తావా చెప్పు అని అంటుంది. రూప, రాజు ఇద్దరూ డల్ అయిపోతారు. రూప వెళ్లిపోతుంటే ఏయ్ అని కోమలి పిలుస్తుంది. ఇంత వరకు నువ్వు డ్రామాలు ఆడావ్.. అసలు డ్రామా అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా.. సవతి పోరు ఎలా ఉంటుందో నేను చూపిస్తా చూస్తూ ఉండు.. ఈ రోజు నుంచి మీ నాన్నకి నిన్ను ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు అంటుంది. రూప కోమలి మాటలకు భయపడుతుంది.
విజయాంబిక రూపతో భయం వేస్తుందా ఇన్నాళ్లు నువ్వు నాతో ఆడుకున్నావ్ కదా ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా నా ఆట ఎలా ఉందో నీకు చూపిస్తా అని అంటుంది. రూప బాధగా వెళ్లిపోతుంది. కోమలి సూర్యప్రతాప్ దగ్గరకు వచ్చి నాన్న మీకు ఇష్టమైన అటుకుల పాయసం తీసుకొచ్చా అని అంటుంది. స్పెషల్ ఏంటి అమ్మా అని సూర్యప్రతాప్ అడిగితే మీరు నాకు ఎప్పడూ స్పెషలే నాన్న మీరు నన్ను నమ్ముతారో లేదో అనుకున్నా కానీ మీరు నన్ను అక్కన చేరుకున్నారు మీరు నన్ను దగ్గరకు తీసుకోవడం కంటే పండగ ఏముంటుంది అందుకే అటుకుల పాయసం తీసుకొచ్చా అని అంటుంది.
రూప రాజుతో నాన్నని పూర్తిగా తన వైపునకు తిప్పుకుంటుంది నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది. ఏం కాదని రాజు అంటాడు. కోమలి చంద్ర, సూర్యలకు పాయసం ఇస్తుంది. మీరు ఏమనకోకపోతే మీకు నేను తినిపించొచ్చా అని అడుగుతుంది. సూర్యప్రతాప్ ఎమోషనల్‌గా మాట్లాడి నువ్వు తిరిగి వచ్చావ్ అది చాలమ్మా మాకు ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండమ్మా తినిపించు అని అంటాడు. కోమలి రూపని చూసి కళ్లెగరేస్తుంది.
సూర్యప్రతాప్ పాయసం తిని రూప చేసిన టేస్ట్ రాలేదని అనుకుంటాడు. కోమలి రూప అని అనుకొని బాగుంది అమ్మా కానీ నువ్వు చేసిన టేస్ట్ రాలేదమ్మా అని అంటాడు. తర్వాత సూర్యప్రతాప్ తినిపిస్తాడు. రాజు రూప చెవిలో గుసగుసలాడి తర్వాత కోమలి దగ్గరకు వెళ్లి సారీ అమ్మాయి గారు మీ రూపం చూసి మీరు మా అమ్మాయి గారు అంటే నాకు నమ్మకం రాలేదు మీకు అన్నీ గుర్తున్నాయి అని అంటాడు. నాకు అన్నీ గుర్తున్నాయి రాజు అని కోమలి అంటే అయితే మన మధ్య జరిగిన అన్నీ గుర్తుంటాయి కదా అంటాడు. దానికి విరూపాక్షి ప్రాణంగా ప్రేమించిన నీ గురించి ఎలా మర్చిపోతుంది అని అంటుంది. నేనేం మర్చిపోలేదు అని కోమలి అంటుంది. దాంతో రాజు గతేడాది ఈ రోజు మనకు చాలా ముఖ్యమైన రోజు కదా అమ్మాయి గారు అదేంటో చెప్పండి అంటాడు. కోమలి నీళ్లు నములుతుంది. సూర్యప్రతాప్ కూడా చెప్పమని అంటే నా రాజు ఎందుకు ఇంకా నన్ను నమ్మడం లేదని బాధ పడుతున్నాను నాన్న రాజు నా మీద అనుమానంతో అడిగాడు కాబట్టి చెప్పడానికి మాట రావడం లేదని అంటుంది. రాజు అనుమానంతో అడగడు అమ్మా నువ్వు చెప్పు అని సూర్యప్రతాప్ అంటాడు. పోయిన సంవత్సరం ఇదే రోజు మనిద్దరం విడిపోయిన తర్వాత మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఒకర్ని ఒకరం కలుసుకున్న రోజు అని చెప్తుంది. రాజు, రూప, విరూపాక్షి బిత్తరపోతారు. నిన్నే కాదు పురిట్లో చనిపోయాడు అనుకున్న నా బిడ్డని కలిసిన రోజు అని చెప్తుంది. రాజు వాళ్లు బిత్తరపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















