Ammayi garu Serial Today August 1st: అమ్మాయి గారు సీరియల్: రూప స్థానం కోసం కోమలి పోరాటం! సవతి పోరుకి రెడీ అయిపో అంటూ రూపకి వార్నింగ్!
Ammayi garu Serial Today Episode August 1st రూపగా ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి విజయాంబిక సెట్ చేసిన కోమలి అని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆకస్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ ఇంటికి వచ్చిన అమ్మాయి తానే రూప అని అందరూ నమ్మేలా నటిస్తుంది. సూర్యప్రతాప్ కూడా నమేస్తాడు. సుమతో అమ్మాయికి గది చూపించు అంటాడు. దాంతో ఆ అమ్మాయి నా ఇంట్లో నాకు గది చూపించడం ఏంటి నాన్న నా గదిలో నేను ఉంటాను అని రూప గదిలోకి వెళ్తుంది.
రూపనంటూ వచ్చిన ఆ అమ్మయి మేడ మీదకు వెళ్లడం చూసి అందరూ షాక్ అయిపోతారు. నిజంగా రూపేనేమో అని అనుకుంటారు. సూర్యప్రతాప్ రుక్మిణిలా ఉన్న అసలైన రూపని రాజుకి దూరం ఉండమని చెప్పి తొలిరేయి ఆపేస్తాడు. ఇక బంటీని తీసుకొని వెళ్లిపోతాడు. రూప, రాజు, విరూపాక్షి బిత్తర పోతారు. విజయాంబిక రుక్మిణి దగ్గరకు వెళ్లి ఇన్నాళ్లు నువ్వే రూప అనుకున్నా కాదా అని అంటుంది. ఇప్పటికైనా మీ నాన్నకి నువ్వే రూప అని చెప్పేయ్ లేదంటే మాతో పాటు అందరూ తనే రూప అని నమ్మేస్తారు అని వెళ్లిపోతుంది.
మందారం రూప దగ్గరకు వెళ్లి ఎవరమ్మాయి గారు ఈ అమ్మాయి ముఖం తప్ప మాటలు, చేష్టలు అన్నీ మీలా చేస్తుంది అని అంటుంది. అదే నాకు తెలీదు మందారం అని రూప అంటుంది. విరూపాక్షి ఆ అమ్మాయి మాటలు గుర్తు చేసుకొని అది ఎవరు ఎందుకు వచ్చింది ఎక్కడినుంచి వచ్చిందో ఇప్పుడే తేల్చుతా అని విరూపాక్షి ఆవేశంగా వెళ్తుంది. రాజు వాళ్లు విరూపాక్షి వెనకాలే వెళ్తారు.
విరూపాక్షి గదిలోకి ఎవరే నువ్వు అని అంటే నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటుంది. విరూపాక్షి లాగిపెట్టి కొడుతుంది. నేను నీ కూతురినమ్మా అని అంటుంది. ఇంకోసారి అలా అంటే చంపేస్తా అంటుంది. నేను నీ కూతురినే అని ఆ అమ్మాయి అంటే నేను ఎవరిని అని రూప అంటుంది. నువ్వు నా చెల్లి రుక్మిణివి అంటుంది. రాజుని రైస్ పీస్ అంటే రాజు కోపంగా ఏయ్ రైస్ పీస్ అన్నావంటే పీస్ పీస్ అయిపోతావ్ అంటాడు. పీస్ పీస్ చేద్దువులే కానీ నేను ఎవరో నాన్న తేల్చుతా అన్నారుకదా అప్పటి వరకు ఓపిక పట్టండి అంటుంది. కన్న తల్లే నన్ను నమ్మనప్పుడు భర్తవి ఎలా నమ్ముతావు అంటుంది. దాంతో విరూపాక్షి లాగిపెట్టి నీతో ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారో చెప్పు అని అంటుంది. నువ్వు రూప కాదు రుక్మిణిలా ఉన్న ఇదే రూప నా కన్నకూతురు రాజు భార్య. రుక్మిణి ఎప్పుడో చనిపోయింది అని అంటుంది విరూపాక్షి. తను రూప అయితే రుక్మిణి అని ఎందుకు చెప్తున్నారు అని అయితే మీరంతా ఏదో తప్పు చేస్తున్నారు అని ఆ అమ్మాయి అంటుంది. నీకు ఏం కావాలో చెప్పు మేం ఇస్తాం అని రాజు అంటాడు.
రాజు మాటలకు రూపలా నటిస్తున్నా ఆ అమ్మాయి నువ్వేంటి నాకు ఇచ్చేది ఈ యావత్ ఆస్తి నా సొంతం కాబోతుంది. రూప చనిపోయింది అని మీరు ఆడుతున్న నాటకానికి తిరిగి నేను ప్రాణం పోశాను అని తను రూప కాదని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు రూపవి కాలేవు అని రూప అంటే నువ్వు రూప అని మీ నాన్నతో చెప్పగలవావ ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది. కన్నతల్లి కంటే ఆధారాలు ఉంటాయా అని విరూపాక్షి అంటుంది. ఏయ్ ఏం కావాలి నీకు అని విరూపాక్షి అడిగితే రూప స్థానం కావాలి అని ఆ అమ్మాయి చెప్తుంది. రాజు దగ్గర భార్య స్థానం. నాన్న ఆస్తిలో వాటా కావాలి ఇస్తావా అని అడుగుతుంది.
రూప ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్తే చేయి అడ్డుకుంటుంది. నువ్వు కొట్టలేవు రేపటి నుంచి చూపిస్తా అసలైన సవతి పోరు ఎలా ఉంటుందో అని.. ఇప్పటికి పడుకో ఒకే గదిలో కాదు వేరు వేరు గదుల్లో అంటుంది. దీప్తి లానే ఇది కూడా వచ్చింది మనం ఆడుతున్న నాటకానికి ముగింపు పలకకపోతే మనం ఎన్ని దారుణాలు చూడాలో సూర్యకి నిజం చెప్పేద్దాం అని అంటుంది. రూప వద్దని అడ్డుకుంటుంది. తనేం చేస్తుందో చేయని రెండు రోజుల్లో ఆ అమ్మాయి సంగతి తేల్చుతా అని రాజు వెళ్లిపోతాడు.
విజయాంబిక, దీపక్‌లు గదిలో ఉంటే ఆ అమ్మాయి వాళ్ల దగ్గరకు వెళ్తుంది. విజయాంబికతో అందరి ముందు కొట్టానని ఫీలయ్యారా అని అడుగుతుంది. దాంతో విజయాంబిక ఆ అమ్మాయి చెంప నిమిరి.. సూపర్ కోమలి.. నీ యాక్టింగ్ అదిరిపోయింది. చిన్ని పొరపాటు కూడా చేయకుండా అందర్ని నమ్మించావ్. నా తమ్ముడిని నమ్మించావ్ అది చాలు అంటుంది. రాజు, విరూపాక్షి, రూపల్ని నమ్మించడం కుదరదు కదా అని జరిగింది అంతా చెప్తుంది. వాళ్ల భయమే మన టార్గెట్ అని విజయాంబిక అంటుంది. నా గురించి తెలిస్తే ఏంటి అని కోమలి అడిగితే నీ విషయం కంటే ముందు ఆ రూప విషయం తెలిస్తే నీ వల్లే తెలిసిందని మంచి మార్కులు కొట్టేయొచ్చు అని అంటారు. ఇక రేపటి నుంచి రూపలా జీవించాలని మనం ఎవరో తెలియనట్లు ఉండాలని అంటారు.
ఉదయం కోమలి రూపలా పూజగదిలోకి వెళ్లి పూజ చేస్తుంది. సుమ, చంద్రలు చూసి రూపనే అని అనుకుంటారు. ఇంతలో రూప వచ్చి ఏయ్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా.. అని అడుగుతుంది. నేను పూజ చేస్తుంటే అరుస్తావేంటి రుక్మిణి అని అంటుంది. చంద్ర కూడా కోమలికే సపోర్ట్ చేస్తాడు. తను మన ఇంటి వారసురాలు కదా అని అంటాడు. ఇంతలో సూర్యప్రతాప్ వస్తాడు. రుక్మిణి కోమలి చేయి పట్టుకొని బయటకు లాగేస్తుంది. కోమలి సూర్యప్రతాప్ దగ్గరకువెళ్లి నాన్న నాన్న చూడు పూజ చేస్తుంటే రుక్మిణి అడ్డు పడుతుంది అని అంటుంది. ఏమైందమ్మా అని సూర్యప్రతాప్ అడిగితే రూప చనిపోయిందని మీరు చెప్పారు.. మరి ఇది వచ్చి రూప అని అంటే నేను ఎలా నమ్మలి.. ఊరు పేరు లేని ఇది పూజ చేస్తే ఎలా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















