అన్వేషించండి

Jagadhatri Serial Today August 1st: జగద్ధాత్రి సీరియల్: వజ్రపాటి పరువు తీసేసిన కేథార్, జగద్ధాత్రి! మీడియా ముందు కేథార్ ఏం చెప్తాడు.. అసలు నిజమేంటి?

Jagadhatri Serial Today Episode August 1st జగద్ధాత్రి, కేథార్‌లు వజ్రపాటి పెద్దకొడుకు, కోడలు అని ఫ్లెక్సీ మీద పేరులు రాయడంతో సుధాకర్, కౌషికిలు కోప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode సుధాకర్, వైజయంతిల పెళ్లి రోజు వేడుకలు ఆఫీస్‌లో జరుపుతారు. కేథార్, జగద్ధాత్రి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారని కాచి చెప్పడంతో కౌషికి గిఫ్ట్ ఇవ్వమని చెప్తుంది. 

కేథార్ గోల్డ్ చైన్ తీసుకొచ్చి నా కష్టార్జీతం నాన్న నా సంపాదనతో కొన్నాను.. మీ దగ్గర ఉన్నవాటి కంటే చాలా తక్కువది కానీ ప్రేమతో తీసుకొచ్చానని అంటాడు. సుధాకర్ ప్రేమని విలువ కట్టకూడదని చెప్పి తన మెడలో వేయమని కేథార్‌కి చెప్తాడు. కేథార్ చాలా సంబర పడిపోతాడు. ఇక జగద్ధాత్రి వైజయంతి కోసం పెద్ద నెక్లెస్ తీసుకొస్తుంది. నిషికి తీసుకోవద్దని చెప్తుంది. కానీ వైజయంతి నక్లెస్ నచ్చి తీసుకుంటుంది. కేథార్, జగద్ధాత్రిలు చాలా సంతోషపడతారు. 

నిషిక కోపంతో వెళ్లిపోతుంటే యువరాజ్ ఆపి వాళ్లని నాన్న, అక్కలకు శాశ్వతంగా దూరం చేస్తున్నా ఒక సారి బయట ఉన్న ఫ్లెక్సీ చూసి రా అంటాడు. నిషిక  వెళ్లి చూసి షాక్ అయిపోతుంది. సుధాకర్, వైజయంతిల పెద్ద ఫొటోలతో పెళ్లి రోజు శుభాకాంక్షలు జగద్ధాత్రి, కేథార్ చెప్పినట్లు వజ్రపాటి పెద్ద కొడుకు కేథార్, వజ్రపాటి పెద్ద కోడలు జగద్ధాత్రి అని రాసుంటుంది. నిషిక వెంటనే అందర్ని పిలుస్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. జగద్ధాత్రి కేథార్ ఏంటి ఇది అనుకుంటారు. ఇక కౌషికి జగద్ధాత్రి, కేథార్‌లను ఇలా చేస్తారని అనుకోలేదని అంటుంది. 

కేథార్ అక్కతో నిజంగా ఆ ఫ్లెక్సీ ఎలా వచ్చిందో నాకు తెలీదు అంటాడు. వైజయంతి కేథార్‌ని లాగి పెట్టి కొడుతుంది. జగద్ధాత్రి మాట్లాడబోతే నువ్వు మాట్లాడకు అని అరుస్తుంది. కేథార్‌తో పోనీలే అని ఇంట్లో ఉండనిచ్చినందుకు మా పరువు తీస్తారా అని అడుగుతుంది. నిషిక కూడా నలుగురిలో మా పరువు తీయాలనా ఇలా చేశారా అని అడుగుతుంది. నా మీద ఒట్టు మాకేం తెలీదు  అని జగద్ధాత్రి అంటుంది. నలుగురిలో పరువు పోయిందని కౌషికి అక్కడ చేరిన అందర్ని చూసి తల దించుకుంటుంది. 

కేథార్ అందరితో ఇది నా ఫ్యామిలీ నా కుటుంబం పరువు తీయాలని మేం చూడమని అంటాడు. ఇది నీ కుటుంబం కాదు.. సరిగ్గా విను ఇది నీ కుటుంబం ఎప్పటికీ అవ్వదు కూడా.. ఆదుకొని ఆదరించినందుకు నలుగురిలో మా పరువు తీస్తారా అని సుధాకర్ కోప్పడతాడు.  ఇక కౌషికి  అయితే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు జగద్ధాత్రి మా మంచితనాన్ని చేతకాని తనం అనుకున్నారా.. మీ మీద చూపించిన అభిమానానికి మీరు ఇచ్చిన బహుమతి ఇదా.. ఇన్నాళ్లు చేసిన మంచి ఈ ఒక్క తప్పుతో చెరిపేశారని అంటుంది. టైం చూసి భలే దెబ్బ కొట్టావురా ఇక్కడున్న వాళ్లు తీసిన ఫొటోలు వీడియోలు బయటకు వెళ్లిపోయింటాయి అని యువరాజ్ అంటాడు. 

జగద్ధాత్రి ఏడుస్తూ ఈ పని మేం చేయలేదు చెప్తుంది. అందరి ముందు ఇలా సమాధానం లేని ప్రశ్నలా నిలబెడతారు అనుకోలేదు అని కౌషికి అంటుంది. ఏం చేస్తే మీరు మమల్ని ఎలా నమ్ముతారు అని కేథార్ అడుగుతాడు. దాంతో యువరాజ్ ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఫ్లెక్సీకి మాకు ఏం సంబంధం లేదు.. నాకు వజ్రపాటి ఫ్యామిలీకి ఏం సంబంధం లేదని చెప్పమని అంటాడు. జగద్ధాత్రి వద్దని చెప్పినా కేథార్ చెప్తానని అంటాడు. జగద్ధాత్రి కేథార్‌తో ఇలా నువ్వు మీడియాతో చెప్తే ఇంకెప్పుడు నువ్వు మామయ్య కొడుకు అని నిరూపించుకోలేవు ప్రెస్ మీట్‌కి ఒప్పుకోవద్దని అంటుంది. నాన్న పరువు కాపాడాలన్నా అక్క నమ్మకం నిలబెట్టుకోవాలన్నా ఇదొక్కటే మార్గం ద్ధాత్రి.. ప్రేమ అంటే ఇవ్వడం అని నువ్వే చెప్పావు కదా ఇప్పుడు నేను ఇవ్వాల్సిన టైం అని కేథార్ చెప్తాడు. అందరి ముందు మీడియా ముందు చెప్తానని కేథార్ అంటాడు. 

జగద్ధాత్రి కౌషికితో మేం ఇది చేయలేదు అంటే ఇంకెవరో చేశారని అర్థం కదా ఒక్క గంట టైం ఇవ్వండి అని బతిమాలుతుంది. దాంతో కౌషికి ఒక్క గంట టైం అని అంటుంది. కేథార్‌తో జగద్ధాత్రి ఆ ఫ్లెక్సీ మీద ఉన్న అడ్రస్ చూసి వాళ్లే ప్రింట్ చేశారు నేను అక్కడికి వెళ్లి కనుక్కుంటా అని జగద్ధాత్రి వెళ్తుంది. ఆ అడ్రస్‌కి వెళ్లి అడిగితే నాకు లాభం ఏంటి అని జగద్ధాత్రి మీద చేయి వేయబోతే జగద్ధాత్రి వాడి చేయి విరిచేస్తుంది. వాడిని బెదిరించి విషయం అడుగుతుంది. అతను యువరాజ్ అడ్రస్ ఇవ్వడంతో యువరాజ్ నీ పనా అని అనుకుంటుంది. ఇక సీసీ టీవీ ఫుటేజ్ తీసుకుంటుంది. వాటిని తీసుకొని జగద్ధాత్రి బయల్దేరుతుంది. 

కేథార్ బాధపడుతుంటాడు. నిషిక మీడియా వచ్చింది రమ్మని చెప్తుంది. ఇంకా పది నిమిషాలు ఉన్నాయి కదా అని కేథార్ అంటే అందరూ వెళ్లమని చెప్తారు. నీకేం సాయం చేయలేనని కౌషికి అంటుంది. కేథార్ బాధగా మీడియా ముందుకు వెళ్తాడు. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో అని కౌషికి అంటే చేయని తప్పుని ఎలా సరిదిద్దు కోవాలో తెలీడం లేదని ద్ధాత్రి వచ్చేస్తుంది ఒక్క పదినిమిషాలు టైం ఇవ్వమని బతిమాలుతాడు. కుదరదు అని కౌషికి అంటుంది. మరోవైపు జగద్ధాత్రి పరుగులు పెడుతుంది. 

కేథార్ మీడియా ముందు కూర్చొంటాడు. కేథార్ మీడియా ముందుకు వెళ్లి నేను ఒక అనాథని నా భార్య జగద్ధాత్రి. వజ్రపాటి నిషిక వాళ్ల అక్క. అదే బంధంతో కొన్నాళ్లుగా వాళ్ల ఇంట్లో ఉన్నాం. అంతకు మించి ఆ కుటుంబానికి నాకు ఏం లేదు అని కేథార్ చెప్పే టైంకి జగద్ధాత్రి ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
Illu Illalu Pillalu Serial Today July 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంబరాన్ని అంటిన సంబరాలు..! రామరాజు ఇంట్లో సందడి మామూలుగా లేదుగా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంబరాన్ని అంటిన సంబరాలు..! రామరాజు ఇంట్లో సందడి మామూలుగా లేదుగా!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget