అన్వేషించండి

‘కోటబొమ్మాళి పీఎస్’ రివ్యూ, ‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ డైరెక్టర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?
'లింగిడి లింగిడి...' పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో 'కోట బొమ్మాళి పీఎస్'పై ప్రేక్షకుల చూపు పడింది. ఈ సినిమాలో శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' తర్వాత తేజా మార్ని దర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళ హిట్ ఫిల్మ్ 'నాయట్టు'కు రీమేక్ ఇది. అయితే... తెలుగుకు మార్పులు, చేర్పులు చేశారు. సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ - మ్యూజిక్ డైరెక్టర్ రివీల్
సినిమాకు ఉండే అన్ని క్రాఫ్ట్స్‌లో మ్యూజిక్ కూడా ఒక భాగమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కథ యావరేజ్‌గా ఉన్నా.. మ్యూజిక్, టేకింగ్ సూపర్‌గా ఉంటే.. మూవీ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు మేకర్స్. ముందు నుండి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌తోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు దర్శకులు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా అదే పనిచేస్తున్నాడు. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ గురించి బయటికొచ్చిన క్రేజీ అప్డేట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో రివీల్ చేసింది టీమ్. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కోసం మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు పూరీ. ఈ సినిమాకు ప్రీక్వెల్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆల్బమ్.. అప్పట్లో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. అదే విధంగా ‘డబుల్ ఇస్మార్ట్’ ఆల్బమ్ కూడా మ్యూజిక్ లవర్స్‌కు నచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మణిశర్మ. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్! సల్మాన్, షారుఖ్‌తో పాటు మరో స్టార్ హీరో!
హాలీవుడ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ అనే ఐడియాను ముందుగా ఇండియన్ సినిమాల్లోకి తీసుకొచ్చింది బాలీవుడ్. స్పై యూనివర్స్ అనేది ప్రారంభించి ఖాన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు తెరకెక్కిస్తూ.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ బాక్సాఫీస్ దగ్గర కోట్లలో కలెక్షన్స్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఈ స్పై యూనివర్స్‌లో భాగం కాగా.. త్వరలోనే మరో ఖాన్ కూడా ఇందులో జాయిన్ అవ్వనున్నాడని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు సల్మాన్. ‘వీరు’గా సల్మాన్ ఖాన్, ‘జై’గా షారుఖ్ ఖాన్.. స్పై యూనివర్స్‌లో పాపులారిటీని సంపాదించుకోగా.. దీని గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను బయటపెట్టాడు సల్మాన్ ఖాన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రణబీర్, ప్రభాస్‌లతో సందీప్ వంగా సినిమాటిక్ యూనివర్స్!
ఒకప్పుడు కేవలం హాలీవుడ్‌లో మాత్రమే ఫేమస్ అయిన సినిమాటిక్ యూనివర్స్ ఫార్ములా.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లోకి కూడా వచ్చేసింది. ముఖ్యంగా సౌత్‌లో ఈ సినిమాటిక్ యూనివర్స్ ఫార్ములా కూడా విపరీతమైన పాపులారిటీ పెరిగిపోతోంది. అందుకే ఏ దర్శకుడు ఏ సినిమా చేసినా కూడా దాంతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. తాజాగా సందీప్ రెడ్డి వంగా విషయంలో కూడా అదే జరుగుతోంది. నాలుగేళ్ల తర్వాత ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు సందీప్. అయితే ఇతర దర్శకులలాగానే సందీప్ కూడా ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'కోట బొమ్మాళి'ని ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడాలంటే?
శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఇందులో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget