అన్వేషించండి

Sandeep Reddy Vanga: రణబీర్, ప్రభాస్‌లతో సందీప్ వంగా సినిమాటిక్ యూనివర్స్!

Prabhas: రణబీర్ కపూర్, ప్రభాస్.. ఈ ఇద్దరితో సినిమాలు చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. అయితే వీరిద్దరిని కలిపి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారా అనే ప్రశ్నకు సందీప్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.

Prabhas - Ranbir Kapoor : ఒకప్పుడు కేవలం హాలీవుడ్‌లో మాత్రమే ఫేమస్ అయిన సినిమాటిక్ యూనివర్స్ ఫార్ములా.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లోకి కూడా వచ్చేసింది. ముఖ్యంగా సౌత్‌లో ఈ సినిమాటిక్ యూనివర్స్ ఫార్ములా కూడా విపరీతమైన పాపులారిటీ పెరిగిపోతోంది. అందుకే ఏ దర్శకుడు ఏ సినిమా చేసినా కూడా దాంతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. తాజాగా సందీప్ రెడ్డి వంగా విషయంలో కూడా అదే జరుగుతోంది. నాలుగేళ్ల తర్వాత ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు సందీప్. అయితే ఇతర దర్శకులలాగానే సందీప్ కూడా ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
ఇటీవల విడుదలయిన ‘యానిమల్’ ట్రైలర్.. ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యూత్‌కు నచ్చేలా సినిమాలు తెరకెక్కిస్తాడంటూ ఇప్పటికే ప్రేక్షకుల్లో సందీప్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ‘యానిమల్’ మూవీ డ్యూరేషన్ ఎక్కువ అయినా కూడా చాలామంది ఇది హిట్ అవుతుందని నమ్ముతున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది. దానికి సందీప్ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్‌ను సంతోషానికి గురిచేస్తోంది. ఎందుకంటే ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’కు సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి. ప్రస్తుతం ప్రభాస్‌కు, సందీప్‌కు కమిట్మెంట్స్ ఉండడం వల్ల ‘స్పిరిట్’ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోవడం లేదు. కానీ తాజాగా ‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆ మూవీ గురించి ప్రశ్న.. ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచేసింది.

కచ్చితంగా చెప్తా..
‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘‘ఈ సినిమా స్పై యూనివర్స్, కాప్ యూనివర్స్‌లాగా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ అయితే ప్రభాస్ అందులో ఉంటాడా?’’ అని సందీప్‌ను ప్రశ్నించాడు రణబీర్. దానికి సమాధానంగా ‘‘నేను దాని గురించి ఆలోచించలేదు. ఒకవేళ జరిగితే.. కచ్చితంగా చెప్తా’’ అన్నాడు సందీప్. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘యానిమల్’లో రణబీర్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్‌గా ఉందో.. ‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఊహించుకోవడం మొదలుపెట్టారు.

రణబీర్, ప్రభాస్ ఒకే స్క్రీన్‌పై..
ప్రస్తుతం సందీప్.. ‘యానిమల్’ సినిమాలో బిజీగా ఉండగా.. ‘స్పిరిట్’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉంది. పైగా ప్రభాస్‌కు కూడా బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ ఉండడంతో అవన్నీ పూర్తయ్యే వరకు సందీప్ వేచిచూడాల్సిందే. అయితే ‘యానిమల్’, ‘స్పిరిట్’లాంటి రెండు సినిమాలు ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో కలవడం అనేది చాలా ఆసక్తికరంగా ఉందని, అది నిజంగానే జరిగితే బాగుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. రణబీర్ కపూర్, ప్రభాస్‌లాంటి ఇద్దరు స్టార్లు ఒకే స్క్రీన్‌పై, ఒకే సినిమాలో కనిపిస్తే.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయని అనుకుంటున్నారు. కానీ ‘స్పిరిట్’కంటే ముందు ‘యానిమల్’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాలి సందీప్ వంగా. డిసెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుండగా.. మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Also Read: పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు, డిస్ట్రిబ్యూటర్లు పారిపోయారు - కానీ, ఊహించని హిట్ కొట్టి, విలన్‌ను సూపర్ స్టార్ చేేసిన మూవీ ఇది!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Embed widget