అన్వేషించండి

Shah Rukh Khan: పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు, డిస్ట్రిబ్యూటర్లు పారిపోయారు - కానీ, ఊహించని హిట్ కొట్టి, విలన్‌ను సూపర్ స్టార్ చేేసిన మూవీ ఇది!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో ఒక సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోగా.. దాని వెనుక కష్టాలను మరోసారి గుర్తుచేసుకున్నారు ఫ్యాన్స్.

కొన్నిసార్లు కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాలు కూడా ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా అనేక దశల్లో ఎన్నో ఇబ్బందులు పడుంటాయి. అలాంటి ఒక క్లాసిక్ సినిమానే తాజాగా 30 ఏళ్లు పూర్తిచేసుకుంది. అదే షారుఖ్ నటించిన ‘బాజీగర్’. ఒక సినిమాకు ఎన్ని కష్టాలు రావాలో.. అన్ని కష్టాలు వచ్చాయని.. ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షారుఖ్ ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. అసలైతే ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ షారుఖ్ కాదట.. పలువురు సూపర్ స్టార్ల దగ్గరకు వెళ్లిన ఈ స్క్రిప్ట్.. అందరినీ దాటుకుంటూ షారుఖ్ దగ్గరకు వచ్చి చేరుకుంది. అంతే కాకుండా షూటింగ్ ప్రారంభమయిన తర్వాత కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొందట ‘బాజీగర్’.

సీనియర్ హీరోలు రిజెక్ట్ చేశారు..
అబ్బాస్, ముస్తాన్ దర్శకత్వం వహించిన ‘బాజీగర్’లో అజయ్/విక్కీ పాత్రలో కనిపించాడు షారుఖ్ ఖాన్. ఈ మూవీ విడుదల తర్వాత ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందంటే.. ప్రేక్షకులంతా షారుఖ్‌ను స్వయంగా ‘బాజీగర్’ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ ముందుగా ఈ రోల్ కోసం అక్షయ్ కుమార్‌ను అడిగారట దర్శకులు. కానీ అలాంటి పాత్ర తాను చేయను అని రిజెక్ట్ చేశాడట అక్షయ్. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తాము నటించమని ‘బాజీగర్’ను పక్కన పెట్టేశారట. ఇక అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చి.. హీరోగా వెలిగిపోతున్న షారుఖ్ చేతికి ‘బాజీగర్’ కథ వెళ్లింది. 

మళ్లీ షూట్ చేశారు..
‘బాజీగర్’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో అని మేకర్స్‌కు అనుమానం వచ్చింది. అందుకే ఒక ట్రయల్ షోను వేసి చూశారు. ట్రయల్ షో తర్వాత షారుఖ్ అమ్మాయిలను చంపుతున్నాడు. కానీ అసలు ఎందుకు చంపుతున్నాడు. దాని వెనుక ఏదో ఒక కారణం ఉండాలి కదా అని రివ్యూలు వచ్చాయట. దీంతో ఆ క్యారెక్టర్‌కు ఒక కథ కావాలని డిసైడ్ అయిన దర్శకులు.. అనంత్ మహదేవన్‌ను షారుఖ్ తండ్రిగా, రాఖీ గుల్జర్‌ను తల్లిగా పెట్టి కొన్ని సీన్స్ షూట్ చేసి సినిమాకు యాడ్ చేశారు. ఆ తర్వాత ‘బాజీగర్’కు వచ్చిన రెస్పాన్స్.. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ చేసింది.

డిస్ట్రిబ్యూటర్లు పారిపోయేవారు..
అంతా అయిపోయి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే మిగిలింది అనుకున్న సమయంలో కూడా ట్రయల్ షో చూసి.. ‘బాజీగర్’ను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు అసలు ముందుకు రాలేదట. ఒకరి తర్వాత ఒకరు డిస్ట్రిబ్యూటర్లు ట్రయల్ షోకు వచ్చి వెళ్లేవారని, ఎవరైనా ఇష్టపడి సినిమాను కొనకపోతారా అని షారుఖ్ ఖాన్, అబ్బాస్, ముస్తాన్‌తో పాటు మూవీ టీమ్ అంతా ఆశగా ఎదురుచూసేవారని దలీప్ తాహిల్ బయటపెట్టాడు. హీరోయిన్స్‌ను చంపే హీరో సినిమాను ఎవరు చూస్తారు అనేవారట డిస్ట్రిబ్యూటర్లు. కానీ అన్ని అడ్డంకులను దాటి 1993లో ‘బాజీగర్’.. థియేటర్లలో విడుదలయ్యింది. షారుఖ్ ఖాన్ కెరీర్‌లో ఇది ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది. షారుఖ్ కెరీర్‌లో ఎన్నో టర్నింగ్ పాయింట్స్ ఉండగా.. ఈ హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయగలడు అని దర్శకులకు ముందుగా నమ్మకం ఇచ్చిన చిత్రం మాత్రం ‘బాజీగర్’.

Also Read: ‘యానిమల్‌’లోనూ అదే ఫార్ములా - అరే బాబు, ఆ గన్‌ను విడిచిపెట్టరా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget