అన్వేషించండి

Animal Movie: ‘యానిమల్‌’లోనూ అదే ఫార్ములా - ఆ గన్‌ను విడిచిపెట్టరా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రంలో ఒక రొటీన్ ఫార్ములాను ఉపయోగించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఒక ఫార్ములాతో ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే.. ఇక తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తుంటాయి. కొన్నాళ్లకు ఈ ఫార్ములా చూసి ఆడియన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుంది. అయితే యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా అలాంటి ఒక ఔట్‌డేటెడ్ సక్సెస్ ఫార్ములాను తన ‘యానిమల్’ మూవీలో ఉపయోగించడం.. తన ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సందీప్. ఇక తాజాగా విడుదలయిన ‘యానిమల్’ ట్రైలర్ చూస్తుంటే.. ఈ ఔట్‌పుట్ కోసం నాలుగేళ్లు ఆగడంలో తప్పు లేదని కొందరు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కానీ మొత్తం ట్రైలర్‌లో ఒక షాట్ మాత్రం చాలామందిని డిసప్పాయింట్ చేసింది.

యాక్షన్‌తో నిండిపోయిన ‘యానిమల్’ ట్రైలర్..
తన తరువాతి సినిమాతో వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటికే ఛాలెంజ్ చేశాడు. అనుకున్నట్టుగానే ‘యానిమల్’లో వైలెన్స్‌కు కొత్త అర్థం చెప్పేలా ఉన్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పైగా సందీప్ రాసుకున్న వైలెంట్ పాత్రకు రణబీర్ కపూర్ ప్రాణం పోశాడు. హ్యాండ్‌సమ్ హీరో రణబీర్.. ఇప్పటివరకు ఇంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఎప్పుడూ కనిపించలేదు. ట్రైలర్ మొదలయిన దగ్గర నుండే తన పాత్ర ఎలా ఉంటుందో స్పష్టంగా చూపించాడు సందీప్. ట్రైలరే ఇలా ఉందంటే.. ఇక మూడు గంటలు థియేటర్‌లో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ట్రైలర్ మొత్తం కొత్తగా, డిఫరెంట్‌గా అనిపించినా.. కేవలం ఒక్క షాట్‌ మాత్రం రొటీన్‌గా అనిపించింది అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మెషీన్ గన్ ఫార్ములా..
‘ఖైదీ’ దగ్గర నుండి ‘విక్రమ్’ వరకు, ‘కేజీఎఫ్’ దగ్గర నుండి ‘వాల్తేరు వీరయ్య’ వరకు దర్శకులంతా ఒక రొటీన్ సక్సెస్ ఫార్ములాను ఉపయోగించారు. అదే మామూత్ మెషీన్ గన్. ముందుగా ‘ఖైదీ’ చిత్రంలో కార్తీ.. దీనిని ఉపయోగించినప్పుడు స్క్రీన్‌పై దానిని చూసిన ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్.. మళ్లీ ఈ గన్‌ను ‘విక్రమ్’లో చూసినప్పుడు కామన్‌గా ఫీలయ్యారు. మెల్లగా ప్రతీ దర్శకుడు ఏదో ఒక యాక్షన్ సీన్‌లో ఈ గన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టాడు. ‘యానిమల్’ ట్రైలర్ మొత్తంలో యాక్షన్‌ను డిఫరెంట్‌గా చూపించిన దర్శకుడు.. ఒక్క షాట్‌లో మాత్రం ఈ మెషీన్ గన్‌ను ఉపయోగించినట్టు చూపించాడు. దీంతో మళ్లీ ఈ గన్‌ను తెరపై చూడాలా అన్నట్టుగా ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతున్నారు.

డిసెంబర్ 1న రిలీజ్..
రణబీర్ కపూర్, రష్మిక మందనా జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఈ చిత్రం విడుదల కానుంది. డ్యూరేషన్ విషయంలో ప్రేక్షకులు కాస్త అనుమానంతో ఉన్నా.. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు ఆ మాత్రం నిడివి ఉండాలేమో అని పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. రణబీర్ సైతం ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రణబీర్‌తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: ఇంటర్నేషనల్ ఓటీటీకి 'ఆదికేశవ' - వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget