అన్వేషించండి

Shahrukh Khan: బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్! సల్మాన్, షారుఖ్‌తో పాటు మరో స్టార్ హీరో!

YRF Spy universe: ఇప్పటికే బాలీవుడ్‌లోని స్పై యూనివర్స్‌లో షారుఖ్, సల్మాన్.. తమ యాక్షన్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా.. మరో హీరో కూడా ఇందులో జాయిన్ అవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

హాలీవుడ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ అనే ఐడియాను ముందుగా ఇండియన్ సినిమాల్లోకి తీసుకొచ్చింది బాలీవుడ్. స్పై యూనివర్స్ అనేది ప్రారంభించి ఖాన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు తెరకెక్కిస్తూ.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ బాక్సాఫీస్ దగ్గర కోట్లలో కలెక్షన్స్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఈ స్పై యూనివర్స్‌లో భాగం కాగా.. త్వరలోనే మరో ఖాన్ కూడా ఇందులో జాయిన్ అవ్వనున్నాడని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు సల్మాన్. ‘వీరు’గా సల్మాన్ ఖాన్, ‘జై’గా షారుఖ్ ఖాన్.. స్పై యూనివర్స్‌లో పాపులారిటీని సంపాదించుకోగా.. దీని గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను బయటపెట్టాడు సల్మాన్ ఖాన్.

2023 మొదట్లో విడుదలయిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కూడా స్పై యూనివర్స్‌లో ఒక భాగంగానే తెరకెక్కింది. ఈ మూవీతో వందల కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు బాలీవుడ్ బాద్‌షా. అయితే ‘పఠాన్’ కోసం సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. దీంతో సల్మాన్ ఇటీవల నటించిన ‘టైగర్ 3’లో గెస్ట్ రోల్ చేసి సల్మాన్ చేసిన సాయాన్ని తనకే తిరిగి ఇచ్చేశాడు షారుఖ్. అయితే టైగర్‌గా సల్మాన్, పఠాన్‌గా షారుఖ్.. ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఇద్దరూ కలిసి త్వరలోనే ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అనే చిత్రం రానుందని యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ స్పై యూనివర్స్‌కు మరింత హైప్ క్రియేట్ చేయడానికి మరో ఖాన్ కూడా జాయిన్ అయితే బాగుంటుందని సల్మాన్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఆ ఖాన్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది..
అమర్ ఖాన్ కూడా స్పై యూనివర్స్‌లో జాయిన్ అయితే బాగుంటుందని తన కోరికను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు సల్మాన్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎప్పుడూ ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేస్తూ.. ఒకరి మూవీలో మరొకరు గెస్ట్ రోల్స్ చేస్తూ ఉంటారు. కానీ అమీర్ అలా కాదు.. ఎప్పుడూ తన సినిమాలతో తానే బిజీగా ఉంటాడు. ఇతరుల సినిమాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోడు. అలాంటి అమీర్ కూడా తమతో పాటు స్పై యూనివర్స్‌లో కలిస్తే.. ముగ్గురు ఖాన్స్ కలిసి బాక్సాఫీస్‌ను షేక్ చేయవచ్చని సల్మాన్.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అమీర్ లాంటి హీరో.. ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలలో నటించడానికే ఇష్టపడతాడు. తన సినిమా అందరికీ నచ్చేలా ఉండాలని అనుకుంటాడు. కేవలం యాక్షన్ లవర్స్‌కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా తన చిత్రాలు నచ్చాలని అనుకుంటాడు. మరి ఆ హీరో ఇలాంటి స్పై యూనివర్స్‌లో చేరడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.

యంగ్ జెనరేషన్ హీరోలపై సల్మాన్ వ్యాఖ్యలు..
90ల్లోని హీరోలు కలిసి సినిమాలు చేయడానికి, స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కానీ యంగ్ జెనరేషన్ మాత్రం అలా కాదని సల్మాన్ ఖాన్ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏవేవో కారణాలు చెప్పి మల్టీ స్టారర్లు చేయకుండా తప్పించుకుంటారని యంగ్ జెనరేషన్ హీరోలపై వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు తన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం లేదు అనే సమయంలో సన్నీ డియోల్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్‌లాంటి హీరోలతో మల్టీ స్టారర్లు చేసి హిట్ కొట్టానని తన సక్సెస్ ఫార్ములాను బయటపెట్టాడు సల్మాన్. ఇక తాజాగా తను విడుదల చేసిన ‘టైగర్ 3’ చిత్రం కేవలం 11 రోజుల్లోనే రూ.250 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read: రణబీర్, ప్రభాస్‌లతో సందీప్ వంగా సినిమాటిక్ యూనివర్స్!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget