Kotabommali PS movie OTT: 'కోట బొమ్మాళి'ని ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడాలంటే?
Kotabommali PS OTT Platform: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా?
Kotabommali PS movie OTT release date: శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఇందులో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయ్యింది.
'ఆహా' ఓటీటీకి 'కోట బొమ్మాళి పీఎస్'
Kotabommali PS movie digital rights acquired by AHA Telugu OTT: 'కోట బొమ్మాళి పీఎస్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ సినిమా డిజిటల్ పార్ట్నర్ 'ఆహా' అని చిత్ర బృందం పేర్కొంది.
'ఆహా' ఓటీటీలో 'కోట బొమ్మాళి పీఎస్' ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. బహుశా... న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండగ సందర్భంగా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?
View this post on Instagram
తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్!
Kotabommali PS movie director: 'కోట బొమ్మాళి పీఎస్' చిత్రాన్ని యువ దర్శకుడు తేజా మార్ని తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగా పరిచయమైన 'జోహార్' డైరెక్టుగా ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ సినిమా విమర్శకులతో పాటు వీక్షకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా తర్వాత శ్రీ విష్ణు కథానాయకుడిగా 'అర్జున ఫాల్గుణ' తీశారు. ఇప్పుడు మూడో సినిమాగా మలయాళ హిట్ 'నాయట్టు'ను 'కోట బొమ్మాళి పీఎస్'గా రీమేక్ చేశారు.
Also Read: ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
'కోట బొమ్మాళి' రీమేక్ సినిమా అయినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలను కథకు అద్దడంలోనూ, మన నేటివిటీకి తగ్గట్లు సినిమా తీయడంలోనూ దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
'కోట బొమ్మాళి పీఎస్' సినిమాలో హోమ్ మంత్రి పాత్రలో మురళీ శర్మ నటించారు. ఆయన పాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో బెనర్జీ, దయానంద్, సివిఎల్ నరసింహారావు, ప్రవీణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి, మాటలు : నాగేంద్ర కాశి, కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం : గాంధీ నడికుడికర్, సంగీతం : రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అజయ్ గద్దె, కాస్ట్యూమ్ డిజైనర్ : అపూర్వ రెడ్డి.