అన్వేషించండి

‘ఏ వతన్ మేరే వతన్’ రివ్యూ, ‘పారిజాత పర్వం’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఏ వతన్ మేరే వతన్ రివ్యూ: Prime Videoలో దేశభక్తి సినిమా - సారా అలీ ఖాన్ ఎలా నటించారు? మూవీ బావుందా?
సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దేశభక్తి సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అండర్ గౌండ్ రేడియో నిర్వహణ ద్వారా ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపిన ఉషా మెహతా జీవితం స్ఫూర్తితో రూపొందింది. ఉషా పాత్రలో సారా అలీ ఖాన్ నటించగా... రామ్ మనోహర్ లోహియా పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించారు. ఈ దేశభక్తి సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'కార్తీక దీపం 2'లో అదే దీప, కార్తీక్‌.. అవే ఎమోషన్స్ చూస్తారు - కానీ ఇది కొత్త కథ
బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం ఒక సీరియల్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను జరుపుకుంది. అదే వన్‌ అండ్ ఓన్లీ కార్తీక దీపం సీరియల్‌. బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ సీరియల్‌కు ఇప్పుడు పార్ట్‌ వస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఈ సిరీయల్‌ టెలికాస్ట్‌ కాబోతున్న సందర్భంగా నేడు (మార్చి 21) ప్రసాద్‌ లాబ్స్‌లో ప్రివ్యూ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప, కార్తీక్‌తో పాటు మూవీ నిర్మాతలు, డైరెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప అలియాస్‌ ప్రేమి విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. మళ్లీ దీప, కార్తీక్‌ని తీసుకువస్తున్న మా మూవీ డైరెక్టర్‌, నిర్మాతలకు, రైటర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్తీక దీపం మళ్లీ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'కార్తీక దీపం' ఫస్ట్‌ సీజన్‌ అయిపోయినప్పుడు మళ్లీ వస్తామని అప్పడే చెప్పాను. వచ్చేస్తుంది కార్తీక దీపం. మళ్లీ మమ్మల్నీ మీ ముందుకు తీసుకువస్తున్న మా దర్శక-నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే నా డాక్టర్‌ బాబుకి కూడా థ్యాంక్స్‌" అంటూ దీప ఆనందం వ్యక్తం చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఛాన్సుల కోసం క్యారెక్టర్‌ను వదులుకోను, ‘పుష్ప-2’ షూటింగులో నన్ను తోసేశారు - దివి
బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ షో తర్వాత ఆమె నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా, సహాయ నటిగా రాణిస్తోంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా ‘లంబసింగి’ అనే సినిమాలో చేసింది. భర్త్ రాజ్ హీరోగా, నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ లభించింది. దివి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

జపాన్‌లో రాజమౌళి కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం - భయం మొదలైందంటూ కార్తికేయ ట్వీట్
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి జపాన్ పర్యటనలో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాలాకాలం బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ప్రస్తుతం మహేశ్‌ బాబుతో చేయనున్న మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికోసమే ఆయన జపాన్ వెళ్లారు. తనతో పాటు తన కుమారుడు కార్తికేయ కూడా జపాన్ పర్యటనలో భాగమయ్యాడు. అయితే తాజాగా అక్కడ భూమి కంపించింది. ఈ భూకంపాన్ని రాజమౌళితో పాటు తన కుమారుడు కార్తికేయ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. జపాన్‌లో భూకంపం విషయాన్ని కార్తికేయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం తను షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘పారిజాత పర్వం’ టీజర్ - కిడ్నాప్ అనేది క్రైమ్ కాదు, ఒక ఆర్ట్.. ఏం చెప్పాలనుకుంటున్నార్రా?
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన తాజా చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్, డిఫరెంట్ పోస్టర్స్ అన్నిటికీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ ను ఆవిష్కరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget