అన్వేషించండి

Actress Divi: ఛాన్సుల కోసం క్యారెక్టర్‌ను వదులుకోను, ‘పుష్ప-2’ షూటింగులో నన్ను తోసేశారు - దివి

సినిమా అవకాశాలు ఇస్తాం.. మాకేంటి? అన్నవాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని నటి దివి వెల్లడించింది. అయినా, సినిమాల కోసం క్యారెక్టర్ ను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

Actress Divi About Allu Arjun: బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ షో తర్వాత ఆమె నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా, సహాయ నటిగా రాణిస్తోంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా ‘లంబసింగి’ అనే సినిమాలో చేసింది. భర్త్ రాజ్ హీరోగా, నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ లభించింది. దివి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి కీలక విషయాలు వెల్లడించింది.   

సుకుమార్ మూవీలో నటించడం అదృష్టం, బన్నీ కష్టం చూసి షాకయ్యా!

ప్రస్తుతం దివి ‘పుష్ప‘ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గురించి ఆమె కీలక విషయాలు వెల్లడించింది. ‘‘పుష్ప 2.. షూటింగ్ చాలా బాగా కొనసాగుతోంది. ఇందులో రిపోర్టర్ గా కనిపిస్తాను. రిపోర్టర్ క్యారెక్టర్ అంత కష్టం అని నాకు తెలియదు. సెట్ లో తోసుకుంటూ వెళ్లిపోతే పడిపోయాను. సుకుమార్ గారు వెరీ వెరీ గుడ్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైనా తప్పు చేస్తే మైక్ లో చెప్పకుండా దగ్గరికి వచ్చి విషయాన్ని వివరిస్తారు. అలా కాదు, ఇలా చేయండి అని చెప్తారు. ఆయన మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. ప్రతి వ్యక్తికి ఇంపార్టెన్సీ ఇస్తారు” అని చెప్పింది.

బన్నీ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది!

‘పుష్ప 2’ కోసం అల్లు అర్జున్ పడే కష్టాన్ని చూసి షాక్ అయినట్లు దివి వెల్లడించింది. “బన్నీతో కలిసి నేను షూటింగ్ లో పాల్గొన్నాను. ఆయన సెట్స్ లో క్షణం తీరిక లేకుండా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆయన గురించి తెలియక ముందుకు డ్యాన్స్ విషయంలో నేను తనను ఇన్ స్ప్రేషన్ గా తీసుకునేదాన్ని. కానీ, ఆయనతో షూట్ లో పాల్గొన్నాక, సినిమా కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అర్థం అయ్యింది. అందుకే ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. సుమార్ గారి దర్శకత్వంలో మినిమం 5 టేకులు ఉంటాయి. కానీ, ఓ సీన్ విషయంలో పదుల సంఖ్యలో టేకులు తీసుకున్నారు. అయినా, బన్నీ ఎంతో ఓర్పుతో చేశారు. నిజంగా ఆయన గ్రేట్” అని వెల్లడించింది.

సినిమాల కోసం క్యారెక్టర్ ను వదులుకోను!

‘పుష్ప 2’ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నట్లు దివి వెల్లడించింది. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర అవుతానని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తాం.. మాకేంటి? అనేవాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పింది. కానీ, అవకాశాల కోసం క్యారెక్టర్ ను వదులుకోనని వెల్లడించింది. సెల్ఫ్ రెస్పెక్ట్ ను కాదని సినిమాలు చేయలేను.. సినిమా అవకాశం కోసం కాంప్రమైజ్ కానని తెలిపింది.

Read Also: ఈవీవీ.. నీకు పొగరా అని అడిగారు, చాలామంది నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టారు: నటి లతాశ్రీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget