అన్వేషించండి

Paarijatha Parvam Teaser: ‘పారిజాత పర్వం’ టీజర్ - కిడ్నాప్ అనేది క్రైమ్ కాదు, ఒక ఆర్ట్.. ఏం చెప్పాలనుకుంటున్నార్రా?

Paarijatha Parvam Teaser: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పారిజాత పర్వం’. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. 

Paarijatha Parvam Teaser: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన తాజా చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్, డిఫరెంట్ పోస్టర్స్ అన్నిటికీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ ను ఆవిష్కరించారు.

'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అనే లైన్ తో ప్రధాన పాత్రలను పరిచయం చేయటంతో ప్రారంభమైన ఈ 'పారిజాత పర్వం' టీజర్ ఆద్యంతం ఆసక్తకరంగా సాగింది. కథంతా కిడ్నాపుల చుట్టూనే తిరుగుతుందని అర్థమవుతోంది. అమాయకుల మధ్యలో ఓ డెవిల్ ఉన్నాడని చెప్పిన తర్వాత అసలైన డ్రామా మొదలవుతుంది. యాక్షన్, డ్రామా, ఫన్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ కలబోసిన ఈ టీజర్ ప్రేక్షకులని అలరిస్తోంది.

ఇందులో చైతన్య రావు, వైవా హర్ష కలిసి ఏదో కిడ్నాప్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిగా సునీల్ ను చూపించారు. అతని చేతిపై 'జై మెగాస్టార్' అనే టాటూని బట్టి చూస్తే, చిరంజీవిలా స్వయంకృషితో ఎదగాలని సిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. సునీల్ ఓవైపు యాక్షన్ లో అదరగొడుతూనే, మరోవైపు ఓ గ్యాంగ్ కు లీడర్ గా కనిపిస్తున్నాడు. దీంట్లో గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్ పాత్ర కీలకంగా ఉంటుందనిపిస్తోంది.

Also Read: ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో అల్లు అర్జున్ - ఇదంతా 'పుష్ప 2' కోసమేనా?

'పారిజాత పర్వం' టీజర్ చివర్లో 'జై అంటూ పని మనిషిని తీసుకొచ్చామా' అంటూ వైవా హర్ష, చైతన్య రావుల మధ్య వచ్చే సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడు సంతోష్ కంభంపాటి ఓ హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారని ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలవలు ఉన్నతంగా వున్నాయి.

'పారిజాత పర్వం' చిత్రంలో మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, టార్జాన్, గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రీ సంగీతం సమకూర్చగా.. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి సశాంక్ ఉప్పుటూరి ఎడిటింగ్ చేస్తున్నారు. అయితే, కిడ్నాప్‌ను ఆర్ట్‌గా చెప్పడంపై వివిధ కామెంట్లు వస్తున్నాయి. అసలు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారా అని అంటున్నారు. 

వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై  మహీధర్ రెడ్డి, దేవేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనంత సాయి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. 30 వెడ్స్ 21 సిరీస్, కీడా కోలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావు.. 'పారిజాత పర్వం' చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Also Read: సోషల్ మీడియాలోనూ తగ్గేదేలే.. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Embed widget